Saif Ali Khan – Kareena Kapoor : బాలీవుడ్ స్టార్ కపుల్స్ లో కరీనా కపూర్ (Kareena Kapoor), సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) జంట కూడా ఒకటి. గత కొంతకాలంగా జరిగిన కత్తి దాడి కారణంగా ఈ ఫ్యామిలీ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. కానీ తాజాగా ఈ జంట డివోర్స్ తీసుకోబోతోంది అనే రూమర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దానికి కారణం స్వయంగా కరీనా కపూర్. నెట్టింట ఆమె చేసిన ఓ పోస్ట్ ఈ జంట విడాకులు తీసుకోబోతోంది అనే ఊహాగానాలకు దారి తీసింది.
కరీనా పోస్ట్ లో ఏముందంటే ?
బాంద్రా లోని సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో రీసెంట్ గా దోపిడీకి ప్రయత్నం జరగగా, ఆ టైంలో దొంగను అడ్డుకోబోయిన సైఫ్ కత్తి పోట్లకు గురైన సంగతి తెలిసిందే. ఈ దాడి నుంచి ఇంకా సైఫ్ అలీ ఖాన్ ఫ్యామిలీ కోలుకోక ముందే, ఈ జంట విడిపోతున్నారనే రూమర్లు మొదలయ్యాయి. తాజాగా కరీనా కపూర్ చేసిన ఓ ఇన్ డైరెక్ట్ పోస్ట్ ఈ రూమర్లకు ఆజ్యం పోసింది.
ఆ పోస్టులో కరీనా కపూర్ “పెళ్లిళ్లు, విడాకులు, టెన్షన్స్, చైల్డ్ బర్త్, ఇష్టపడిన వ్యక్తి చనిపోవడం, పిల్లల పెంపకం… ఇవన్నీ మీకు జరిగే వరకు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. జీవితంలోని సిద్ధాంతాలు, అంచనాలు వాస్తవాలు కాదు. మీ వంతు వచ్చినప్పుడు, మిమ్మల్ని జీవితం మార్చే వరకు, అసలు పరిస్థితి ఏంటో అర్థం కాదు. అప్పటిదాకా మనం చాలామంది కంటే తెలివైన వాళ్ళం అని అనుకుంటాము” అంటూ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో షేర్ చేసింది కరీనా కపూర్.
అయితే కరీనాకపూర్ నుంచి ఊహించని సందేశం ఊడిపడడం ఆమె అభిమానులను అయోమయంలో పడేసింది. దీంతో ఒక్కసారిగా కరీనా కపూర్ ఫ్యాన్స్ “మీ ఇద్దరి మధ్య అంతా బాగానే ఉంది కదా?” అని ప్రశ్నిస్తున్నారు. మరి కరీనా ఎవరినైనా ఇన్ డైరెక్ట్ గా దెప్పి పొడిచిందా ? లేదంటే విడాకులపై ఇలా హింట్ ఇచ్చిందా ? అనేది తెలియాల్సి ఉంది.
కరీనా టెన్షన్ ఇదేనా ?
జనవరి 16న జరిగిన దాడి సైఫ్ కుటుంబాన్ని ఇప్పటికే దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆ దాడి కారణంగా సైఫ్ కి ఆరుసార్లు కత్తిపోట్లు తగలగా, ఆపరేషన్ అనంతరం మూడు రోజులు హాస్పిటల్లో ఉండి డిశ్చార్జ్ అయ్యారు ఆయన. ఈ నేపథ్యంలో తమ ఫ్యామిలీ భద్రత గురించి తీవ్ర ఆందోళన చెందుతోంది కరీనా.
‘తశాన్’ సెట్స్ లో ఈ జంట తొలిసారి ప్రేమలో పడ్డారు. అప్పటి నుంచి ఈ సైఫ్ – కరీనా తమ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. 2012 అక్టోబర్ 16న సైఫ్, కరీనా కపూర్ గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకి తైమూర్, జెహ్ అనే ఇద్దరు వారసులు కూడా ఉన్నారు. మరి ఇలాంటి టైంలో కరీనా కపూర్ అలాంటి పోస్ట్ చేయడం వెనుక ఉన్న అర్థం ఏంటో ఆరా తీసే పనిలో పడ్డారు నెటిజన్లు. ఆమె అభిమానులు మాత్రం ఈ జంట విడాకులు తీసుకోకూడదని ప్రార్థిస్తున్నారు.