Toxic Movie: కేవలం ఒకేఒక్క సినిమాతో నటీనటుల జీవితాలు పూర్తిగా మారిపోవడం తరచుగా చూస్తూనే ఉంటాం. అలా హీరో యశ్ జీవితాన్ని, కెరీర్‌ను పూర్తిగా మార్చేసిన సినిమా ‘కేజీఎఫ్’. ఈ మూవీ వల్ల కేవలం యశ్ కెరీర్ మాత్రమే కాదు.. శాండిల్‌వుడ్ రూపురేఖలే మరిపోయాయి. అప్పటివరకు ఇండియాలో కన్నడ సినిమాకు అంతగా మర్కెట్ లేదు. అలాంటిది ఒక గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కిన ‘కేజీఎఫ్’.. అన్నింటిని మార్చేసింది. అలా యశ్‌కు హీరోకు విపరీతమైన స్టార్‌డమ్ లభించింది. ‘కేజీఆఫ్’ తర్వాత ‘టాక్సిక్’తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాడు యశ్. ఇప్పుడు ఈ మూవీ నుండి ఒక ఆసక్తికర అప్డేట్ బయటికొచ్చింది.
కీలక అప్డేట్
‘కేజీఎఫ్’ రెండు చాప్టర్స్ తర్వాత యశ్‌ను మళ్లీ ఎప్పుడెప్పుడు తెరపై చూద్దామా అని ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ ఇప్పటివరకు ఈ హీరో నుండి మరో మూవీ రాలేదు. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘టాక్సిక్’తోనే ఫుల్ బిజీగా గడిపేస్తున్నాడు యశ్. ఈ మూవీ షూటింగ్ ప్రారంభమయిన ఇన్నాళ్ల తర్వాత దీనికి సంబంధించిన గ్లింప్స్ ఒకటి తాజాగా బయటికొచ్చింది. అంతకు మించి ఈ సినిమా నుండి పెద్దగా అప్డేట్స్ ఏమీ బయటికి రావడం లేదు. ముఖ్యంగా ఇందులో నటిస్తున్న హీరోయిన్స్ ఎవరు అనే విషయంపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగిపోతుండగా దానిపై తాజాగా ఒక బాలీవుడ్ నటుడు క్లారిటీ ఇచ్చాడు.
సీక్రెట్ రివీల్
‘టాక్సిక్’ (Toxic) సినిమాలో కీలక పాత్రలో నటించడానికి బాలీవుడ్ నటుడు అక్షయ్ ఓబ్రాయ్ (Akshay Oberoi)ను రంగంలోకి దించారు మేకర్స్. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అక్షయ్.. ‘టాక్సిక్’ గురించి కీలక విషయాలు బయటపెట్టేశాడు. ముందుగా ఈ సినిమాలో నటించడానికి బీ టౌన్ సీనియర్ హీరోయిన్ అయిన కరీనా కపూర్‌ను అప్రోచ్ అయ్యారు మేకర్స్. తను కూడా ఈ మూవీని ఒప్పుకుందని వార్తలు వచ్చినా.. రెమ్యునరేషన్ లాంటి పలు విషయాలు వల్ల ‘టాక్సిక్’ను రిజెక్ట్ చేసిందట. ఆ విషయంపై అక్షయ్ ఓబ్రాయ్ క్లారిటీ ఇచ్చాడు. అంతే కాకుండా ఆ స్థానంలోకి నయనతార వచ్చి చేరిందని రివీల్ చేశాడు.
Also Read: సోషల్ మీడియాలో ఫేక్ ఫోటో వైరల్, స్పందించిన మాళవికా.. మరీ ఇంత దారుణమా.?
రూమర్స్‌పై క్లారిటీ
‘టాక్సిక్’లో యశ్‌కు జోడీగా కియారా అద్వానీ (Kiara Advani) నటిస్తుండగా.. మరొక కీలక పాత్రలో నయనతార కనిపించనుంది. నయనతార (Nayanthara)తో, యశ్ (Yash)తో తను కలిసి నటించే సీన్స్ ఉంటాయని అక్షయ్ ఓబ్రాయ్ చెప్పుకొచ్చాడు. దీంతో నయనతార ‘టాక్సిక్’లో ఉందని తెలియగానే ప్రేక్షకుల అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. పైగా ఇంతకాలం ఈ మూవీలో కరీనా కపూర్ నటిస్తుందని వస్తున్న రూమర్స్‌పై కూడా అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. గోవాలో యశ్, కియారా అద్వానీపై ఒక సాంగ్‌ను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు. యశ్, కియారా, నయనతార కాంబినేషన్‌ను చూడాలని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంకా ఈ మూవీ రిలీజ్ డేట్‌పై ఎలాంటి క్లారిటీ లేదు.