Karthik Dandu on Rajiv Kanakala : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న యంగ్ డైరెక్టర్స్ లో కార్తీక్ దండు ఒకరు. ముందు రచయితగా కెరియర్ మొదలుపెట్టి ఆ తర్వాత భమ్ బోలేనాథ్ సినిమాతో దర్శకుడుగా పరిచయం అయ్యాడు కార్తీక్. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది. ఆ తర్వాత దర్శకుడుగా చాలా ఏళ్లు గ్యాప్ ఇచ్చిన కార్తీక్ విరూపాక్ష సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాడు. విరూపాక్ష సినిమాకు ముందు కార్తీక్ దండు చాలా హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేశాడు. దాదాపు చనిపోతాడు అనుకునే స్థాయికి కూడా వెళ్ళాడు అని స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఒక సందర్భంలో తెలిపారు. ఆ తర్వాత విరూపాక్ష సినిమాను డైరెక్ట్ చేసి పాన్ ఇండియా సక్సెస్ అందుకున్నాడు. కేవలం తను మాత్రమే కాకుండా సాయి తేజ్ కు కూడా ఈ సినిమా విపరీతంగా కలిసి వచ్చింది. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా మంచి కలెక్షన్స్ వసూలు చేసింది.
కార్తీక్ దండు కథ రాసే విధానం చాలా ఆసక్తికరంగా ఉంటుంది అని చెప్పొచ్చు. తాను రచయితగా పనిచేసిన కార్తికేయ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. విరూపాక్ష సినిమా చూసిన తర్వాత కార్తికేయ సినిమాలో కార్తీక్ దండు ఇన్వాల్వ్మెంట్ ఎంతుంది అని క్లియర్ గా అర్థమవుతుంది. ఇక ప్రస్తుతం కార్తీక్ దండు నాగచైతన్య తో సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతుంది. నాగచైతన్య ప్రస్తుతం చందు మొండేటి దర్శకత్వంలో తండేల్ అనే సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతుంది. ఈ సినిమాలో ఉత్తరాంధ్ర యాస నాగచైతన్య మాట్లాడనున్నారు.
సుబ్బు దర్శకత్వంలో అల్లరి నరేష్ నటిస్తున్న బచ్చలమల్లి సినిమా డిసెంబర్ 20న రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ తరుణంలో ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించింది చిత్ర యూనిట్. ఈ ఈవెంట్ కి చాలామంది దర్శకులు అతిథులుగా హాజరయ్యారు. ఈ ఈవెంట్ లో కార్తీక్ దండు మాట్లాడుతూ ఒక ఫన్నీ టాపిక్ ను చెప్పుకొచ్చారు. రీసెంట్ గా రాజీవ్ కనకాల గారిని చంపకుండా క్యారెక్టర్ ని ఇచ్చింది నేనే, అయినా కూడా సుమ గారు నన్ను హర్ట్ చేశారు అంటూ ఆ ఈవెంట్ లో చెప్పుకొచ్చాడు. రాజీవ్ కనకాల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు నటుడుగా మంచి గుర్తింపును సాధించుకున్నాడు ఆయన. అయితే చాలా సినిమాలలో ఆయన పాత్ర చనిపోతూ ఉంటుంది. దీని మీద సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా విపరీతంగా వచ్చాయి. అందుకోసమే ఈ మాటను కార్తీక్ దండు ఈవెంట్ లో తెలిపాడు.
Also Read : Pushpaka Vimanam – Nag Ashwin: ఇప్పుడు అందరూ పాన్ ఇండియా అంటున్నారు, కానీ అసలైన పాన్ ఇండియా అంటే ఆ సినిమానే