Pushpaka Vimanam – Nag Ashwin: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న ప్రత్యేకమైన దర్శకులలో నాగ అశ్విన్ ఒకరు. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు నాగి. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా కమర్షియల్ గా మంచి సక్సెస్ సాధించడంతోపాటు ఎన్నో ప్రశంసలు అందుకుంది. ఒక సినిమాకి కమర్షియల్ సక్సెస్ తో పాటు ప్రశంసలు రావడం అనేది రెర్ థింగ్. ఈ సినిమాతోనే వైజయంతి బ్యానర్, స్వప్న సినిమాస్ ఈ రెండింటికి బాగా కలిసి వచ్చింది. ఈ సినిమా తర్వాత అశ్విని దత్ కు అల్లుడు అయిపోయాడు నాగ్ అశ్విన్. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా తర్వాత చాలా ఏళ్లు గ్యాప్ తీసుకొని మహానటి అనే సినిమాను తెరకెక్కించాడు నాగి. అయితే ఈ సినిమా మంచి హిట్ అవుతుంది అని చాలామంది ఊహించారు. కానీ ఒక క్లాసిక్ గా చరిత్రలో నిలిచిపోతుంది అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ సినిమాకి కూడా కమర్షియల్ సక్సెస్ తో పాటు విపరీతమైన ప్రశంసలు వచ్చాయి.
సావిత్రి గారి కథను కళ్ళకు కట్టినట్లుగా కళ్ళల్లో నీళ్లు తెప్పించేలా చూపించాడు నాగి. ఒక మంచి సినిమా తీస్తే ప్రేక్షకులు తప్పకుండా థియేటర్ కు వచ్చి సినిమా చూస్తారు అని ప్రూవ్ చేశాడు. ఆ సినిమా తర్వాత నాగ్ అశ్విన్ తీసిన సినిమా కల్కి. ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మైథిలాజికల్ సైన్స్ ఫిక్షన్ జానెర్ లో వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన రెస్పాన్స్ సాధించుకుంది. ఈ సినిమాను జనవరి 3వ తారీఖున జపాన్ లో కూడా రిలీజ్ చేయనున్నారు. దీనికి సంబంధించిన ప్రోమోషన్స్ కి కూడా ప్రస్తుతం నాగ అశ్విన్ జపాన్ లో ఉన్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా మంచి సక్సెస్ సాధించింది. దాదాపు 1000కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది.
ఈ మధ్యకాలంలో అందరూ పాన్ ఇండియా పాన్ ఇండియా అని అనడం మొదలుపెట్టారు. అసలు పాన్ ఇండియా సినిమా అంటే సంగీతం శ్రీనివాసరావు గారి దర్శకత్వం వహించిన పుష్పక విమానం అని తెలిపాడు. పుష్పక విమానం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు డైలాగ్స్ లేకుండా ఈ సినిమాను నడిపించారు సింగీతం శ్రీనివాస్ గారు. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో ఇప్పుడు రిలీజ్ చేసినా కూడా అద్భుతంగా వర్కౌట్ అవుతుంది అని ఖచ్చితంగా చెప్పొచ్చు. నాగ అశ్విన్ కూడా ఇదే విషయాన్ని చెబుతూ వచ్చారు. ఇప్పుడు అంతా పాన్ ఇండియా అంటున్నాము కానీ అసలైన పాన్ ఇండియా సినిమా అంటే పుష్పక్ అని తెలిపారు. తమిళ్లో జరిగిన అపూర్వ సింగీతం అని ఒక ప్రోగ్రాం లో ఈ విషయాన్ని పంచుకున్నాడు నాగి. చాలామంది దిగ్గజ దర్శకులతో పాటు నటులు కూడా ఈ షోకి హాజరయ్యారు. అక్కినేని అమల కూడా ఈ షోలో కనిపించారు.
Also Read : Kiran Abbavaram : నేను ఫస్ట్ కలిసిన హీరో అల్లరి నరేష్