One Nation One Election Bill | దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్రంలోని బిజేపీ ప్రభుత్వం గత కొన్ని సంవత్సరాలుగా పావులు కదుపుతోంది. ఈ క్రమంలో మంగళవారం (డిసెంబర్ 18, 2024) పార్లెమంటు లోక్ సభలో జమిలి ఎన్నికల బిల్లు (వన్ నేషన్ వన్ ఎలక్షన్) ప్రేవేశపెట్టింది. రాజ్యాంగ సవరణ కోసం ప్రతిపాదించిన ఈ బిల్లుకు ఓటింగ్ జరగాల్సి ఉండగా.. బిజేపీకి చెందిన 20 మంది ఎంపీలు సభకు హాజరు కాలేదు. ఓటింగ్ హాజరు కాని 20 మంది ఎంపీలపై క్రమశిక్షణా చర్యలు చేపట్టేందుకు బిజేపీ అధిష్ఠానం సిద్ధమవుతున్నట్లు తెలసుస్తోంది.
జమిలి ఎన్నికల బిల్లు పార్లమెంటు ప్రవేశపెట్టబోతున్నట్లు ముందుగానే ఎంపీలందరికీ తెలియజేసి.. ఓటింగ్ సమయంలో తప్పనిసరిగా అందరూ హాజరుకావాలని బిజేపీ పెద్దలు త్రీ లైన్ విప్ జారీ చేశారు. అయినా 20 మంది సొంత ఎంపీలే ఓటింగ్‌కు హాజరుకాకపోవడంతో ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. లోక్ సభలో మంగళవారం అధికార బిజేపీ కూటమి పార్లెమెంటరీ, రాష్ట్ర ఎన్నికల గురించి రాజ్యాంగంలో సవరణల కోసం రెండు బిల్లులు ప్రవేశపెట్టింది. ఈ రెండు బిల్లుల ఓటింగ్ కోసం 20 మంది బిజేపీ ఎంపీలు హాజరు కాకపోయినా సింపుల్ మెజారిటీతో ఆమోదం లభించింది.
ALSO READ: సంక్షోభంలో విద్యారంగం.. దేశంలో 10 లక్షల టీచర్ పోస్టులు ఖాళీ.. లక్ష విద్యార్థులు ఫెయిల్
బిల్లులపై ఓటింగ్ నిర్వహించగా మొత్తం 467 మంది ఎంపీలు ఓటు వేశారు. ఇందులో జమిలి ఎన్నికలకు అనుకూలంగా 269 ఎంపీలు ఓటేయగా.. వ్యతికేంగా 198 ఎంపీల నిలబడ్డారు. పార్లమెంటు రూల్ బుక్ ప్రకారం ప్రస్తుతానికి సింపుల్ మెజారిటీతో బిల్లులను ఆమోదించారు. అయితే రాజ్యాంగంలో సవరణ చేయాలంటే పార్లమెంటులోని 33 శాతానికిపైగా అంటే 2/3 వంతు ఎంపీలు బిల్లుకు అనుకూలంగా ఓటువేయాలి. దీంతో ఈ బిల్లులు చట్టం మారే అవకాశం లేదని కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమి నాయకులు వాదిస్తున్నారు. పైగా బిజేపీ సొంత ఎంపీలు 20 మంది ఓటింగ్‌కు గైర్హాజరు కావడంతో ఈ బిల్లులను పూర్తిస్థాయిలో మద్దతు లేదని స్పష్టమైందన్నారు.
అయితే ఓటింగ్ హాజరు కాని ఎంపీలపై చర్యలు తీసుకుంటామని బిజేపీ తెలిపింది.
“ప్రభుత్వం పక్షాన ఉన్న ఎంపీల సంఖ్య చాలా పెద్దదే. అందులో అనుమానం లేదు. కానీ రాజ్యాంగ సవరణ బిల్లుల ఆమోదం కోసం 2/3 మెజారిటీ కావాలి. ఆ మెజారిటీ వారి వద్ద లేదని స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే అధికార కూటమి పార్టీలు ప్రవేశ పెట్టిన బిల్లు త్వరలోనే వీగిపోతుంది.” అని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ మీడియాతో మాట్లాడుతూ అన్నారు.
రాజ్యాంగ సవరణ కోసం ప్రవేశ పెట్టిన 129వ బిల్లుని అధికార కూటమి పార్లమెంటు కమిటీ పరిశీలించేందుకు పంపనుంది. ఈ బిల్లు ఆమోదించడానికి ఎక్కువ మంది ఎంపీలు అవసరం కావడంతో అందరినీ చర్చలకు పిలవనుందని సమాచారం. అయితే ప్రతిపక్ష పార్టీలు దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రభుత్వం ఈ బిల్లులు తీసుకువచ్చిందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు చేస్తున్నాయి. కానీ బిజేపీ కూటమి మాత్రం ప్రతిపక్షాల ఆరోపణలను తొసిపుచ్చింది.