Karthik Dandu: మెగా మేనల్లుడు సాయి దుర్గ తేజ్ (Sai Durga Tej).. యాక్సిడెంట్ తర్వాత తన మేనమామ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తో చేసిన ‘బ్రో’ సినిమా ఫెయిల్యూర్ తర్వాత కొంతకాలం గ్యాప్ తీసుకొని, ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘విరూపాక్ష’.. ప్రముఖ మలయాళీ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ (Samyuktha menon) హీరోయిన్ గా నటించగా.. కార్తీక్ దండు దర్శకత్వం వహించారు. 2023 లో వచ్చిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అయింది. అష్టదిగ్బంధనం అనే కాన్సెప్ట్ తో వచ్చి సూపర్ హిట్ ను సొంతం చేసుకుంది. విరూపాక్ష మూవీతో డైరెక్టర్ కి కూడా మంచి గుర్తింపు లభించింది. అలా విరూపాక్ష డైరెక్టర్ గా టాలీవుడ్ లో ఫేమస్ అయిన కార్తీక్ దండు.. ప్రస్తుతం నాగచైతన్య (Naga Chaitanya) తో ఓ సినిమా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమాని భోగవల్లి బాపినీడు నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఒక భారీ గుహ సెట్ ని వేసి అందులోకి మీడియాని ఆహ్వానించారు. ఇందులో భాగంగా ట్రెజర్ హంట్ అనే చిన్న గేమ్ పెట్టారు. ఈ గేమ్ లో భాగంగా మీడియాపై సెటైర్ వేశారు కార్తీక్ దండు.
రిపోర్టర్స్ ట్రెజర్ హంట్ అనే గేమ్ ఆడిన కార్తీక్ దండు..
అసలు విషయంలోకి వెళ్తే.. నాగచైతన్య – కార్తీక్ దండు కాంబోలో వస్తున్న సినిమాకి సంబంధించి ఇప్పటికే 10 రోజుల షూటింగ్ పూర్తయింది. అయితే ఈ సినిమాలో ఓ 20 నిమిషాల కీలక సన్నివేశం కోసం ఒక పెద్ద గుహ సెట్ ని వేశారు చిత్ర యూనిట్. ఇక సెట్ ఎలా ఉంటుందనేది చూపించడం కోసం మీడియాను ఆ గుహ సెట్లోకి ఆహ్వానించారు. ఇందులో భాగంగా ఒక చిన్న ట్రెజర్ హంట్ అనే గేమ్ ని పెట్టారు. అందులో కొన్ని చీటీలు పెట్టి ఆ చీటీలలో వచ్చిన ప్రశ్నకి సమాధానం చెప్పమని మీడియా వాళ్ళను కోరారు డైరెక్టర్. అలా ఓ వ్యక్తి ఒక చీటీని తీసి “గోదావరి పుట్టిన ప్రదేశం, మీరు ఉన్న ప్లేస్ రెండింటి పేరు ఒకటే..అదేంటి?” అనేది ప్రశ్న. అయితే ఆ ప్రశ్నకి అక్కడే ఉన్న మీడియా మిత్రులు కొంతమంది నాసిక్,త్రయంబక్ అని పేర్లు చెప్పారు.కానీ అవేవి కాదని డైరెక్టర్ చెప్పారు.
మేం చేస్తే కాపీ మరి మీరు చేస్తే.. కార్తీక్
ఆ తర్వాత మరో రిపోర్టర్ గూగుల్ లో సెర్చ్ చేసి మరీ ‘బ్రహ్మగిరి’ అని చెప్పారు. ఇక రిపోర్టర్ చెప్పిన ఆన్సర్ కి కరెక్ట్ గా చెప్పావని మెచ్చుకున్నారు.కానీ ఆ తర్వాత గూగుల్ లో సెర్చ్ చేసినట్టు తెలియడంతో మీరైతే గూగుల్ లో సెర్చ్ చేసి ఆన్సర్ తెలుసుకుంటారు. కానీ మేము ఇంగ్లీష్ సినిమాలో నుండి ఓ చిన్న సీన్ ని ఇన్స్పైర్ గా తీసుకొని వాడుకుంటే మాత్రం కాపీ చేశారని మీడియాలో కథలు కథలుగా రాస్తారు అంటూ మీడియాపై సెటైర్ వేశారు డైరెక్టర్ కార్తీక్ దండు.ఇక డైరెక్టర్ వేసిన సెటైర్ కి అక్కడే ఉన్న మీడియా మిత్రులు అందరూ సరదాగా నవ్వుకున్నారు.
ALSO READ:Tollywood: ఇంత అందంగా ఉంది.. ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా..?