BigTV English
Advertisement

Walnuts: చలికాలంలో వాల్‌నట్స్ తింటే ఏం జరుగుతుందో తెలుసా ?

Walnuts: చలికాలంలో వాల్‌నట్స్ తింటే ఏం జరుగుతుందో తెలుసా ?

Walnuts: వాల్ నట్స్‌లో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. డ్రై ఫ్రూట్స్‌లో వాల్‌నట్‌లకు ప్రత్యేక స్థానం ఉంది. వీటిని తినడం వల్ల శరీరానికి ఆశ్చర్యకరమైన ప్రయోజనాలను అందుతాయి. వాల్‌నట్స్‌లో ఉండే సమ్మేళనాలు మెదడును ఆరోగ్యవంతంగా మార్చడంలో సహాయపడతాయి. దీంతో పాటు, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో వాల్‌నట్‌లు కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా చలికాలంలో వాల్ నట్స్ తినడం వల్ల శరీరానికి రెట్టింపు ప్రయోజనాలు కలుగుతాయి. మరి ఇందుకు సంబంధించిన వివరాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


శీతాకాలంలలో చలి పెరిగే కొద్దీ ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. వీటిని నివారించాలంటే మనం తినే ఆహారాన్ని మార్చుకోవడం తప్పనిసరి అవుతుంది. ముఖ్యంగా చలికాలంలో మీరు వివిధ మార్గాల్లో వాల్ నట్‌లను తింటే, మీ శరీరానికి అవసరమైన వేడి అందుతుంది. అంతే కాకుండా ఈ సమయంలో వచ్చే ఆరోగ్య సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. చలిలో వాల్‌నట్‌లను తినడం వల్ల కలిగే లాభాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

పచ్చి వాల్ నట్స్ తినండి- ఉదయం ఖాళీ కడుపుతో 2-3 వాల్ నట్స్ తినడం వల్ల రోజంతా శరీరానికి శక్తి అందిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. అంతే కాకుండా రోజంతా శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది.


పాలతో వాల్‌నట్‌లు- నిద్రపోయే ముందు గోరువెచ్చని పాలలో 1-2 వాల్‌నట్‌లను కలుపుకుని తాగడం వల్ల మంచి నిద్ర వస్తుంది. శరీరాన్ని చలి నుండి కాపాడుతుంది. ఇది ఎముకలను దృఢపరచడంలో కూడా ఉపయోగపడుతుంది.

వాల్‌నట్‌ పేస్ట్‌- వాల్‌నట్‌ పేస్ట్‌ను తయారు చేసి చర్మానికి అప్లై చేయడం వల్ల చర్మానికి పోషణ లభిస్తుంది. ఇది ఫేస్ ప్యాక్ లాగా పనిచేసి చర్మంలోని తేమను కాపాడుతుంది. చలికాలంలో పొడిబారిన చర్మానికి ఇది చక్కటి హోం రెమెడీ.

వాల్ నట్స్ తినడం వల్ల జుట్టు, చర్మం, ఎముకలకు మేలు:

గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది- వాల్‌నట్స్‌లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు గుండెకు చాలా మేలు చేస్తాయి. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రిస్తుంది. శీతాకాలంలో వీటిని తినడం వల్ల గుండెపోటు, ఇతర గుండె సంబంధిత వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది.

జుట్టు, చర్మానికి మేలు చేస్తుంది- చలికాలంలో చర్మం పొడిగా, నిర్జీవంగా మారుతుంది. వాల్‌నట్‌లు చర్మానికి పోషణను అందించడంలో, తేమను నిర్వహించడంలో సహాయపడతాయి. అంతేకాకుండా, ఇది జుట్టు యొక్క ఆరోగ్యాన్ని కాపాడటంలో సహాయపడుతుంది. ఫలితంగా జుట్టు బలంగా మెరిసేలా తయారవుతుంది.

ఎముకలను బలపరుస్తుంది- వాల్‌నట్స్‌లో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్ వంటి పోషకాలు ఉంటాయి.ఇవి ఎముకలను బలోపేతం చేస్తాయి. చలికాలంలో వీటిని తీనడం వల్ల వల్ల ఎముకల నొప్పులు, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.

గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది: వాల్‌నట్స్‌లో పాలీఅన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడంలో సహాయపడతాయి. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

మెదడుకు మేలు చేస్తుంది: వాల్‌నట్స్‌లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు ఉంటాయి. ఇవి మెదడు పనితీరును మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఇది జ్ఞాపకశక్తిని మెరుగుపరచడానికి, ఏకాగ్రతను మెరుగుపరచడానికి, మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

బరువు తగ్గడంలో సహాయం: బరువు పెరగడం వల్ల ఇబ్బంది పడే వారికి వాల్‌నట్‌లు ప్రయోజనకరంగా ఉంటాయి. వాల్‌నట్స్‌లో ఫైబర్, ప్రొటీన్లు అధికంగా ఉంటాయి.ఇవి మిమ్మల్ని ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచుతాయి. అంతే కాకుండా బరువు తగ్గడంలో సహాయపతాయి.

Also Read: చలికాలంలో ఇలా చేస్తే.. గ్లోయింగ్ స్కిన్ గ్యారంటీ

క్యాన్సర్ రక్షణ: వాల్‌నట్స్‌లో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించడంలో సహాయపడతాయి. అటువంటి పరిస్థితిలో, మీరు క్రమం తప్పకుండా వాల్‌నట్‌లను తింటే, క్యాన్సర్ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చు.

ఎముకలను బలపరుస్తుంది: వాల్‌నట్స్‌లో కాల్షియం, మెగ్నీషియం ఉంటాయి. ఇవి ఎముకలను బలోపేతం చేయడంలో సహాయపడతాయి. ఎముకల బలహీనత సమస్యతో బాధపడేవారు వాల్ నట్స్ ను ఆహారంలో చేర్చుకోవడం చాలా మంచిది.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Omelette Vs Boiled Egg: ఎగ్స్ Vs ఆమ్లెట్.. బరువు తగ్గడానికి ఏది తింటే బెటర్ ?

Saliva Test: ఏంటి నిజమా? లాలాజలంతో గుండె పనితీరు గుర్తించొచ్చా..! అదెలా ?

Tips For Hair: జుట్టు త్వరగా పెరగాలా ? అయితే.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి

Banana: ఖాళీ కడుపుతో అరటిపండు తింటే.. జరిగేది ఇదే ?

Heart Health:గుండె జబ్బులు ఉన్నాయని తెలిపే.. సంకేతాలు ఇవేనట !

Fruits For Weight loss: బరువు తగ్గాలనుకునే వారు.. ఎలాంటి ఫ్రూట్స్ తినాలి ?

Dark Tourism: చీకటి అధ్యాయాలపై ఉత్సుకత.. నాణేనికి మరో వైపే డార్క్ టూరిజం!

Zumba Dance: బోరింగ్ వర్కౌట్స్‌తో విసుగొస్తుందా.. అయితే మ్యూజిక్ వింటూ స్టెప్పులేయండి!

Big Stories

×