Kayadu Lohar vs Mamitha Baiju: యూత్‌కు నచ్చే సినిమా ఏదైనా విడుదలయ్యిందంటే చాలు.. అందులో హీరోయిన్ కూడా కచ్చితంగా చాలామంది కుర్రకారుకు ఇన్‌స్టాంట్ క్రష్‌గా మారిపోతుంది. అలా క్రష్ అయిన హీరోయిన్ ఎక్కువకాలం వారి క్రష్ లిస్ట్‌లో ఉండడం కష్టమే. మరొక కొత్త సినిమా విడుదల అవ్వగానే మరొక కొత్త క్రష్ వచ్చేస్తుంది. అది కామన్‌గా జరిగేదే. అలా గతేడాది ఫిబ్రవరిలో విడుదలయిన మలయాళం మూవీ ‘ప్రేమలు’ను చూసిన తర్వాత అందులో హీరోయిన్‌గా నటించిన మమితా బైజును క్రష్ అనుకున్నారు కుర్రకారు. ఇక తాజాగా విడుదలయిన ‘డ్రాగన్’ మూవీ చూసిన తర్వాత ఆ స్థానంలోకి కాయదు లోహర్ (Kayadu Lohar) వచ్చేసింది. ఇప్పుడు వీరిద్దరిలో ఎవరు బెస్ట్ యాక్ట్రెస్ అని సోషల్ మీడియాలో చర్చ మొదలయ్యింది.
మమితా వల్లే
2024 ఫస్ట్ హాఫ్ అంతా మలయాళ సినిమాలదే హవా నడిచింది. అలా 2024 ఫిబ్రవరిలో విడుదలయిన మలయాళ చిత్రాల్లో ‘ప్రేమలు’ కూడా ఒకటి. ఈ సినిమా షూటింగ్ అంతా హైదరాబాద్‌లోనే జరిగినా ముందుగా ఈ మూవీని కేవలం మలయాళంలోనే విడుదల చేశారు మేకర్స్. తెలుగులో విడుదల కాకపోయినా సబ్ టైటిల్స్‌తో మ్యానేజ్ చేయొచ్చు అనే ఉద్దేశ్యంతో చాలామంది ‘ప్రేమలు’ మూవీని చూడడానికి థియేటర్లకు వెళ్లారు. అలా నెల రోజుల తర్వాత ఈ సినిమా తెలుగులో కూడా విడుదలయ్యింది. మలయాళంలో చూసిన తెలుగు ప్రేక్షకులు.. తెలుగులో విడుదలయిన తర్వాత మళ్లీ దీనిని చూశారు. దానికి ముఖ్య కారణం మమితా బైజు.
మెయిన్ హీరోయిన్
‘ప్రేమలు’లో ఎక్కువగా హడావిడి లేని యాక్టింగ్‌తో, యూత్‌ను ఇంప్రెస్ చేసే క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో, తన అప్పీయరెన్స్‌తో అందరినీ ఆకట్టుకుంది మమితా బైజు (Mamitha Baiju). అలా కొంతకాలం పాటు తన గురించే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ నడిచింది. ఇప్పుడు అదే రేంజ్‌లో పాపులారిటీతో దూసుకుపోతోంది కాయదు లోహర్. ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన ‘డ్రాగన్’ మూవీలో మెయిన్ హీరోయిన్‌గా నటించింది కాయదు. అసలైతే ఈ సినిమా విడుదల అవ్వక ముందు వరకు అనుపమనే మెయిన్ హీరోయిన్ అనుకున్నారంతా. అందుకే కాయదును పెద్దగా పట్టించుకోలేదు. కానీ సినిమా విడుదలయిన తర్వాత సీన్ మొత్తం రివర్స్ అయ్యంది.
Also Read: నల్లగా ఉన్నానని పొమ్మన్నారు.. చచ్చిపోతా అనుకున్నా.. అప్పటి కష్టాలను బయటపెట్టిన హీరోయిన్
కొత్త క్రష్
ఫిబ్రవరి 21న ‘డ్రాగన్’ (Dragon) మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలయిన మొదటి రోజు నుండే ఈ మూవీకి సూపర్ హిట్ టాక్ లభించింది. ఇక ఇందులో హీరోయిన్‌గా నటించిన కాయదు గురించి కూడా యూత్ అంతా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. గ్లామర్‌తో మాత్రమే కాకుండా తన యాక్టింగ్‌తో కూడా అందరినీ కట్టిపడేసింది కాయదు. దీంతో యూత్ క్రష్ లిస్ట్‌లోకి కొత్త హీరోయిన్ యాడ్ అయ్యింది. ఇక కాయదును చూస్తుంటే మమితాను చూసినట్టే ఉందని మూవీ లవర్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరూ చూడడానికి ఒకేలా ఉన్నారని భావిస్తున్నారు. అలా ప్రస్తుతం మమితా వర్సెస్ కాయదు అంటూ సోషల్ మీడియాలో వార్ నడుస్తోంది.