Keerthy Suresh Marriage: టాలీవుడ్‌లో మలయాళ ముద్దుగుమ్మలకు ఉన్న క్రేజే వేరు. ముందుగా మలయాళంలో ఉన్న టాలెంట్‌ను గుర్తించి వారికి తెలుగులో అవకాశాలు ఇచ్చేవారిలో టాలీవుడ్ మేకర్స్ ముందుంటారు. అలా మలయాళం నుండి తెలుగుకు వచ్చి ఇక్కడ క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్స్‌లో కీర్తి సురేశ్ ఒకరు. తన టాలెంట్‌తో, యాక్టింగ్‌తో సౌత్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది కీర్తి. అలా తను విపరీతమైన ఫ్యాన్ బేస్ కూడా సంపాదించుకుంది. ఇంతలోనే ఆ ఫ్యాన్స్ అందరికీ హార్ట్ బ్రేక్ ఇచ్చే న్యూస్ ఒకటి బయటికొచ్చింది. అదే కీర్తి సురేశ్ పెళ్లి. తాజాగా కీర్తి సురేశ్ పెళ్లి గురించి సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతుండగా తనకు కాబోయే భర్త గురించి పలు ఆసక్తికర విషయాలు కూడా బయటికొచ్చాయి.
డెస్టినేషన్ వెడ్డింగ్
కీర్తి సురేశ్ (Keerthy Suresh) హీరోయిన్‌గా ఎంటర్ అయినప్పటి నుండి తన పర్సనల్ లైఫ్ గురించి ఎప్పుడూ పెద్దగా చర్చల్లోకి రాలేదు. హీరోలతో డేటింగ్ రూమర్స్ అని, రిలేషన్‌షిప్ అని.. ఇలా కీర్తి సురేశ్ గురించి అసలు రూమర్సే రాలేదు. అలాంటిది ఒక్కసారిగా తను గత 15 ఏళ్ల నుండి ఒక అబ్బాయితో రిలేషన్‌తో ఉందని, తనతో గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ అని గట్టిగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. అసలు ఎవరు ఆ వ్యక్తి? ఇంతకాలం నుండి తన రిలేషన్ గురించి కీర్తి ఎందుకు బయటికి రానివ్వలేదు అని ఫ్యాన్స్‌లో చర్చలు మొదలయ్యాయి. ఇంతలోనే ఆ వ్యక్తి పేరు ఆంటోనీ తట్టిల్ అని, తన గురించి వివరాలు కూడా బయటికొచ్చాయి.
Also Read: కుక్కకు బిర్యానీ దొరికిందన్నారు.. నయన్ భర్త సంచలన వ్యాఖ్యలు
బిజినెస్‌మ్యాన్‌తో పెళ్లి
ఆంటోనీ తట్టిల్ (Antony Thattil) సొంతూరు కొచ్చి అని సమాచారం. కొచ్చిలో మాత్రమే కాకుండా ఆంటోనీకి దుబాయ్‌లో కూడా రెస్టారెంట్స్ ఉన్నాయి. ఇక చెన్నైలో కూడా తనకు పలు ప్రైవేట్ కంపెనీలు ఉన్నాయని తెలుస్తోంది. ఆంటోనీకి మీడియా ఫోకస్ నచ్చదని, అందుకే కీర్తి సురేశ్‌తో ఎక్కడా బయట కనిపించలేదని సన్నిహితులు చెప్తున్నట్టుగా సోషల్ మీడియాలో రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. సోషల్ మీడియాలో కూడా ఎక్కడా వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు లేవు. ఇది చూస్తుంటే ఆంటోనీకి అటెన్షన్ నచ్చదనే విషయంపై క్లారిటీ వస్తుంది. దాదాపు 2008 నుండి కీర్తి, ఆంటోనీకి పరిచయం ఉందని సమాచారం. ఇన్నాళ్లకు వారు పెళ్లి గురించి ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.
కేవలం వారి మధ్యే
సోషల్ మీడియాలో వినిపిస్తున్న కథనాల ప్రకారం.. డిసెంబర్ 11, 12న గోవాలో కీర్తి, ఆంటోనీ పెళ్లికి ముహూర్తం ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ఈ పెళ్లికి కేవలం సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరు కానున్నట్టు సమాచారం. కొన్నాళ్ల క్రితం.. తన పెళ్లి గురించి ఓపెన్‌గా మీడియాతో మాట్లాడింది కీర్తి సురేశ్. తాను రిలేషన్‌షిప్‌లో ఉన్నానని ఒప్పుకుంది. పెళ్లి గురించి అడిగితే అది ఎప్పుడు జరుగుతుందో చెప్పలేనని చెప్పింది. మొత్తానికి ఇప్పుడు కీర్తి పెళ్లి అని వస్తున్న వార్తలపై తనే ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.