Keerthy Suresh: సౌత్ హీరోయిన్లంతా బాలీవుడ్‌కు వెళ్లిపోయిన తర్వాత చాలా మారిపోతుంటారని ప్రేక్షకులు అనుకుంటూ ఉంటారు. గ్లామర్ షో విషయంలో అయినా, కథల ఎంపిక విషయంలో అయినా హీరోయిన్లలో చాలా మార్పు వస్తుంది. ఇక ఈ కేటగిరిలోకే కీర్తి సురేశ్ (Keerthy Suresh) కూడా వెళ్లిపోతుందని తన ఫ్యాన్స్ అంతా భయపడుతున్నారు. అయినా కూడా అవేమీ పట్టించుకోకుండా ‘బేబి జాన్’తో తాను హిందీలో అడుగుపెట్టినందుకు సంతోషం వ్యక్తం చేస్తోంది కీర్తి. హిందీలో తన మొదటి చిత్రం ‘బేబి జాన్’ అయ్యిండేది కాదని, తనకు ముందు కూడా ఒక మూవీలో ఆఫర్ వస్తే రిజెక్ట్ చేశానని ఓపెన్ కామెంట్స్ చేసింది.
డెబ్యూ డిశాస్టర్
వరుణ్ ధావన్ హీరోగా నటించిన ‘బేబి జాన్’ (Baby John) మూవీ భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఆ అంచనాలను అందుకోలేక డిశాస్టర్‌గా నిలిచింది. పైగా ఈ మూవీ ప్రమోషన్స్ సమయంలో కీర్తి సురేశ్ చేసిన గ్లామర్ షో తన ఫ్యాన్స్‌కు ఏ మాత్రం నచ్చలేదు. కానీ హిందీ ప్రేక్షకులు మాత్రం తనను బాగానే ఆదరించారు. ఇప్పటికీ హిందీలో ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ పలు ఆసక్తికర విషయాలు షేర్ చేసుకుంటోంది కీర్తి. అందులో భాగంగానే తను హిందీలోనే ‘మైదాన్’ అనే మూవీతో డెబ్యూ చేయాల్సింది అనే విషయం బయటపెట్టింది. అజయ్ దేవగన్ హీరోగా నటించిన ‘మైదాన్’ (Maidaan) గతేడాది విడుదలయ్యింది. అందులో ప్రియమణి హీరోయిన్‌గా నటించింది.
అగ్రిమెంట్ ప్రకారమే తప్పుకున్నా
‘‘మైదాన్‌లో నేను యాక్ట్ చేయాల్సింది కానీ పలు కారణాల వల్ల తప్పుకున్నాను. కానీ అది మ్యూచువల్ అగ్రిమెంట్ ప్రకారమే జరిగింది. అయిదేళ్ల క్రితం మహానటి పూర్తయిన తర్వాత మైదాన్‌లో నటించడానికి నన్ను అప్రోచ్ అయ్యారు. ఆ ఛాన్స్ మిస్ అయినా కూడా బేబి జాన్‌తో నా బాలీవుడ్ డెబ్యూ జరిగినందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని తెలిపింది కీర్తి సురేశ్. అన్ని భాషల్లో ఒకేసారి పనిచేయడంపై కూడా తన అభిప్రాయం బయటపెట్టింది. ‘‘ఇదంతా చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది. ఇప్పుడు నేను ఇండస్ట్రీల మధ్య ప్రయాణం చేయొచ్చు’’ అంటూ తన అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్ విషయంలో క్లారిటీ ఇచ్చింది.
Also Read: ఆంటోనీకి ఇవన్నీ కొత్త, అందుకే తనలో ఈ మార్పు.. భర్తను వెనకేసుకొస్తున్న కీర్తి సురేశ్
డార్క్ కామెడీ కూడా
‘‘ఒక యాక్టర్‌గా వైవిధ్యభరితమైన పాత్రలను చేయడం నాకు చాలా ఎగ్జైటింగ్‌గా అనిపిస్తుంది. నేను ఇప్పుడు రెండు డార్క్ కామెడీ చిత్రాలు కూడా చేస్తున్నాను. హిందీ సినిమాలో ఒక సీరియస్ సినిమా, మలయాళంలో ఒక యాక్షన్ సినిమా చేస్తున్నాను’’ అని క్లారిటీ ఇచ్చింది కీర్తి సురేశ్. హిందీలో తాను సంజయ్ లీలా భన్సాలీ, రాజ్‌కుమార్ హిరానీతో కలిసి పనిచేయాలనుందనే కోరికను బయటపెట్టింది. షారుఖ్ ఖాన్, షాహిద్ కపూర్, రణవీర్ సింగ్ లాంటి హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఉందని తెలిపింది. రణవీర్‌తో ఇప్పటికే ఒక యాడ్‌లో నటించినా పూర్తిస్థాయి సినిమా కూడా చేయాలని ఉందని చెప్పింది.