Mumbai Cricket Association: క్రికెట్ మ్యాచ్ అంటే ఎవరికైనా సాధారణంగా గుర్తొచ్చేది ప్లేయర్స్, కోచ్ లు, అంపైర్లు మాత్రమే. కానీ ఏ మ్యాచ్ జరగాలన్నా ముందు స్టేడియం ఉండాలి. ఆ స్టేడియాన్ని మెయింటెన్ చేసేది గ్రౌండ్ స్టాఫ్. వీరి గురించి చాలామందికి తెలియదు. తెలిసినా ఎవరూ పట్టించుకోరు. ఒక మ్యాచ్ జరగడానికి వీరు పడే కష్టం అంతా ఇంతా కాదు. పిచ్ ని సిద్ధం చేయడం, ఔట్ ఫీల్డ్స్ మెయింటెన్, ఒకవేళ వర్షం పడితే గ్రౌండ్ లోని నీరు బయటికి వెళ్లి పోయేటట్లు సరైన డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయడం, బౌండరీ రోప్ లను ఎప్పటికప్పుడు సరి చేయడం గ్రౌండ్ స్టాఫ్ వర్క్.
Also Read: Virat Kohli House: కోహ్లీ కొత్త ఇల్లు ఇదే..32 కోట్లతో రెడీ.. గృహ ప్రవేశం ఎప్పుడంటే ?
అంతర్జాతీయ క్రికెట్ గ్రౌండ్ స్టాఫ్ కి నెలకు రూ. 30 వేల వరకు శాలరీ ఉంటుంది. అయితే వీరి శాలరీ దేశాలను బట్టి మారే అవకాశం కూడా ఉంది. స్టేడియం ఉన్న ప్రదేశం, అనుభవాల ఆధారంగా గ్రౌండ్ స్టాఫ్ జీతాలు మారుతుంటాయి. అయితే భారత్ సహా మరి కొన్ని దేశాలలో గ్రౌండ్ స్టాఫ్ శాలరీ కి సంబంధించిన ఓ సాంప్రదాయం ఉంది. వీరు పిచ్ ని బాగా మెయింటెనెన్స్ చేస్తే జట్లు లేదా క్రికెట్ బోర్డులు మ్యాచ్ ల తర్వాత వీరికి నగదును బహుమతిగా అందిస్తారు.
ఇదిలా ఉంటే.. ముంబైలోని ప్రఖ్యాత వాంఖడే స్టేడియం 50 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ముంబై క్రికెట్ అసోసియేషన్ ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. జనవరి 19 తో వాంఖడే కి 50 సంవత్సరాలు నిండుతాయి. ఈ నేపథ్యంలో ముంబై క్రికెట్ అసోసియేషన్ ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తుండగా.. జనవరి 12వ తేదీన ముంబై రంజీ కెప్టెన్లను ముంబై క్రికెట్ అసోసియేషన్ ఘనంగా సత్కరించింది.
వినోద్ కాంబ్లీ, వసీం జాఫర్, సునీల్ గవాస్కర్, పృద్వి షా వంటి పలువురు ఈ వేడుకకి హాజరయ్యారు. వీరికి ఎంసీఏ అధ్యక్షుడు అజింక్య నాయక్ జ్ఞాపికలు అందజేశారు. వాంఖడే స్టేడియంలో క్రికెట్ ఓనమాలు నేర్చుకున్న ఆటగాళ్లంతా ఈ కార్యక్రమానికి హాజరు కావడం విశేషం. అయితే తాజాగా మరో కార్యక్రమాన్ని నిర్వహించింది ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ).
Also Read: Axar patel – Rahul: కె.ఎల్ రాహుల్ కి షాక్.. ఢిల్లీ కెప్టెన్ గా డేంజర్ ఆల్ రౌండర్?
178 మంది గ్రౌండ్ స్టాఫ్ కి జంబో గిఫ్ట్ హంపర్స్ ని అందజేసింది. ఇందులో ఐదు కేజీల చొప్పున గోధుమపిండి, బియ్యం, పప్పు, ఒక మిక్సర్ గ్రైండర్, హైడ్రేషన్ కిట్స్, కిట్ బ్యాగ్, బ్యాక్ ప్యాక్స్, టవల్స్, నోట్ ప్యాడ్స్, పెన్స్, బెడ్ షీట్స్, ట్రాక్ ప్యాంట్స్, జాకెట్స్, సన్ గ్లాసెస్, రెయిన్ కోట్, హాట్స్, గొడుగు, సన్ స్క్రీన్ వంటి వస్తువులతో కూడిన గిఫ్ట్ హంపర్స్ ని అందజేసింది.
THE MCA HONOURED 178 WANKHEDE GROUND STAFF WITH:
– 5KG atta, rice and Dal.
– A mixer grinder.
– Medical and hydration kits.
– Backpacks, kit bag and waist pouch.
– Tea bags and kettle.
– Towels and napkins.
– Pens and notepads.
– Bedsheet and pillow.
– T-shirt, track pants,…— Mufaddal Vohra (@mufaddal_vohra) January 16, 2025