Ketika Sharma: ఈరోజుల్లో హీరోయిన్లు కూడా కేవలం యాక్టింగ్‌కే పరిమితం అయిపోకుండా వేర్వేరు విభాగాల్లో కూడా తమ సత్తా చాటుకుంటున్నారు. కేవలం ఎంటర్‌టైన్మెంట్ ఇండస్ట్రీ మాత్రమే కాదు.. స్పోర్ట్స్, అడ్వెంచర్స్‌పై కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే పలువురు హీరోయిన్లు అడ్వెంచర్స్‌తో ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తున్నారు. తాజాగా కేతిక శర్మ (Ketika Sharma) కూడా అదే కేటగిరిలో యాడ్ అయ్యింది. తాజాగా తను అడ్వెంచర్ డ్రైవింగ్ చేస్తూ షేర్ చేసిన ఒక వీడియో చూసి ఫాలోవర్స్ అంతా షాకవుతున్నారు. కేతికలో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ తనను ప్రశంసిస్తూ తెగ లైక్స్, కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాకుండా ఈ డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ గురించి స్వయంగా తన మాటల్లోనే చెప్పుకొచ్చింది కేతిక.
అలాంటి జాగ్రత్తలు
ఏటీవీ రైడింగ్ అనేది ఒక అడ్వెంచర్ స్పోర్ట్ లాంటిదే. ఎఫ్ 1 రేసింగ్ అంత కాకపోయినా ఏటీవీ రైడింగ్‌లో కూడా కొంచెం రిస్క్ ఉంటుంది. తాజాగా అలాంటి ఏటీవీ రైడింగ్‌ను అవలీలగా చేసేసి అందరినీ ఆశ్చర్యపరిచింది కేతిక శర్మ. బురదలో డ్రైవ్ చేస్తూ దూసుకుపోయింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ దానికి ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ యాడ్ చేసింది. ‘ఏటీవీ అనేది ఒక అడ్వెంచర్ యాక్టివిటీ అయినా అది కొంచెం డేంజర్ కూడా. అందుకే అది చేయడానికి ముందు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. చుట్టు పక్కన పరిస్థితులు చూసుకోవాలి. అలా ఏటీవీలో కొంచెం రిస్క్ తగ్గుతుంది’ అంటూ ఏటీవీ రైడింగ్ ఇష్టపడేవారికి జాగ్రత్తలు చెప్పింది కేతిక శర్మ.
ఐటెమ్ గర్ల్‌గా
సినిమాల విషయానికొస్తే.. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత పలు క్రేజీ ప్రాజెక్ట్స్‌లో నటించింది కేతిక శర్మ. ఈ సినిమాల్లో తనను చూసి గ్లామర్ డాల్‌లాగా ఉంది అనుకున్నారు కానీ తన పర్ఫార్మెన్స్‌తో మాత్రం ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఎక్కువగా కమర్షియల్ సినిమాల్లో నటించడం వల్ల తనకు పాత్రకు ప్రాధాన్యత ఉన్న అవకాశాలు కూడా పెద్దగా రాలేదు. అలా వచ్చిన అవకాశాలు అందుకుంటూ ముందుకు వెళ్లింది. ప్రస్తుతం కేతిక చేతిలో పెద్దగా సినిమాలు లేవు. అందుకే నితిన్ హీరోగా నటిస్తున్న ‘రాబిన్‌హుడ్’ మూవీ కోసం ఐటెమ్ గర్ల్‌గా మారింది. చాలాకాలం క్రితమే ఈ ఐటెమ్ సాంగ్‌కు సంబంధించిన ప్రోమో విడుదల అవుతుందని మేకర్స్ చెప్పినా ఇప్పటికీ అది ప్రేక్షకుల ముందుకు రాలేదు.
Also Read: సామ్ జిమ్ వీడియో వైరల్.. ‘ఆమె జిమ్ చేస్తే మాకు చెమటలు పడుతున్నాయి’
మెగా హీరోలతో సినిమాలు
పూరీ జగన్నాధ్ నిర్మాతగా వ్యవహరించిన ‘రొమాంటిక్’ సినిమాతో హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించింది కేతిక శర్మ. ఆ తర్వాత లక్కీగా మెగా కంపౌండ్‌లోకి అడుగుపెట్టింది. కెరీర్ మొదట్లోనే మెగా హీరోలతో నటించే ఛాన్స్ కొట్టేసింది ఈ ముద్దుగుమ్మ. ముందుగా వైష్ణవ్ తేజ్‌తో కలిసి ‘రంగ రంగ వైభవంగ’ అనే ఫ్యామిలీ డ్రామాలో కనిపించింది. ఆ తర్వాత సాయి ధరమ్ తేజ్, పవన్ కళ్యాణ్ మల్టీ స్టారర్ అయిన ‘బ్రో’లో హీరోయిన్‌గా అలరించింది. అలా బ్యాక్ టు బ్యాక్ మెగా హీరోలతో సినిమాలు చేసినా కూడా కేతికకు లక్ కలిసి రాలేదు. ప్రస్తుతం శ్రీవిష్ణు హీరోగా నటిస్తున్న ‘సింగిల్’లో హీరోయిన్‌గా కనిపించనుంది కేతిక.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">