Brahmamudi serial today Episode: కళ్యాణ్ కోపంగా ధాన్యలక్ష్మీని తిడతాడు. ఇంత గొప్ప కుటుంబాన్ని నాకు మానసికంగా దూరం చేసే హక్కు మీకెవరు ఇచ్చారంటూ ప్రకాష్, ధాన్యలక్ష్మీని ప్రశ్నిస్తాడు. ఉమ్మడి కుటుంబం విచ్చినం కాకూడదనే తాతయ్య, నాన్నమ్మల ఆశీర్వాదం కావాలి. ఎవరు ఎవరి పిల్లలో తెలియనంతగా కలిసిపోయే వారసత్వం కావాలి నాకు అంటాడు కళ్యాణ్. పెద్దమ్మను సొంత అక్కలా చూసుకునే నువ్వు.. నాన్నమ్మను అత్తలా కాకుండా అమ్మలా చూసుకునే నువ్వు.. తాతయ్యను మామలా కాకుండా నాన్నలా చూసుకునే నువ్వు ఆస్థి కోసం ఇంతలా దిగజారావా అంటూ ప్రశ్నిస్తాడు.
దీంతో ఇందిరాదేవి హ్యాపీగా ఫీలవుతూ నువ్వు ఇంత చెప్పినా మరకుంటే అది వాళ్ల కర్మ. అయినా నువ్వు ఇవాళ నా కడుపు నిండే మాట చెప్పావురా..? నీ మనసు ఎంత స్వచ్చంగా ఉందో.. ఎంత నిర్మలంగా ఉందో. నీ మాటలు కూడా నాకు అంతే పవిత్రంగా కనబడుతున్నాయిరా… నా ఆయుష్షు కూడా పోసుకుని చల్లగా ఉండు నాయన అంటూ ఎమోషనల్ అవుతుంది. ధాన్యలక్ష్మీ కోపంగా నీకు అర్థం కావడం లేదురా..? మీ తాతయ్యా ఆస్థి మొత్తం ఈ అనామకురాలి చేతిలో పెడితే ఆస్తి మొత్తం ఎక్కడ దాచిపెడుతుందో.. గెస్ట్ హౌస్ తాకట్టు పెట్టింది. ఇంట్లో ఉన్న బంగారం తాకట్టు పెట్టింది అంటూ చెప్పగానే.. కళ్యాణ్ కోపంగా వదిన ఏం చేసినా ఈ ఇంటి కోసమే చేస్తుంది. వదిన తన పుట్టింటి కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టడు.
అయినా వదిన ఏ పని చేసినా అన్నయ్యకు తెలియకుండా చేయదు అని చెప్తాడు. కళ్యాణ్ నువ్వు ఒక్కడివే మమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకున్నావురా అంటాడు. కావ్య కూడా కవిగారు కరెక్టు టైంలో వచ్చి ఈ ఇంట్లో ఏ అనర్థం జరగకుండా ఆపారు. మీరే కాదు ఈ ఇంట్లో అందరూ మమ్మల్ని అర్తం చేసుకునే టైం వస్తుంది. చిన్నత్తయ్యా, చిన్న మామయ్య మీరు చాలా బాధపడి ఉండొచ్చు.. కానీ మీరు అడిగే ప్రశ్నలకు మా దగ్గర సమాధానం లేదు. కానీ ఏదో ఒక రోజు మీ అందరికీ సమాధానం దొరుకుతుంది. మాకు మూడు నెలలు గడువు కావాలి. ఆ తర్వాత మీరు అడగకపోయినా అందరి ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి అని కావ్య చెప్పినా ధాన్యలక్ష్మీ వినకుండా కళ్యాణ్‌ను తిడుతూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
ఆఫీసులో రాజ్ చాలా సీరియస్‌గా ఆలోచిస్తుంటాడు. కావ్య ఎంత పిలిచినా పలకడు. దీంతో కావ్య గట్టిగా హలో గురువుగారు అంటుంది. దీంతో గురువు గారు ఏంటి కొత్తగా అంటాడు. నాకు ఈ వర్క్ అంతా నేర్పించారు కదా అందుకే మీరే నాకు గురువు అది సరే మీరు ఏంటి అంతలా ఆలోచిస్తున్నారు. అని అడుగుతుంది. అంతా నీవల్లే అంటాడు రాజ్. నావల్లే నేనేం చేశాను అంటుంది కావ్య. అసలు నిన్న కళ్యాణ్ రాకపోయి ఉంటే మన పరిస్థితి ఏంటి అంటాడు రాజ్. కళ్యాణ్ వస్తాడని నాకు ముందే తెలుసు ఎందుకంటే నేనే రమ్మని చెప్పాను అంటుంది. రాజ్ షాక్ అవుతాడు.
అపర్ణ టెన్షన్ పడుతుంది. సుభాష్ వచ్చి ప్లాబ్లమ్ సాల్వ్ అయింది కదా ఇంకా ఎందుకు టెన్షన్ పడుతున్నావు అంటాడు. ప్రాబ్లమ్ ఎక్కడ సాల్వ్ అయింది. మూడు నెలలు టైం కావాలని కావ్య అడిగింది. సమస్య ఇంకా పూర్తిగా పోలేదు అంటుంది అపర్ణ. నీకింకా కావ్య మీద కోపం పోలేదా..? అని సుభాష్ అడిగితే.. నాది కోపం కాదండి బాధ్యత. ఈ ఇంటి కోడలిగా అందరూ తనను నిందిస్తుంటే.. అత్తగారిలా చూస్తూ ఉండలేను కదా.? ఏదైనా తప్పు చేస్తే దండిచే హక్కు నాకుంది కదా..? అంటుంది. అదే నేను కూడా అడుగుతున్నాను తప్పు చేస్తున్నారని ఎలా అనుకుంటావు.
అని సుభాష్ అడగ్గానే.. అలా ఎల సమర్థిస్తున్నారండి అసలు మనం ఎంత ప్రమాదం నుంచి బయట పడ్డామో మీకు తెలుస్తుందా..? ధాన్యలక్ష్మీ, ప్రకాషం కోర్టుకు వెళ్లి ఉంటే ఏం జరిగేదో కదా అంటుంది. దీంతో కావ్య ఎప్పటికీ అలా జరగనివ్వదు. అందుకే చివరి నిమిషంలో కళ్యాణ్‌ను ఇంటికి రప్పించింది. చూడు అపర్ణ నాకు కావ్య మీద రాజ్ మీద పూర్తి నమ్మకం ఉంది. మూడు నెలల్లో వాళ్లు అన్ని సమస్యలను పరిష్కరిస్తారు. నువ్వు ఇలా ఆలోచించడం మానేసి ప్రశాంతంగా ఉండు అని చెప్పి వెళ్లిపోతాడు సుభాష్. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?