Kiara Advani : ప్రస్తుతం పాన్ ఇండియా రేస్ లో అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉన్న హీరోయిన్ కియారా అద్వానీ (Kiara Advani). గ్లామర్ ను వలకబోయడానికి ఏ మాత్రం ఆలోచించని ఈ హీరోయిన్ ఓవైపు నార్త్ లో వరుస సినిమాలతో ఆకట్టుకుంటూనే, మరోవైపు పాన్ ఇండియా హీరోయిన్ గా మారడానికి సిద్ధంగా ఉంది. రామ్ చరణ్ హీరోగా నటించిన ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) మూవీతో పాన్ ఇండియా హీరోయిన్ గా ఆమె మొదటి అడుగు వేయబోతోంది. కానీ ఆమె ఇటీవల కాలంలో ఈ సినిమా ప్రమోషన్లలో ఆమె పాల్గొనక పోవడంపై విమర్శలు వినిపించాయి. అయితే తాజా సమాచారం ప్రకారం కియారా అద్వానీ హాస్పిటల్ లో జాయిన్ అయినట్టుగా తెలుస్తోంది.
విజనరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రాంచరణ్ హీరోగా, కియారా అద్వానీ (Kiara Advani) హీరోయిన్ గా రూపొందుతున్న పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘గేమ్ ఛేంజర్’. తమన్ సంగీతం అందించిన ఈ మూవీని దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇక ఈ మూవీని జనవరి 10న సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయబోతున్నారు. చిత్ర బృందం ప్రస్తుతం భారీ ప్రమోషనల్ ఈవెంట్స్ తో బిజీబిజీగా ఉన్నారు. ఇక జనవరి 4న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీ ఎత్తున జరగబోతోంది.
ఈ నేపథ్యంలోనే ఇప్పటిదాకా పలు ఈవెంట్లకు డుమ్మా కొట్టిన కియారా ఈరోజు జరగబోయే ఈవెంట్ కి మాత్రం హాజరవుతుందని టాక్ నడిచింది. కానీ తాజా సమాచారం ప్రకారం అనారోగ్యంతో ఆమె ముంబైలోని ఓ ఆసుపత్రిలో చేరినట్టు తెలుస్తోంది. దీంతో ఆమె ఈ ఈవెంట్ కి కూడా డుమ్మా కొట్టబోతోంది. అయితే ఈ రోజు ఉదయమే కియారా అద్వానీ ఆసుపత్రిలో చేరినట్టు సమాచారం. కానీ ఆమె ఇలా హాస్పిటల్లో అడ్మిట్ కావడానికి గల కారణం ఏంటి ? అన్నది మాత్రం ఇంకా తెలియరాలేదు. అయితే కియారా అద్వానీ అభిమానులు ఆమెకు ఏమైందనే విషయం అర్థంకాక ఆందోళన చెందుతున్నారు.
అటు కియారా (Kiara Advani) టీం గానీ, ఇటు ‘గేమ్ ఛేంజర్’ టీమ్ గానీ ఈ విషయంపై ఎలాంటి కామెంట్స్ చేయలేదు. దీంతో ప్రస్తుతం వస్తున్న ఆమె అనారోగ్య వార్తలను చూసి అభిమానులు టెన్షన్ పడుతున్నారు. మరి ఈ విషయంపై ఆమె ఎప్పుడు క్లారిటీ ఇస్తుందో చూడాలి. ఇప్పటికే కియారా ‘గేమ్ ఛేంజర్’ డల్లాస్ ఈవెంట్ తో పాటు, ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు కూడా ఆబ్సెంట్ అయ్యింది. దీంతో ఆమె సౌత్ సినిమాల ప్రమోషన్లకు కావాలనే దూరంగా ఉంటుందని ప్రచారం జరిగింది. అసలు కియారాకి ఏమైంది అనేది తెలిస్తేనే గాని ఆమె ‘గేమ్ ఛేంజర్’ ఈవెంట్ కు ఎందుకు దూరంగా ఉంటుందో క్లారిటీ రాదు.
ఇదిలా ఉండగా ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మరోవైపు ఏర్పాట్లు శరవేగంగా పూర్తవుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం వేమగిరిలో ఈరోజు సాయంత్రం ఈవెంట్ జరగనుంది. ‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు.