Kiran Abbavaram : టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ‘క’ (KA). సస్పెన్స్ ఫ్యాంటసీ థ్రిల్లర్ గా రూపొందిన ఈ మూవీ గత ఏడాది అక్టోబర్ 31న దీపావళి కానుకగా రిలీజ్ అయ్యింది. భారీ అంచనాలతో తెరపైకి అయిన ఈ మూవీ అంచనాలను అందుకుని, హిట్ టాక్ తెచ్చుకుంది. అయితే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కిరణ్ అబ్బవరం మాట్లాడిన తీరు, ఆయన ఆవేదనను వ్యక్తం చేసిన తీరు చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. తనపై కావాలని ట్రోల్ చేశారంటూ, ఎవ్వరూ సపోర్ట్ చేయరంటూ కిరణ్ అబ్బవరం బరస్ట్ అయ్యారు. తాజాగా ఈ హీరోని ఓ ఇంటర్వ్యూలో ఆ విషయంపై ప్రశ్నించగా, అసలేం జరిగిందో ఓపెన్ అయ్యారు కిరణ్ అబ్బవరం.
‘క ‘మూవీ హిట్ కాకపోయి ఉంటే కథ వేరేలా…
తాజా ఇంటర్వ్యూలో “క మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మీరు మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. ఆరోజు చాలా బరస్ట్ అయ్యి, మాట్లాడారు. నిజానికి ఆ సినిమా హిట్ అయ్యింది. కాబట్టి మీరు మాట్లాడిన మాటలకు ఒక వ్యాల్యూ వచ్చింది. లేదంటే ఆ సినిమా కనుక అటూ ఇటూ అయ్యి ఉంటే మిమ్మల్ని మళ్లీ మోసేసేవారు కదా ?” అనే ప్రశ్న ఎదురైంది కిరణ్ అబ్బవరం కు. దానికి ఆయన స్పందిస్తూ “ఒకవేళ వారు మోసేస్తారో లేదో పక్కన పెడితే, ఆ రోజు నేను మాట్లాడిన మాటలు నిజం కాకపోయి ఉంటే ఇంక నాకు టేస్ట్ లేనట్టు. ఎందుకంటే నేను ప్రమోషన్, బిగినింగ్ స్క్రిప్ట్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ నా డిసిషనే. నాకు నచ్చిన, చేసిన సినిమాలన్నీ వర్కౌట్ అయ్యాయి. ఎక్కడో చిన్నచిన్నవి జరుగుతున్నాయి.
‘క’ మూవీని మళ్లీ నేను నా చేతిలోకి తీసుకున్నాను. అందులో ప్రతి ఒక్కటీ నా డిసిషన్ మేకింగ్. డైరెక్టర్ అందరితోనూ చర్చలు జరుగుతున్నాయి. మూవీని ఎలా తీసుకెళ్దాం అని మాట్లాడుకుంటున్నాము. కొంతమందికి ఆ మూవీ ఎక్కట్లేదు… ఎక్కట్లేదు అంటే అ క్లైమాక్స్ ఏంటి ? అది వర్కౌట్ కాదు అని డిస్కషన్ నడుస్తోంది. కానీ నేను దాన్ని నమ్మాను. అదే చెప్పాను కూడా. నేను ఇంత నమ్మి చేసినప్పుడు నమ్మకపోతే నా జడ్జిమెంట్ మీద నాకు గ్రిప్ లేనట్టే కదా. నేను ఆలోచించేది తప్పు అవుతున్నట్టు కదా. అదే జరిగి ఉంటే వేరే వాళ్ళు అనేదాని కన్నా నా జడ్జిమెంట్ రాంగ్ అయింది రా… వేరే రాంగ్ జోన్ లో ఉన్నాను అనే జోన్ కు వెళ్లిపోయేవాడినేమో. కానీ అదృష్టం కొద్దీ అది వర్కౌట్ అయింది” అంటూ సమాధానం చెప్పారు.
ఆరోజు మార్నింగ్ నుంచి ఇంకోలా ఉండేది….
“మిమ్మల్ని వెనక్కి లాగే వాళ్ళు ఉన్నారు అని అన్నారు కదా… వాళ్ళకు ఇంకొంచెం గట్టిగా మాట్లాడే స్కోప్ ఇచ్చేవారేమో…” అనే ప్రశ్నకి, “100%… మార్నింగ్ నుంచి వేరేలా ఉండేది. ప్రస్తుతానికి అంతా స్మూత్ గా జరుగుతుంది. జరిగేవి ఎలాగూ జరుగుతుంటాయి. దేన్ని ఆపలేం… కానీ నేను సంతోషంగా ఉన్నాను” అన్నారు కిరణ్ అబ్బవరం. ఈ హీరో మార్చి 14న ‘దిల్రూబా’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.