BigTV English

War 2: ‘వార్ 2’ నుండి అదిరిపోయే అప్డేట్.. అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ షేక్ అయిపోవాల్సిందే.!

War 2: ‘వార్ 2’ నుండి అదిరిపోయే అప్డేట్.. అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ షేక్ అయిపోవాల్సిందే.!

War 2: ఈరోజుల్లో బాలీవుడ్ స్టార్లు ఎలా అయితే టాలీవుడ్‌లో అడుగుపెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నారో.. అలాగే టాలీవుడ్ స్టార్లు కూడా బాలీవుడ్‌లో తమకంటూ గుర్తింపు తెచ్చుకోవాలని ఆశపడుతున్నారు. ఇక ప్రస్తుతం తెలుగులో స్టార్ హీరోలుగా వెలిగిపోతున్న వారిలో ముందుగా బీ టౌన్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ముందుకొచ్చాడు ఎన్‌టీఆర్. రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’లో హీరోగా కనిపించిన తర్వాత ఎన్‌టీఆర్ బాలీవుడ్ బాట పడతాడని ఎవరూ ఊహించలేదు. అది కూడా ఒక బాలీవుడ్ స్టార్‌తో కలిసి మల్టీ స్టారర్‌లో నటిస్తాడని అస్సలు అనుకోలేదు. ప్రస్తుతం ఎన్‌టీఆర్ హిందీ డెబ్యూ మూవీ ‘వార్ 2’ (War 2) నుండి అదిరిపోయే అప్డేట్ బయటికొచ్చింది.


క్రేజీ అప్డేట్

హృతిక్ రోషన్, ఎన్‌టీఆర్ హీరోలుగా నటిస్తున్న మల్టీ స్టారర్ చిత్రమే ‘వార్ 2’. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ చాలాకాలంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ మూవీ షూటింగ్‌లో ఎన్‌టీఆర్ పాల్గొన్న ప్రతీసారి దానికి సంబంధించిన ఏదో ఒక ఫుటేజ్ లీక్ అవుతూనే ఉంది. కానీ ఇప్పటివరకు మేకర్స్ మాత్రం ఈ సినిమా నుండి కనీసం అఫీషియల్ పోస్టర్ కూడా విడుదల చేయలేదు. షూటింగ్ దాదాపు పూర్తవుతున్నా కూడా దీనిపై ఎలాంటి అప్డేట్ ఇవ్వకుండా ఫ్యాన్స్‌ను మరింత వెయిట్ చేసేలా చేస్తున్నారు. ఇంతలో ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన క్రేజీ అప్డేట్ బయటికొచ్చింది. ఈ అప్డేట్ ఫ్యాన్స్‌లో కొత్త జోష్ నింపుతోంది.


వందల మంది డ్యాన్సర్స్‌తో

బాలీవుడ్‌లో హృతిక్ రోషన్ (Hrithik Roshan), టాలీవుడ్‌లో ఎన్‌టీఆర్ (NTR).. ఈ ఇద్దరు తిరుగులేని డ్యాన్సర్లే. వారి డ్యాన్స్‌కే సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అలాంటిది ఈ ఇద్దరు హీరోలు కలిసి ఒక సినిమాలో నటిస్తున్నారంటే అందులో ప్రేక్షకులను ఉర్రూతలూగించే డ్యాన్స్ నెంబర్ ఉండకుండా ఉంటుందా.. అందుకే హృతిక్, ఎన్‌టీఆర్ మధ్య ఒక క్రేజీ డ్యాన్స్ సీక్వెన్స్ ప్లాన్ చేశారట మేకర్స్. ఇక ఈ పాట కోసం భారీ బడ్జెట్‌తో పాటు 500 మంది డ్యాన్సర్లను కూడా రంగంలోకి దించనున్నారని అర్థమవుతోంది. ఇది రెగ్యులర్ డ్యాన్స్ నెంబర్‌లాగా కాకుండా స్పెషల్‌గా, డిఫరెంట్‌గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. దీంతో ఈ విషయం విన్న ఇరు హీరోల ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Also Read: బాలీవుడ్ స్టార్ హీరో ఇంట్లో శ్రీలీల ఏం చేస్తోంది? డేటింగ్‌లో ఉన్నారా?

పాట సెట్

హృతిక్ రోషన్, ఎన్‌టీఆర్ మధ్య తెరకెక్కే ఈ డ్యాన్స్ నెంబర్‌కు సంబంధించిన షూటింగ్ ఇప్పటికే ప్రారంభమయ్యిందట. యష్‌రాజ్ స్టూడియోస్‌లో వేసిన సెట్‌లో ఈ సాంగ్ షూటింగ్ జరుగుతుందని సమాచారం. ప్రీతమ్ మ్యూజిక్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ పాటను బాస్కో మార్టిస్ కొరియోగ్రాఫ్ చేస్తున్నారు. మొత్తానికి ‘వార్ 2’ నుండి ప్రేక్షకులు ఏదైతే ఆశిస్తారో అవన్నీ వారికి అందించడానికి మేకర్స్ కష్టపడుతున్నారని తెలుస్తోంది. ఇక ఎన్‌టీఆర్ బాలీవుడ్ డెబ్యూ అంటే తన తెలుగు ఫ్యాన్స్ అంతా ఓ రేంజ్‌లో అంచనాలు పెంచేసుకున్నారు. అందులో తన పాత్ర ఎలా ఉంటుందా అని నిరంతరం సోషల్ మీడియాలో డిస్కషన్స్ చేస్తున్నారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×