Rahasya Gorak: రాజావారు రాణిగారు సినిమాతో తెలుగుతెరకు పరిచయమయ్యారు కిరణ్ అబ్బవరం, రహస్య గోరఖ్. మొదటి సినిమాతోనే హిట్ అందుకున్న ఈ జంట.. తరువాత ప్రేమాయణం మొదలుపెట్టారు. కిరణ్ వరుస సినిమాలు చేస్తూ వచ్చాడు కానీ, రహస్య మాత్రం మొదటి సినిమాకే పరిమితమయ్యింది. కొన్నేళ్లు వీరు డేటింగ్ లో ఉన్నారు. అయితే ఆ విషయాన్నీ మాత్రం ఎవరికి చెప్పకుండా బాగా మ్యానేజ్ చేశారు.
ఇక చివరికి ఆగస్టులో ఈ జంట వివాహాబంధంతో ఒక్కటయ్యింది. పెళ్లి తరువాత కిరణ్ కు తోడుగా రహస్య .. అతని సినిమాల కోసం పనిచేస్తూ వస్తుంది. క ప్రొడక్షన్స్ కు ఆమె సీఈఓగా మారింది. ప్రస్తుతం కిరణ్ నటిస్తున్న చిత్రం క. అక్టోబర్ 31 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మొదటి నుంచి కూడా ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలనే పెట్టుకున్నారు.
Photo Talk: మెగా- అక్కినేని వారసులు.. ఒకే ఫ్రేమ్ లో.. చూడడానికి రెండు కళ్లు చాలడంలేదే
ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండగా ప్రమోషన్స్ షురూ చేసిన మేకర్స్.. తాజాగా క ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు అక్కినేని హీరో నాగచైతన్య ముఖ్య అతిథిగా విచ్చేశాడు. ఇక ఈ ఈవెంట్ లో కిరణ్ భార్య రహస్య మాట్లాడుతూ.. తన భర్త క మూవీ కోసం ఎంత కష్టపడ్డాడో చెప్పుకొచ్చింది.
“క సినిమా రిలీజ్ కాకముందే సినిమా హిట్ అవుతుందని, ట్రైలర్ బావుందని అభిమానులు చెప్పడం చాలా ఆనందంగా అనిపిస్తుంది. మీ అందరి ప్రేమకు నేను థాంక్స్ చెప్తున్నాను. మీ అభిమానం ఎప్పుడు మాపై ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. చాలా ఏళ్లుగా కిరణ్ ఎన్నో కష్టాలు, అవమానాలు భరిస్తూ వచ్చాడు. అందరికి ఒక డ్రీమ్ ఉంటుంది. దాని నెరవేర్చుకోవడానికి హార్డ్ వర్క్ చేస్తాం. కానీ, దాంతో పాటు ఒక సపోర్ట్ ఉంటే బావుంటుంది అనుకుంటాం. ఆ సమయంలో కూడా ఆయనకు తోడు ఉన్న వారందరికీ నేను థాంక్స్ చెప్తున్నాను. క కోసం కిరణ్ చాలా కష్టపడ్డాడు. ఏడాదిన్నర గ్యాప్ తీసుకొని, లుక్ మార్చి.. కథ కోసం ఎంతో తాపత్రయపడి చేశాడు. కిరణ్ ఇక్కడవరకు వచ్చారంటే.. అదంతా మీ వలనే.
Ashok Galla: మహేష్ బాబు ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్ చెప్పిన మేనల్లుడు.. క్షమించండి అంటూ పోస్ట్
క మూవీ ఎందుకు చూడాలంటే నేను మూడు కారణాలు చెప్తాను. మొదటిది మీ కోసం చూడండి. ఎన్నో ప్రెషర్స్ లో ఉంటారు. ఎంటర్ టైన్ అవ్వడానికి థియేటర్ కు వస్తారు. క సినిమా మీకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. రెండోది మా టీమ్ కోసం చూడండి. మా టీమ్ అంతా ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఒక సినిమా మంచిగా వచ్చింది అంటే.. అది చిత్ర బృందం చేసిన హార్డ్ వర్క్ నే. క సినిమా కోసం చిత్ర బృందం పడిన కష్టం కనిపిస్తుంది.
ఇక మూడోది.. మా ఆయన కోసం చూడండి ప్లీజ్. కిరణ్ క కోసం ఎంత కష్టపడ్డాడు అంటే.. మా పెళ్లి రోజు తప్ప మిగతా అన్ని రోజులు దానికోసమే పనిచేశాడు. అర్ధరాత్రి 2 , 3 అని తేడాలేకుండా ఏ ఆలోచన వచ్చినా లేపి.. ఇలా చేస్తే బావుంటుంది. కథను ఇలా చెప్తే బావుంటుంది అని ఆరాటపడేవాడు. కచ్చితంగా మీకు క నచ్చుతుంది. ఒకవేళ నచ్చకపోయినా మా ఎఫర్ట్స్ కోసం ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి. ఈ సినిమా చూసాకా మీరు రెండు రోజులు నిద్రపోరు.. అంత హంటింగ్ గా మ్యూజిక్ ఉంటుంది. అక్టోబర్ 31 న అందరూ థియేటర్ లోనే సినిమా చూడండి” అని చెప్పుకొచ్చింది.