IND VS NZ: టీమిండియా ఉమెన్స్ ( India Women ) వర్సెస్ న్యూజిలాండ్ ఉమెన్స్ ( New Zealand Women ) జట్ల మధ్య జరిగిన మూడో వన్డేలో… మన మహిళలు అదరగొట్టారు. మూడవ వన్డేలో ఏకంగా ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించారు. దీంతో సిరీస్ ను.. 2-1 తేడాతో టీమిండియా ఉమెన్స్ జట్టు గెలుపొందడం జరిగింది. టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఇవాళ మూడవ వన్డే జరిగింది.
Also Read: IND VS NZ: 3వ టెస్ట్ లో భారీ మార్పులు..టీమిండియా నుంచి ముగ్గురు సీనియర్లు ఔట్ ?
అయితే ఈ మూడో వన్డేలో మొదటి బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు 49.5 ఓవర్లలో 232 పరుగులకు ఆలౌట్ అయింది. అయితే ఆ లక్ష్యాన్ని ఆరు వికెట్లు ఉండగానే ఛేదించింది టీమిండియా. 44.2 ఓవర్లలో… 232 లక్ష్యాన్ని చేదించి… గ్రాండ్ విక్టరీ కొట్టింది టీం ఇండియా.
Also Read: VVS Laxman: టీమిండియాకు కొత్త హెడ్ కోచ్..బీసీసీఐ సంచలనం !
ఇక కీలకమైన ఈ వన్డేలో… టీమిండియా బ్యాటర్ స్మృతి మందాన ( Smriti Mandhana ) సెంచరీ చేసి అదరగొట్టారు. అలాగే కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ 59 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. ఈ తరుణంలోనే టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టడం జరిగింది.