Manchu Vishnu: మామూలుగా మంచు ఫ్యామిలీని ట్రోల్ చేసే నెటిజన్ల సంఖ్య చాలా ఎక్కువ. ఎప్పటికప్పుడు వారికి సంబంధించిన ఏదో ఒక వీడియోను వైరల్ చేస్తూ దానిని ట్రోల్ చేస్తూ ఉంటారు. కానీ ఆ ఫ్యామిలీ మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుంటూ పోతుంది. ఇక చారిటీ విషయంలో కూడా కష్టం వచ్చిన వారికి అండగా నిలవడంలో మంచు ఫ్యామిలీ ముందుంటుంది. ఇప్పటికే తిరుపతిలో కాలేజ్, స్కూల్‌ను రన్ చేస్తున్న ఈ కుటుంబం.. పేద విద్యార్థులను, గవర్నమెంట్ స్కూల్స్‌ను దత్తత తీసుకొని వారికి మెరుగైన చదువు అందించడానికి కష్టపడుతోంది. తాజాగా రిపబ్లిక్ డే సందర్భంగా మరొక మంచి నిర్ణయంతో మంచు విష్ణు ముందుకొచ్చాడు.
వారికి మాత్రమే వర్తిస్తుంది
మోహన్ బాబు యూనివర్సిటీకి ప్రో ఛాన్సలర్ అయిన మంచు విష్ణు.. రిపబ్లిక్ డే సందర్భంగా ఒక స్పెషల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. ఆర్మీలో మృతి చెందిన కుటుంబాలకు చేయుత అందించడానికి ముందుకొచ్చారు. ఇప్పటినుండి మోహన్ బాబు యూనివర్సిటీ.. తెలుగు వారైన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌లో పనిచేస్తున్న ఉద్యోగుల పిల్లలకు 50 శాతం స్కాలర్‌షిప్ అందిస్తుందని ప్రకటించాడు విష్ణు. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న తెలుగువారికి మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి వర్తిస్తుందని క్లారిటీ ఇచ్చాడు. మోహన్ బాబు యూనివర్సిటీలో వారు ఏ కోర్స్ చేయాలన్నా ఈ స్కాలర్‌షిప్ వర్తిస్తుందని తెలిపాడు.
కృతజ్ఞతలు తెలియజేయడం కోసం
ప్రస్తుతం మంచు విష్ణు (Manchu Vishnu).. చారిటీ పేరుతో సమాజానికి ఎన్నో సేవలను అందిస్తున్నాడు. ఇక రెండేళ్ల క్రితమే తిరుపతిలో 120 మంది పిల్లలకు దత్తత తీసుకొని వారి చదువుతో పాటు ఇతర విషయాల్లో కూడా సహాయం అందిస్తున్నట్టుగా ఇటీవల బయటపెట్టాడు విష్ణు. ఇక ఆర్మీ ఉద్యోగుల పిల్లలకు స్కాలర్‌షిప్ అందించే విషయంపై కూడా సంతోషం వ్యక్తం చేశాడు. ‘‘మన దేశాన్ని రక్షించడానికి సైనికులు ఎన్నో త్యాగాలు చేస్తారు. వారి సేవలకు గౌరవ సూచకంగా, వారికి కృతజ్ఞతలు తెలియజేసే క్రమంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టాను. దేశానికి నిస్వార్థంగా సేవ చేసే వారి సంక్షేమానికి తోడ్పడాలని నిర్ణయించుకున్నాను. ఇతర విశ్వవిద్యాలయాలు, సంస్థలకు మా నిర్ణయం స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నాను’’ అన్నాడు.
Also Read: అందుకే ఇలా చేశాను, ఇకపై సినిమాలు చేయను.. సన్యాసం తీసుకోవడంపై నోరువిప్పిన నటి
ఎన్నో చారిటీ కార్యక్రమాలు
చాలామందికి మెరుగైన విద్యను అందించడం కోసం మంచు విష్ణు ఇప్పటికే ఎన్నో చారిటీ కార్యక్రమాలు చేపట్టాడు. మోహన్ బాబు యూనివర్సిటీ (Mohan Babu University) తరపున మాత్రమే కాకుండా తను స్వయంగా కూడా ఎంతోమంది విద్యార్థులకు సాయం చేయడానికి ముందుకొచ్చాడు. ఇప్పటికే ఎంతోమంది పేద విద్యార్థులకు యూనివర్సిటీలో మెరుగైన చదువు అందుతోంది. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం మంచు విష్ణు ‘కన్నప్ప’ (Kannappa)తో బిజీగా ఉన్నాడు. స్టార్ క్యాస్టింగ్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీపై మొదట్లో ప్రేక్షకులకు ఎలాంటి అంచనాలు లేకపోయినా.. మెల్లగా దాని గురించి సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యి మంచి హైప్ క్రియేట్ అయ్యింది.