Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఆతిథ్యంపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కీలక ప్రకటన చేసింది. 2024 – 27 మధ్య జరగబోయే ఐసీసీ టోర్నీల్లో భారత్ – పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ లు అన్ని తటస్థ వేదికలపైనే జరుగుతాయని పేర్కొంది. భారత్ కోరినట్లుగా {Champions Trophy 2025} హైబ్రిడ్ మోడల్ లోనే టోర్ని నిర్వహించేందుకు ఐసీసీ నిర్ణయించింది. ఈ విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) గురువారం అధికారికంగా ప్రకటించింది.
Also Read: Sara Tendulkar: టీమిండియా ప్లేయర్ కోసం సారా అందాల ఆరబోత.. వీడియో వైరల్ !
వచ్చే ఏడాది జరగనున్న ఛాంపియన్ ట్రోఫీ 2025 కోసం టీమ్ ఇండియా జట్టు పాకిస్తాన్ వెళ్ళదని.. తటస్థ వేదికలలోనే {Champions Trophy 2025} టీమ్ ఇండియా మ్యాచ్ లు ఆడుతుందని స్పష్టం చేసింది. పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి నెల నుండి ప్రారంభమయ్యే ఛాంపియన్ ట్రోఫీ 2025 తోనే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని తెలిపింది. అలాగే భారత్ వేదికగా జరిగే మహిళల వన్డే ప్రపంచ కప్ 2025, పురుషుల టి20 వరల్డ్ కప్ 2026 లో పాకిస్తాన్ మ్యాచ్ లు తటస్థ వేదికగా జరుగుతాయని పేర్కొంది.
భద్రతా కారణాల దృశ్య తమ జట్టును పాకిస్తాన్ కి పంపే ప్రసక్తి లేదని భారత క్రికెట్ నియంత్రణ మండలి ( బీసీసీఐ ) అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)కి తేల్చి చెప్పడంతో {Champions Trophy 2025} హైబ్రిడ్ విధానానికి ఐసీసీ ఆమోదం తెలిపింది. మొదట హైబ్రిడ్ విధానానికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అంగీకరించలేదు. కానీ అనేక చర్చల అనంతరం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిసి) పంతం వీడింది. ఇకనుండి భారత్ – పాకిస్తాన్ జట్ల మధ్య ఐసీసీ టోర్నమెంట్లు ఎప్పుడు జరిగినా హైబ్రిడ్ విధానాన్ని పాటిస్తామని ఐసీసీ తెలిపింది.
ఇక హైబ్రిడ్ విధానంలో జరగనున్న ఛాంపియన్ ట్రోఫీ 2025 కి భారత్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా, ఆఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్ జట్లు అర్హత సాధించాయి. ఇక పాకిస్తాన్ అతిథ్య జట్టు హోదాలో నేరుగా ఈ టోర్నీలోకి ప్రవేశించింది. 2017 వ సంవత్సరం చాంపియన్స్ ట్రోఫీలో గెలుపొంది ఈ అవకాశాన్ని దక్కించుకుంది. 2017 వ సంవత్సరంలో చివరిసారిగా ఛాంపియన్ ట్రోఫీ జరగగా.. ఫైనల్ లో భారత్ ని ఓడించి పాకిస్తాన్ విజేతగా నిలిచింది. అయితే {Champions Trophy 2025} ఇక ముందు జరగబోయే తటస్థ వేదిక ఏంటో ఐసీసీ వెల్లడించలేదు.
దుబాయ్ వేదికగానే భారత్ – పాకిస్తాన్ మ్యాచ్ లు {Champions Trophy 2025} జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఐసీసీ తీసుకున్న ఈ నిర్ణయంతో భారత్ – పాకిస్తాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ లకు వేదిక ఏదన్న సస్పెన్స్ కి తెరదించినట్లు అయ్యింది. గురువారం చైర్మన్ జయ్ షా నేతృత్వంలో సమావేశమైన అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) భారత్ – పాకిస్తాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ ల వేదికపై చర్చలకు పుల్ స్టాప్ పెట్టింది.