Tollywood Heroine : టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్న హీరోయిన్లు ఈమధ్య సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. కొందరు మాత్రం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతున్నారు. అయితే ఎంతో మంది హీరోయిన్లు సినిమాలకు గుడ్ బై చెప్పేసి పెళ్లి చేసుకొని ఫ్యామిలీ లైఫ్ ని లీడ్ చేస్తున్నారు. అలాంటి వారిలో పవన్ కళ్యాణ్ నటించిన బ్లాక్ బాస్టర్ మూవీ ఖుషి హీరోయిన్ ఒకరు. పవన్ కళ్యాణ్ తో కొన్ని సినిమాలు చేసిన ఈ హీరోయిన్ ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. సోషల్ మీడియాలో తన ఫ్యామిలీ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు టచ్ లో ఉంటున్నారు. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో అని ఆలోచిస్తున్నారు కదూ.. ఆమె మరెవరో కాదు ముంతాజ్.. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలో నటించి తన నటనతో మెప్పించడమే కాదు.. అదిరిపోయే డాన్స్ స్టెప్పులతో కుర్ర కారు మనసు దోచేసింది. ప్రస్తుతం ఆమె ఎలా ఉంది? ఏం చేస్తుందో? ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
ఖుషి హీరోయిన్ ముంతాజ్ గుర్తుందా..?
టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హిట్ సినిమాల్లో ఖుషి కూడా ఒకటి. అప్పట్లో ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో పాటుగా కలెక్షన్ల పరంగా కూడా దుమ్ము దులిపేసింది. ఈ సినిమాలో ఒక హీరోయిన్ భూమిక అయితే.. మరో హీరోయిన్గా ముంతాజ్ నటించింది. ఖుషి మూవీలో స్పెషల్ సాంగ్ చేసిన బ్యూటీ అంటే మాత్రం ఓ ఆ బొద్దుగుమ్మ అంటూ వెంటనే గుర్తుపట్టేస్తారు. మహారాష్ట్రకు చెందిన ముద్దుగుమ్మ ముంతాజ్ అసలు పేరు నగ్మా ఖాన్. అప్పట్లో ఐటెం సాంగ్స్ అంటే ఆమె గుర్తొచ్చేది. తమిళ సినిమాలతో కెరీర్ స్టార్ట్ చేసిన ముంతాజ్.. తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం సినిమాల్లో స్టార్ హీరోల సరసన ఆడిపాడింది. ఈమె చేసిన పాటలన్నీ కూడా ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. అదిరిపోయే స్టెప్పులతో పాటు మత్తెక్కించే కళ్ళతో ఈమె కుర్రకారు మనసు దోచుకుంది. ఈమె పెళ్లి చేసుకొని ఇండస్ట్రీకి దూరమైంది. అయితే ఇప్పుడు ఏం చేస్తుంది? ఎక్కడ ఉందో? ఇప్పుడు తెలుసుకుందాం.
Also Read :మోక్షజ్ఞ జాతకం పై వేణు స్వామి సంచలన కామెంట్స్..నిజంగానే అది జరగదా..?
ముంతాజ్ ఏం చేస్తుందంటే..?
పవన్ కళ్యాణ్, వెంకటేష్ లతో చేసిన సినిమాలు మంచి టాక్ ను అందుకున్నాయి. అయితే కెరీర్ పీక్స్ లో ఉండగానే సినిమాలకు దూరం అయింది. చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది స్పెషల్ సాంగ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ముంతాజ్ కొద్ది కాలంగా సినిమాలు చేయట్లేదు. ఆమె ఇన్ స్టాగ్రామ్ ప్రొఫైల్ కనిపించింది. కొద్దికాలం క్రితమే తను పెళ్లి చేసుకున్నట్టు, పిల్లలు కూడా ఉన్నట్టు ఆ ఫోటోలను చూస్తే తెలుస్తుంది. ఫ్యామిలీ లైఫ్ ను లీడ్ చేస్తుంది. ముంబయిలోఉన్నట్లు తెలుస్తుంది. అంతేకాదు.. అప్పట్లో తన అంద చందాలతో కుర్ర కారు మతిపోగొట్టిన ఈ అమ్మడు.. ఇప్పుడు స్కిన్ షో అనేదే కనిపించకుండా బుర్ఖాలో కనిపిస్తుంది. ఆమె లేటెస్ట్ లుక్ ను చూసి ఆమె ఫ్యాన్స్ సైతం షాక్ అవుతున్నారు. ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
?igsh=ZnNyYWsxNW9oMnB0