AR Rahman : ఈ రోజు ఉదయం నుంచి ఆస్కార్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ (AR Rahman) విడాకుల వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన తన భార్యకు విడాకులు ఇవ్వడం అన్నదే షాకింగ్ అనుకుంటే, తాజాగా అంతకంటే విచిత్రమైన విషయం ఒకటి జరిగింది. ఏఆర్ రెహమాన్ డివోర్స్ ప్రకటించిన గంటల వ్యవధిలోనే, ఆయన అసిస్టెంట్ కూడా తన భర్తకు విడాకులు ఇస్తున్నట్టుగా వెల్లడించి కొత్త అనుమానాలకు తెర తీసింది.
ఏఆర్ రెహమాన్ (AR Rahman) 1995లో సైరా బానును పెళ్లి చేసుకున్నారు. అనంతరం ఈ జంటకు ముగ్గురు పిల్లలు పుట్టారు. అన్యోన్యంగా ఉన్నారు అనుకున్న ఈ జంట… పెళ్లయిన 29 ఏళ్ల తర్వాత విడిపోతున్నట్టుగా ప్రకటించి అందరిని ఆశ్చర్యంలో ముంచారు. ఏఆర్ రెహమాన్ విడాకులపై స్పందిస్తూ ఈరోజు ఉదయాన్నే సోషల్ మీడియాలో అఫీషియల్ గా విషయాన్ని వెల్లడించారు. తమ వైవాహిక బంధం త్వరలోనే 30 ఏళ్లకు చేరుతుందని సంతోషించామని, కానీ అది జరగకముందే అనుకోని విధంగా ఈ బంధానికి ముగింపు పలకాల్సి వచ్చిందని అన్నారు ఆయన. అంతేకాకుండా ఇలాంటి కఠిన పరిస్థితుల్లో తమ వ్యక్తిగత గోప్యతను అర్థం చేసుకుంటారని భావిస్తున్నాం అంటూ ఎక్స్ వేదికగా తన పోస్ట్ ను పంచుకున్నారు.
ఇంకా రెహమాన్ (AR Rahman) విడాకుల అనౌన్స్మెంట్ ఇచ్చిన షాక్ నుంచి తేరుకోక ముందే ఆయన అసిస్టెంట్ మోహిని డే (Mohini Dey) కూడా తన భర్త మార్క్ హార్ట్సుచ్ కు డివోర్స్ ఇచ్చినట్టుగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. మోహిని డే (Mohini Dey) అంటే ఎవరో కాదు ఏఆర్ రెహమాన్ సాంగ్స్ కు గిటార్ వాయించే అమ్మాయి. మోహినీ డే సోషల్ మీడియా పోస్ట్ లో తన భర్త, తాను మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో డీవోర్స్ తీసుకున్నామని వెల్లడించింది. అయితే ఆ బంధం అక్కడితో ఆగదని, తామిద్దరం భవిష్యత్తులో ఫ్రెండ్స్ గా ఉంటామని, కలిసి వర్క్ కూడా చేస్తామని వివరించింది.
రెహమాన్ విడాకులు ప్రకటించిన గంటల వ్యవధిలోనే ఆయన అసిస్టెంట్ మోహిని డే తన భర్తకు విడాకులు ఇచ్చింది. ఇద్దరు కూడా విడాకులు ప్రకటించిన పోస్ట్ లో తమ ప్రైవసీని గౌరవించండి అంటూ రాసుకొచ్చారు. దీంతో ఏఆర్ రెహమాన్ అభిమానులు ఇప్పుడు అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. ఇటు రెహమాన్ (AR Rahman), అటు మోహినీ (Mohini Dey) ముందుగా అనుకుని ఇలా తమ పార్ట్నర్స్ నుంచి విడాకులు తీసుకున్నారా? ఇద్దరి మధ్య ఏదైనా ఎఫైర్ ఉందా? అనే చర్చ నడుస్తోంది సోషల్ మీడియాలో.
కాగా తమ తల్లిదండ్రుల విడాకుల విషయంపై ఏఆర్ రెహమాన్ (AR Rahman) పిల్లలు స్పందించారు. రహిమా, అమీన్, ఖతీజా… ముగ్గురు సోషల్ మీడియా వేదికగా, తమ తల్లిదండ్రుల విడాకుల విషయంలో ప్రైవసీని పాటిస్తూ.. గౌరవంగా వ్యవహరించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. అంతేకాకుండా అర్థం చేసుకున్నందుకు కృతజ్ఞతలు అంటూ ఈ ముగ్గురు పిల్లలు పేర్కొన్నారు.