BigTV English

Indian Coast Guard : పాక్ నౌకను రెండు గంటల పాటు వెంబడించిన భారత్ నావీ.. వారికి స్టాంగ్ వార్నింగ్..

Indian Coast Guard : పాక్ నౌకను రెండు గంటల పాటు వెంబడించిన భారత్ నావీ.. వారికి స్టాంగ్ వార్నింగ్..

Indian Coast Guard : భారత సముద్ర జలాల్లో వేటకు వెళ్లిన భారతీ మత్స్యకారుల్ని అపహరించేందుకు పాక్ చేసిన ప్రయత్నాలకు భారత తీర రక్షణ దళం విజయవంతంగా అడ్డుకుంది. వారి బారి నుంచి ఏడుగురుని రక్షించింది. ఇందుకోసం.. సముద్రంలో రెండు గంటల పాటు సుదీర్ఘ ఆపరేషన్ చేపట్టిన భారత నేవీ.. విజయవంతంగా మన జాలర్లను కాపాడింది.


సువిశాల సముద్ర తీరం ఉన్న భారత్ లో.. తీర ప్రాంతాల్లోని ప్రజలు చేపల వేటకు సముద్రంలోకి వెళుతుంటారు. భారత ప్రదేశిక జలాలతో పాటు అంతర్జాతీయ జలాల్లోనూ చేపల వేట సాగిస్తుంటారు. అన్ని దేశాల్లోనూ ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. కానీ.. భారత మత్స్యకారులకు శ్రీలంక, పాకిస్థాన్ దేశాల సరిహద్దు జలాల్లోనే తీవ్ర సమస్యలు ఎదురవుతున్నాయి. ఆయా దేశాల మత్స్యకారుల నుంచి వేటలో గట్టి పోటీ ఉంటుంది. ఈ రెండు ప్రాంతాల్లో.. ఆయా దేశాల సైన్యాలు సైతం భారత జాలర్ల పట్ల కఠినంగా వ్యవహరిస్తూ.. నిత్యం దాడులకు పాల్పడుతుంటారు. ఇలాంటి ఘటనే తాజాగా.. పాక్ భారత్ సముద్ర జలాల్లో చోటుచేసుకుంది.

భారత్ – పాక్ మధ్య సముద్ర సరిహద్దు రేఖకు సమీపంలోని నో – ఫిషింగ్ జోన్ (NFZ) కు సమీపంలో నడుస్తున్న భారతీయ మత్స్యకారుల కాల భైరవ్ అనే ఫిషింగ్ బోట్ ను పాకిస్థాన్ మారిటైమ్ సెక్యూరిటీ ఏజన్సీ అడ్డుకుంది. అందులోని ఏడుగురును అదుపులోకి తీసుకుంది. వారంతా.. పాక్ సముద్ర జలాల్లోకి ప్రవేశించారని ఆరోపిస్తూ, భారత మత్స్యకారుల్ని అపహరించింది. వారిని పాకిస్థాన్ కు తరలించేందుకు చేసిన ప్రయత్నాలను భారత కోస్ట్ గార్డు(ICG) బృందం భగ్నం చేసింది.


సముద్ర జలాల్లో తమను పాక్ సైన్యం అడ్డగించింది అంటూ.. భారత జాలర్ల నుంచి ఇండియన్ కోస్ట్ గార్డు(ICG) అత్యవసర సందేశం అందింది. వెంటనే రంగంలోకి దిగిన భారత బృందాలు.. అగ్రిమ్ నౌకను రంగంలోకి దించింది. సముద్ర జలాల్లో పాకిస్థాన్ కి చెందిన PMS నుస్రత్‌ లో భారత జాలర్లు ఉన్నట్లు గుర్తించిన భారత నేవీ.. రెండు గంటల పాటు ఆ నౌకను వెంబడించింది. అందులోని ఏడుగురు భారత పౌరుల్ని విడిచిపెట్టాలని హెచ్చరించింది. తమ పౌరుల అపహరణను అనుమతించమంటూ తేల్చి చెప్పింది. దాంతో.. తప్పనిసరి పరిస్థితుల్లో భారత జాలర్లను పాకిస్థాన్ మారిటైమ్ సెక్యూరిటీ విడిచిపెట్టింది.

ఈ ఘటన తర్వాత జాలర్లకు వైద్య పరీక్షలు నిర్వహించారు. వారంతా ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. కాగా.. జాలర్లు వేటకు వినియోగించిన కాల భైరవ్ బోట్.. ఘటన సమయంలో దెబ్బతిన్నదని, పూర్తిగా మునిగిపోయినట్లు ఇండియన్ కోస్ట్ గార్డ్ ప్రకటించింది. ఇలాంటి అపహరణలను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదని తెలిపిన భారత్.. తమ పౌరుల భద్రత విషయంలో రాజీ పడబోమని ప్రకటించింది.

Also Read : ఢిల్లీలో 50 శాతం ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్.. అసలు కారణం ఇదే

కాగా.. నిత్యం భారత్ మీద పగతో రగిలిపోయే పాకిస్థాన్.. సముద్ర  జలాల్లో ఇలాంటి అపహరణలు నిత్యం చేస్తుంటుంది. మన పౌరుల్ని అక్రమంగా బంధించి, పాక్ కు తరలిస్తుంటారు. అక్కడి జైళ్లల్లో.. లేనిపోని ఆరోపణలు మోపి శిక్షలు విధిస్తుంటారు. అలా.. ఇప్పటికే.. వేల మంది భారత జాలర్లు పాక్ చెరలో నిత్య నరకం అనుభవిస్తున్నారు. సహజంగా.. ఏ దేశ పౌరులైనా, ఇతర దేశాల సముద్ర జలాల్లోకి ప్రవేశిస్తే, ఆయా దేశాలకు తెలియజేయాలి. కానీ.. అరెస్ట్ చేసిన వ్యక్తుల గురించి ఎలాంటి సమాచారం భారత్ కు అందించదు. దాంతో.. సముద్రంలో మాయమైన వారి కోసం ఏళ్ల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితులు బాధిత కుటుంబ సభ్యులవి. అలాంటి.. ప్రయత్నాన్నే తాజాగా భారత నేవీ సమర్థవంతంగా అడ్డుకుంది.

Related News

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Big Stories

×