Umesh Yadav – Umran Malik: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ కు సంబంధించిన మెగా వేలం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో… పలువురు క్రికెటర్లు భారీ రేటు పలుకుతూ అంటే… మరికొంతమంది Un sold ప్లేయర్లుగా మిగిలిపోతున్నారు. అలా ఇప్పటికే టీమిండియా కు చెందిన చాలామంది ప్లేయర్లు… అన్సోల్డ్ గా మిగిలిపోయారు. ఈ తరుణంలోనే హైదరాబాద్ స్పీడ్ స్టార్ ఉమ్రాన్ మాలిక్ కు ( Umran Malik) ఎదురు దెబ్బ తగిలింది.
Also Read: IPL Auction 2025: భువి, దీపక్ చాహర్ కు జాక్ పాట్
ఈ ప్లేయర్ ను ఎవరు కూడా కొనుగోలు చేయలేదు. జమ్మూ కాశ్మీర్ కు చెందిన ఈ స్పీడ్ స్టార్ వేలంలోకి రాగానే… కొనుగోలు చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు 10 ఫ్రాంచైజీలు. మొన్నటి వరకు హైదరాబాద్ జట్టుకు అతను ఆడిన సంగతి తెలిసిందే. దీంతో ఉమ్రాన్ మాలిక్ ను మరోసారి హైదరాబాద్.. గెలుచుకుంటుందని అందరూ అనుకున్నారు.
కానీ ఉమ్రాన్ మాలిక్ ను హైదరాబాద్ తిరిగి సొంతం చేసుకునేందుకు ఎక్కడ ప్రయత్నించలేదు. దీంతో అన్ సోల్డ్ ప్లేయర్ గా మారిపోయాడు. ఇక మరొక స్పీడ్ స్టార్ ఉమేష్ యాదవ్ ను ( Umesh Yadav ) కూడా… కొనుగోలు చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపించలేదు 10 ఫ్రాంచైజీలు. గతంలో గుజరాత్ జట్టుకు ఉమేష్ యాదవ్ వాడిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో 5.8 కోట్లకు గుజరాత్ అతన్ని సొంతం చేసుకుంది.
Also Read: IPL Auction 2025: ఐపీఎల్ వేలంలో భారత క్రికెటర్లకు ఎదురు దెబ్బ.. ఈ ప్లేయర్లందరూ unsold
కానీ ఈసారి ఉమేష్ యాదవ్ ను ( Umesh Yadav ) కొనుగోలు చేసేందుకు గుజరాత్ పెద్దగా ఆసక్తి చూపించలేదు. ఇటు స్టీవ్ స్మిత్ కూడా అన్సోల్డ్ ప్లేయర్ గా మారిపోయాడు. ఇక 11.5 కోట్లు గతంలో పలికిన ఆర్సిబి ప్లేయర్ అల్జరి జోసెఫ్ ను కొనుగోలు చేసేందుకు ఏ జట్టు కూడా ఆసక్తి చూపించలేదు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కూడా అతని ఆర్టీఎం కార్డు వాడి రిటైన్ చేసుకోలేదు. దీంతో జోసెఫ్ అన్సోల్డ్ ప్లేయర్ గా మారిపోయాడు.
ఇది ఇలా ఉండగా…. ఈసారి వేలంలో అజిక్య రహానేను ఎవరు కొనుగోలు చేయలేదు. మొన్నటి వరకు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు అజక్య రహానే ఆడిన సంగతి తెలిసిందే. అతడు డిఫరెన్స్ బాగా ఆడతాడని ఒక ముద్ర ఉంది. టి20 మ్యాచ్ లకు పనికిరాదని అతని కొనుగోలు చేయలేదని సమాచారం. ఇవాల్టి వేలంలో… టీమిండియా ఫాస్ట్ బౌలర్ల పంట పండింది. హైదరాబాద్ మాజీ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కొనుగోలు చేసింది. మహమ్మద్ షమీ హైదరాబాద్ జట్టులోకి రావడంతో… భువనేశ్వర్ కుమార్ ను వదిలేసుకుంది హైదరాబాద్ జట్టు.
అలాగే చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు చెందిన దీపక్ చాహర్…ను ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఫామ్ లో లేకపోయినా… మంచి దరి దక్కించుకున్నాడు దీపక్ చాహర్. ఇక అటు వాషింగ్టన్ సుందర్ ను గుజరాత్ టైటాన్స్ జట్టు కొనుగోలు చేసింది. ఈ మధ్యకాలంలో వాషింగ్టన్ సుందర్ అదరగొడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే అతని కొనుగోలు చేసేందుకు గుజరాత్ ఆసక్తి చూపించింది.