Singer Wheesung: కొరియన్ భాషలో తనదైన ముద్ర వేసుకున్న సింగర్ వీసంగ్ అనుమానస్పద స్థితిలో చనిపోయి ఉన్నాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. 43 ఏళ్ల వయసు కలిగిన ఈ సింగర్ దక్షిణ కొరియా గాయకుడు మరియు పాటల రచయిత వీసుంగ్, పూర్తి పేరు చోయ్ వీ-సంగ్ మరణించారు. ఉత్తర సియోల్‌లోని తన నివాసంలో మార్చి 10 న సోమవారం తెలిపారు. ఆయన మృతికి కారణాలు తెలియక పోవడంతో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. డ్రగ్స్ తీసుకున్నారని తేలడంతో ప్రస్తుతం ఈ కేసును అన్నీ కోణాల్లో విచారణ జరుపుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.
వీసంగ్ యొక్క ప్రతిభ సంస్థ, తాజోయ్ ఎంటర్టైన్మెంట్, అతని మరణాన్ని ధృవీకరిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. అందులో ఏముందంటే.. ఇటువంటి హృదయ విదారకమైన, విషాదకరమైన వార్తలను పంచుకోవడానికి మేము చాలా చింతిస్తున్నాము. మార్చి 10న, మా ప్రియమైన కళాకారుడు వీసంగ్ మరణించాడు. అతను సియోల్‌లోని తన ఇంట్లో గుండెపోటుతో మరణించాడని పేర్కొన్నారు. ఆకస్మిక మరణం అతని కుటుంబాన్ని, తాజోయ్ ఎంటర్‌టైన్‌మెంట్‌లోని కొందరు సింగర్స్, పలువురు ప్రముఖులు ఆయన మృతి పై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు..
Also Read:‘వార్ 2’ మూవీ డ్యాన్స్ ప్రాక్టీస్ లో హృతిక్ రోషన్ కి తీవ్ర గాయాలు..
2002లో లైక్ ఎ మూవీ ఆల్బమ్‌తో అరంగేట్రం చేసిన వీసంగ్, కొరియన్ సంగీత పరిశ్రమలో ప్రఖ్యాత గాయకుడు.. ఈయన తన కెరీర్ స్టార్ట్ చేసిన అప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్నో పాటలు పాడారు. ఆసింగర్ఆకస్మిక మరణం అతని కుటుంబాన్ని, తాజోయ్ ఎంటర్‌టైన్‌మెంట్‌లోని తోటి కళాకారులను మా మొత్తం సిబ్బందిని తీవ్ర దుఃఖంలో ముంచెత్తింది. వీసంగ్‌ను ఎల్లప్పుడూ ఆదరించిన అభిమానులకు ఈ వినాశకరమైన వార్తను అందించడం మాకు చాలా బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు.. అతి చిన్న వయస్సులో ఆయన చనిపోవడం ఫ్యాన్స్ జీర్ణించుకోలేక పోతున్నారు. ప్రస్తుతం ఆయన మరణం పై ప్రముఖులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈయన ఈ మధ్య వరుసగా స్టేజ్ షోలు చేస్తున్నారు. ఈయన మార్చి 15 న కూడా ఓ చెయ్యాల్సి ఉందని తెలుస్తుంది. ఈరోజు సాయంత్రం ఆయన అంత్యక్రియలు చెయ్యనున్నారు.
ఇక ఈయన మాత్రమే కాదు గతంలో ఎంతో మంది అలానే చనిపోతున్నారు. డ్రగ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్లే చనిపోయారని ఓ వార్త సోషల్ మీడియాలో వినిపిస్తుంది. కొరియన్ సింగర్స్ డ్రగ్స్ తీసుకుంటున్నారని గతంలో ఓ వాదన వినిపిస్తుంది. వీసంగ్ కూడా అలాగే చనిపోయినట్లు వార్తలు వినిపిస్తుంది. మరి పోలీసులు ఈ కేసును అన్నీ కోణాల్లో విచారణ చేపడుతున్నారు..