Shweta Basu Prasad: కొత్త బంగారు లోకం.. ఈ సినిమా గురించి తెలియన యువత ఈ జనరేషన్ లో లేదంటే అతిశయోక్తి కాదు. ఎపుడు.. ఎకాడ అంటూ క్యూట్ గా రాగాలు తీసిన స్వప్నను మర్చిపోవడం అంత తేలిక కూడా కాదు. ఆ క్యూట్ అమ్మాయే శ్వేతా బసు ప్రసాద్. బాలనటిగా కెరీర్ ప్రారంభించిన ఈ చిన్నది కొత్త బంగారు లోకం సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది.
వరుణ్ సందేశ్ హీరోగా నటించిన ఈ సినిమాకు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించగా.. దిల్ రాజు నిర్మించాడు. అప్పట్లో ఈ సినిమా ఏ రేంజ్ హిట్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా తరువాత ఈ చిన్నదాని లైఫ్ మారిపోతుంది అనుకున్నారు. కానీ, కొన్ని సినిమాలకే అమ్మడు పరిమితమయ్యింది. ఇక అవకాశాల కోసం, డబ్బు కోసం శ్వేతా.. తప్పటడుగు వేసింది.
వ్యభిచార కూపంలో ఇరుక్కొని ఒక హోటల్ లో పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. ఆ ఘటన తరువాత ఆమె కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. ఇక 2018 లో శ్వేతా.. రోహిత్ మిట్టల్ ను ప్రేమించి పెళ్లాడింది. ఏడాది కలిసి ఉన్న ఈ జంట విభేదాలతో 2019 లో విడాకులు తీసుకొని విడిపోయారు. ఇక అప్పటి నుంచి శ్వేతా బసు ప్రసాద్.. బాలీవుడ్ లో పాగా వేసింది.
బోల్డ్ వెబ్ సిరీస్ లలో నటిస్తూ బాగానే పేరు తెచ్చుకుంది. ఇక సోషల్ మీడియాలో అమ్మడి అందాల ఆరబోత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఈ చిన్నది బికినీతో సోషల్ మీడియాను షేక్ చేసింది. పింక్ కలర్ టాప్.. ఫ్లోరల్ ఇన్నర్ తో దర్శనమిచ్చింది. అప్పుడు బొద్దుగా, ముద్దుగా ఉండే ఈ బ్యూటీ.. ఇప్పుడు బక్కచిక్కి కనిపించింది.
నిజం చెప్పాలంటే అసలు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. మేకప్ లేకుండా న్యాచురల్ లుక్ తో అమ్మడు ఫోటోలకు పోజులిచ్చించిందని తెలుస్తోంది. సడెన్ గా చూస్తే అసలు ఎవరీమె అని అభిమానులు అడిగేస్తారు అని చెప్పొచ్చు. ప్రస్తుతం అవకాశాలు లేక ఫోటోషూట్స్ కే పరిమితమయిన ఈ బ్యూటీ ముందు ముందు ఏమైనా తెలుగు రీఎంట్రీ ఇస్తుందేమో చూడాలి.