BigTV English

Kubera OTT : భారీ ధరకు కుబేర డిజిటల్ రైట్స్.. ఏ ఓటీటీలోకి వస్తుందంటే..?

Kubera OTT : భారీ ధరకు కుబేర డిజిటల్ రైట్స్.. ఏ ఓటీటీలోకి వస్తుందంటే..?

Kubera OTT : తమిళ స్టార్ హీరో ధనుష్, అక్కినేని నాగార్జున కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ చిత్రం కుబేర.. ఈ మూవీ పై మొదటి నుంచి భారీ అంచనాలు క్రియేట్ అవుతున్నాయి.. అందులోను రష్మిక మందన్న నటిస్తున్న సినిమా కావడంతో ఆమె ఫ్యాన్స్ సైతం ఈ మూవీని చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పీ, అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా రూపొందించిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. జూన్ 20 తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది.. అయితే రిలీజ్ టైం దగ్గర పడుతుండడంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో జోరుని పెంచారు మేకర్స్.. ఇక ఈ మూవీ డిజిటల్ రైట్స్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది. ఏ ఓటీటీ సంస్థ ఈ మూవీని కొనుగోలు చేసింది. ఎంత ధరకు సొంతం చేసుకుందో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..


కుబేర ఓటీటీ రైట్స్..

కుబేరా సినిమాలో స్టార్ వాల్యూ, టెక్నికల్ క్రూ వాల్యూ హై రేంజ్‌లో ఉండటం స్పెషల్ ఎట్రాక్షన్. అయితే ఈ సినిమా ఓటీటీ రైట్స్ చేజిక్కించుకొనేందుకు పలు సంస్థలు భారీగా పోటీ పడ్డాయి. ఇద్దరు స్టార్ హీరోలు నటిస్తుండడంతో ఈ సినిమా కోసం మొదటి నుంచి పోటీ ఎక్కువగానే ఉండేది. కానీ చివరకు భారీ ధరకు ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను సుమారుగా 50 కోట్ల రూపాయలు చెల్లించి అమెజాన్ సొంతం చేసుకొన్నదని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అటు ఈ సినిమా శాటిలైట్, థియేట్రికల్ రైట్స్ కోసం కూడా భారీగానే డిమాండ్ ఉంది. ఈ సినిమా హక్కుల కోసం పలువురు డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబ్యూటర్లు ఆసక్తి చూపుతున్నారు. ప్రముఖ ఛానెల్స్ శాటిలైట్ రైట్స్ కోసం పోటీ పడుతున్నాయి. ఈ సినిమా బిజినెస్ వివరాలు త్వరలోనే తెలిసే అవకాశం ఉంది.


Also Read : ‘సింగల్’ ఊచకోత.. అక్కడ మరో రికార్డ్ బ్రేక్..

మూవీ బడ్జెట్ వివరాలు..

తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రూపొందిన ఈ సినిమాను సుమారుగా 120 కోట్ల రూపాయలతో నిర్మించారు అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.. ఈ మూవీ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో రాబోతుంది. తగ్గట్లుగానే కుబేరుడు అంటే సంపద కలిగిన వాడు.. ఇప్పటివరకు రిలీజ్ అయిన పోస్టర్స్ లో ధనుష్ లుక్కు ఆసక్తిని పెంచుతుంది. మొత్తం డబ్బు చుట్టే సినిమా స్టోరీ ఉంటుందని ఇప్పటికే జనాలకు అర్థమయిపోయింది. నాగార్జున ఎలా కనిపిస్తాడు? రష్మిక మందన్న ఎలాంటి పాత్రలో కనిపిస్తుందో? అన్నది ప్రస్తుతం జనాల్లో వినిపిస్తున్న మాట.. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు జిమ్ సరభ్, దలీప్ తాహిల్ నటించారు. ఈ సినిమాకు నికేత్ బొమ్మిరెడ్డి సినిమాటోగ్రఫి, దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు.. మరి ఈ సినిమాతో అయినా నాగార్జున కథలు హిట్టు పడుతుందేమో చూడాలి..

Related News

Big TV kissik talks : స్టేజ్ పై అమ్మాయిలతో పండు అలా.. అడ్డంగా పరువుతీసేసిన వర్ష…

Big TV kissik talks : శేఖర్ మాస్టర్ అలాంటి వాడే.. షాకింగ్ విషయాలను బయట పెట్టిన పండు..!

The Big Folk Night 2025 : జానపదంతో దద్దరిల్లిన ఎల్బీ స్టేడియం.. ఘనంగా బిగ్ టీవీ ఫోక్ నైట్

The Big Folk Night 2025 : ఎల్బీ స్టేడియంలో జానపదాల ఝల్లు.. ‘బిగ్ టీవీ’ ఆధ్వర్యంలో లైవ్ ఫోక్ మ్యూజికల్ నైట్ నేడే!

Social Look: నీటి చినుకుల్లో తడిచి ముద్దయిన దీప్తి.. రాయల్ లుక్‌లో కావ్య.. బికినీలో ప్రగ్యా!

Jr NTR controversy: జూనియర్ ఎన్టీఆర్‌పై టీడీపీ ఎమ్మెల్యే కామెంట్స్.. నారా రోహిత్ స్పందన ఇదే!

Big Stories

×