OTT Movie : థియేటర్లనుంచి, ఓటీటీల వరకు జరిగిన సుదీర్ఘ ప్రయాణంలో, లెక్కలేనన్ని సినిమాలు ప్రజాదరణ పొందాయి. కాసేపు సమయాన్ని సరదాగా గడపడానికి ఓటీటీ వైపు చూస్తున్నారు ప్రేక్షకులు. భాషతో సంబంధం లేకుండా , వీటిని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా ఒక డిఫెరెంట్ కంటెంట్ తో వచ్చింది. కంటి చూపు కోసం ఒక వ్యక్తి అడ్డదారిలో వెళతాడు. ఆ తరువాత స్టోరీ ఆసక్తికరంగా సాగుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
స్టోరీలోకి వెళితే
రవిచంద్రన్ అనే వ్యక్తి క్రెడిట్ కార్డ్ కలెక్షన్ ఏజెంట్ గా ఉద్యోగం చేస్తుంటాడు.ఇతనికి టన్నెల్ విజన్ అనే అరుదైన కంటి వ్యాధి వస్తుంది. దీనివల్ల అతను క్రమంగా చూపుని కోల్పోతుంటాడు. అతని కంటి ఆపరేషన్ కోసం డబ్బు అవసరం అవుతుంది. అయితే అతని ఆర్థిక పరిస్థితి మాత్రం దయనీయంగా ఉంటుంది. ఒక రోజు అతను నివసిస్తున్న ప్రాంతంలో శ్వేత (ఐశ్వర్య రాజేష్) అనే ఒంటరి మహిళ హత్యకు గురవుతుంది. రవి ఈ హత్యను కళ్ళారా చూస్తాడు. హంతకులైన అరుణ్, విజయ్ ప్రకాష్‌లను గుర్తు పెట్టుకుంటాడు. రవి తన ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి, కంటి ఆపరేషన్ కోసం, ఈ హంతకులను బ్లాక్‌మెయిల్ చేయాలని నిర్ణయించుకుంటాడు.
అందులో భాగంగా రవిచంద్రన్ వాళ్ళ నుండి డబ్బు డిమాండ్ చేస్తాడు. అయితే అతని దృష్టి లోపం, హత్య చుట్టూ ఉన్న సంఘటనలు గందరగోళంలో పడతాయి. కేసు విచారణలో అతని కంటి చూపు బాగా మందగిస్తుంది. పోలీసులు ఈ హత్య గురించి విచారణ చేస్తుండగా, రవి బ్లాక్‌మెయిలింగ్ కి పాల్పడినట్లు తెలుస్తుంది. చివరికి రవిచంద్రన్ ఈ కేసుని ఎలా డీల్ చేస్తాడు ? అతనికి కంటి చూపు వస్తుందా ? శ్వేతని హంతకులు ఎందుకు చంపారు ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాను మిస్ కాకుండా చూడండి.
Read Also : ప్రేమ పేరుతో పేద కుటుంబాన్ని నాశనం చేసే అమ్మాయి… కిర్రాక్ ట్విస్టులున్న రివేంజ్ డ్రామా
జియో హాట్ స్టార్ (Jio hotstar) లో
ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ పేరు ‘కుట్రమే తండనై’ (Kuttrame Thandanai). 2016 లో వచ్చిన ఈ మూవీకి M. మణికందన్ దర్శకత్వం వహించారు. S. హరిహర నాగనాథన్, S. ముత్తు, S. కాళీశ్వరన్‌లు డాన్ ప్రొడక్షన్ తో కలిసి నిర్మించారు. ఇందులో విధార్థ్, పూజా దేవరియా, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలు పోషించారు. రెహమాన్, నాజర్, గురు సోమసుందరం, జి. మరిముత్తు, యోగి బాబు అతిథి పాత్రలు పోషించారు. ఈ మూవీకి ఇళయరాజా సంగీతం అందించారు. ఫ్యోడర్ దోస్తోవ్స్కీ రాసిన ‘క్రైమ్ అండ్ పనిష్మెంట్’ నవల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. కంటి చూపు మందగిస్తున్న ఒక యువకుడి చుట్టూ ఈ మూవీ స్టోరీ తిరుగుతుంది. జియో హాట్ స్టార్ (Jio hotstar) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.