OTT Movie : సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలు, ప్రేక్షకులను పిచ్చెక్కించేలా చేస్తాయి. ఈ సినిమా స్టోరీ నడుస్తున్నప్పుడు, నెక్స్ట్ ఏం జరుగుతుందో అని టెన్షన్ పెట్టిస్తూ ఉంటాయి. ఇటువంటి సినిమాలను, ప్రేక్షకులు ఆసక్తికరంగా చూస్తుంటారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో, ఒక జంట సైకోలుగా మారి బీభత్సం సృష్టిస్తుంటారు. వీళ్ళ చేతికి ఒకసారి చిల్లర దొంగలు చిక్కుతారు. ఆ తర్వాత స్టోరీ ఊహించని టర్న్ తీసుకుంటుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది? అనే వివరాల్లోకి వెళితే
స్టోరీలోకి వెళితే
మిక్కీ, జూల్స్ అనే ఇద్దరు దొంగలు, ఒక పెట్రోల్ బంక్ లో దోపిడీ చేసి పారిపోతూ ఉంటారు. వాళ్ళు పారిపోతుండగా కారులో పెట్రోల్ అయిపోవడంతో, ఒక నిర్మానుష్య ప్రాంతంలో ఆగిపోతారు. అయితే అక్కడ కొంచెం దూరంలో ఒక ఇళ్ళు ఉంటుంది. ఈ దొంగలు ఆ ఇంట్లోకి వెళ్ళి చూస్తే ఎవరూ కనిపించరు. అయితే ఆ ఇంటిలో జార్జ్, గ్లోరియా అనే ఒక విచిత్రమైన జంట నివసిస్తుంటారు. మిక్కీ, జూల్స్ ఇంటి బేస్‌మెంట్‌లో ఒక చిన్న పాపను గొలుసులతో బంధించి ఉంచినట్లు తెలుసుకుంటారు. ఈ షాకింగ్ రహస్యం వెలుగులోకి రావడంతో, జార్జ్, గ్లోరియా నిజ స్వరూపం బయటపడుతుంది. వాళ్ళు సాధారణ మనుషులుగా ఉంటూ, చాలా ప్రమాదకరమైన పనులు చేస్తుంటారు. మానసికంగా బాలహీనపడి ఒక సైకోలా వ్యవహరిస్తూ ఉంటారు.
ఇప్పుడు స్టోరీ ఒక గేమ్ లా నడుస్తుంది. ఇందులో దొంగలు, ఇంటి యజమానులు ఒకరినొకరు ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తారు. మిక్కీ, జూల్స్ బంధీగా ఉన్న ఆ పాపను విడిపించి, ప్రాణాలతో బయటపడాలని చూస్తారు. కానీ జార్జ్, గ్లోరియా వీళ్ళ రహస్యాలు బయట పడకుండా, వాళ్ళని అంతం చేయాలని చూస్తారు. చివరికి ఈ సైకో జంట నుంచి దొంగలు తప్పించుకుంటారా ? గోలుసులతో బంధించిన పాప ఎవరు ? ఆ జంట సైకోలుగా ఎందుకు మారారు ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ అమెరికన్ బ్లాక్ కామెడీ హారర్ సినిమాను మిస్ కాకుండా చూడండి.
Read Also : క్షణక్షణానికో ట్విస్ట్, ఊహించని టర్న్స్… ఈ సిరీస్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ లవర్స్ కి విజువల్ ఫీస్ట్
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ అమెరికన్ బ్లాక్ కామెడీ హారర్ సినిమా పేరు ‘విలన్స్’ (Villains). 2019 లో విడుదలైన ఈ సినిమాకు డాన్ బెర్క్, రాబర్ట్ ఓల్సెన్ దర్శకత్వం వహించారు. ఇందులో బిల్ స్కార్స్‌గార్డ్, మైకా మన్రో, బ్లేక్ బామ్‌గార్టనర్, జెఫ్రీ డోనోవన్, కైరా సెడ్జ్‌విక్ ప్రధాన పాత్రల్లో నటించారు. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.