BigTV English
Advertisement

Raja Saab: ఏకంగా అప్పటికి పోస్ట్‌పోన్ అయిన ‘రాజా సాబ్’.. ఫ్యాన్స్‌ను కలవరపెడుతున్న రూమర్స్..

Raja Saab: ఏకంగా అప్పటికి పోస్ట్‌పోన్ అయిన ‘రాజా సాబ్’.. ఫ్యాన్స్‌ను కలవరపెడుతున్న రూమర్స్..

Raja Saab: పాన్ ఇండియా స్టార్‌గా మారిన తర్వాత ప్రభాస్ ఏ సినిమా అయినా కూడా చెప్పిన తేదీకి విడుదల కావడం లేదు. కచ్చితంగా ఒకట్రెండు వాయిదాలు పడిన తర్వాతే ప్రేక్షకుల ముందుకు వస్తోంది. కేవలం ప్రభాస్ అనే కాదు.. ఈరోజుల్లో ప్రతీ హీరో సినిమా ముందు ప్రకటించిన విడుదల తేదీకి కాకుండా వాయిదా పడడం ట్రెండ్ అయిపోయింది. ఇక పాన్ ఇండియా స్టార్ల సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే మేకర్సే స్వయంగా విడుదల తేదీని ప్రకటించినా కూడా దానిపై ఫ్యాన్స్‌లో నమ్మకం ఉండడం లేదు. ప్రస్తుతం ప్రభాస్, మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాజా సాబ్’ విషయంలో కూడా అదే జరుగుతోంది.


అంచనాలు పెరిగాయి

ప్రభాస్ (Prabhas), మారుతీ (Maruthi) కాంబోలో సినిమా అనగానే ముందుగా ప్రేక్షకులంతా ఆశ్చర్యపోయారు. ఇప్పటివరకు మారుతీకి అసలు స్టార్ హీరోను డైరెక్ట్ చేసిన ఎక్స్‌పీరియన్సే లేదు. అలాంటిది పాన్ ఇండియా స్టార్ పాపులారిటీ సంపాదించుకున్న తర్వాత ప్రభాస్.. అసలు మారుతీకి అవకాశం ఎందుకు ఇచ్చాడు అని కొన్నాళ్ల పాటు దీని గురించే మాట్లాడుకున్నారు. కానీ మారుతీ మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్‌ను డిసప్పాయింట్ చేయను అంటూ మాటిచ్చాడు. ఆ తర్వాత ‘రాజా సాబ్’ అంటూ టైటిల్ రివీల్ చేసి అందులో నుండి ప్రభాస్ లుక్‌ను బయటపెట్టాడు. ఆ ఔట్‌పుట్ చూడగానే ఫ్యాన్స్ అంతా మరోసారి షాకయ్యారు. అప్పటినుండి ఈ మూవీ ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఎదురుచూస్తూ ఉన్నారు.


కచ్చితంగా విడుదలవుతుంది

అసలైతే ‘రాజా సాబ్’ సినిమా 2025 సంక్రాంతికే విడుదలను ఖరారు చేసుకుంది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ అంతా సంక్రాంతి పోటీకి సిద్ధం అన్నట్టుగా ఉన్నారు. కానీ సంక్రాంతి పోటీ నుండి ‘రాజా సాబ్’ తప్పుకుందని చివరి నిమిషంలో క్లారిటీ ఇచ్చారు మేకర్స్. దీంతో ఫ్యాన్స్‌కు డిసప్పాయింట్‌మెంట్ తప్పలేదు. సంక్రాంతి నుండి పోస్ట్‌పోన్ అయిన ఈ మూవీ సమ్మర్‌కు విడుదల అవుతుందంటూ అధికారికంగా ఒక పోస్టర్‌తో ప్రకటించారు మేకర్స్. ఆఖరికి అది కూడా అయ్యే ఛాన్స్ లేదని ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ‘రాజా సాబ్’ విడుదల అవుతుందని ప్రకటించిన ఆరోజే మరెన్నో సినిమాలు కూడా విడుదల అవుతున్నాయని అనౌన్స్ చేయడం ఈ మూవీ మరోసారి పోస్ట్‌పోన్ అయ్యిందని ప్రేక్షకులకు క్లారిటీ వచ్చేసింది.

Also Read: ఆ వ్యక్తి అరెస్ట్‌తో మాకు ఎలాంటి సంబంధం లేదు.. క్లారిటీ ఇచ్చిన వైజయంతీ మూవీస్..

మళ్లీ డిసప్పాయింట్‌మెంట్

ఇప్పుడు ‘రాజా సాబ్’ (Raja Saab) ఏకంగా దసరాకు పోస్ట్‌పోన్ అయ్యిందని వార్తలు వినిపిస్తున్నాయి. అంటే ఈ సినిమా కోసం ఫ్యాన్స్ అంతా మరో 6 నెలలు ఆగాల్సిందే. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్తలు చూస్తుంటే ఫ్యాన్స్‌లో మళ్లీ డిసప్పాయింట్‌మెంట్ మొదలయ్యింది. ఇప్పటికే న్యూ ఇయర్‌కు ‘రాజా సాబ్’కు సంబంధించిన టీజర్ వస్తుందని ఆశపడ్డారు ఫ్యాన్స్. కానీ అలా జరగలేదు. ఇప్పుడు విడుదల కూడా మరోసారి వాయిదా పడుతుందని రూమర్స్ వినిపిస్తుండడంతో మాకు ఇది అలవాటే అన్నట్టుగా నిరాశ వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. మొత్తానికి ‘రాజా సాబ్’ రిలీజ్ డేట్‌పై మేకర్సే ఒక క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×