Netflix – Ram Charan : మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) వారసుడిగా టాలీవుడ్లోకి అడుగు పెట్టి, నేడు పాన్ ఇండియా స్టార్ గా ప్రపంచ వ్యాప్తంగా తనకంటూ ఓ ప్రత్యేకమైన పేరు, కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న హీరో రామ్ చరణ్. తాజాగా ఈ పాన్ ఇండియా హీరో డాక్యుమెంటరీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. గత కొంతకాలంగా ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ రామ్ చరణ్ డాక్యుమెంటరీ పనుల్లో తల మునకలై ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాదు మెగా అభిమానుల కోసం ఆ డాక్యుమెంటరీలో కొన్ని ఎక్స్క్లూజివ్ సీన్స్ కూడా యాడ్ చేయబోతున్నట్టు సమాచారం. ఇంతకీ ఆ ఎక్స్ క్లూజివ్ సీన్స్ ఏంటి? రామ్ చరణ్ డాక్యుమెంటరీ పనులు ఎక్కడ దాకా వచ్చాయి? అనే వివరాల్లోకి వెళితే…
గత కొన్ని నెలలుగా అదే పనిలో…
దిగ్గజ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ (Netflix) ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ డాక్యుమెంటరీ బాధ్యతలను భుజానికి ఎత్తుకుంది. ఈ ఓటీటీ మెగా డాక్యుమెంటరీకి సంబంధించిన పనులుపై సిన్సియర్ గా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. గత ఆరు నెలల నుంచి ఇదే పనిలో సదరు ఓటీటీ సంస్థ బిజీ బిజీగా గడిపేస్తోంది. అయితే ఈ డాక్యుమెంటరీ గతంలో రాజమౌళి (SS Rajamouli)పై తెరకెక్కిన డాక్యుమెంటరీ మాదిరిగానే ఉండబోతుందని తెలుస్తోంది. అంతేకాదు ఈ డాక్యుమెంటరీకి సంబంధించి నెట్ ఫ్లిక్స్ ఇప్పటికే కొంతవరకు ఎక్స్ క్లూజివ్ కంటెంట్ ని షూట్ చేసింది.
రామ్ చరణ్ హీరోగా నటించిన ‘గేమ్ చేంజర్’ మూవీ రిలీజ్ సందర్భంగా, చాలా మంది మెగా అభిమానులు చెర్రీని కలవడానికి ఆయన ఇంటి వద్దకు వెళ్ళిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఆ ఫుటేజ్ ని ఇప్పుడు డాక్యుమెంటరీలో కూడా వాడబోతున్నట్టు సమాచారం. ఇక ఈ విషయం తెలుసుకున్న మెగా అభిమానులు ఎప్పుడెప్పుడు ఆ డాక్యుమెంటరీ రిలీజ్ అవుతుందా? దీనికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్స్ ఎప్పుడెప్పుడు బయటకు వస్తాయా ? అని ఇప్పటి నుంచే ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మరోవైపు నెట్ ఫ్లిక్స్ మాత్రం సైలెంట్ గా శరవేగంగా షూటింగ్ కానిచ్చేస్తోంది.
Read Also : పెళ్లికాకుండా ప్రెగ్నెంట్ అయ్యే అమ్మాయిలు… మైండ్ బ్లాక్ అయ్యే సైకలాజికల్ థ్రిల్లర్
రాజమౌళి సీన్ రిపీట్ కాకుండా ఉంటే చాలు…
గతంలో రాజమౌళిపై రూపొందిన డాక్యుమెంటరీపై ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా హీరోల వాయిస్ ఓవర్ పై అసంతృప్తి వ్యక్తం అయింది. ‘ఆర్ఆర్ఆర్ : బిహైండ్ అండ్ బియాండ్’ డాక్యుమెంటరీ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. ఈ నేపథ్యంలోనే రాంచరణ్ డాక్యుమెంటరీ విషయంలో రాజమౌళి సీన్ రిపీట్ కాకుండా ఉంటే బాగుండునని కోరుకుంటున్నారు మెగా అభిమానులు. అంటే డబ్బింగ్ విషయంలో నెట్ ఫ్లిక్స్ జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని అంటున్నారు. కాగా రామ్ చరణ్ ప్రస్తుతం ‘పెద్ది’ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు.