BigTV English
Advertisement

Lavanya – Raj Tarun: రాజ్ తరుణ్ తల్లిదండ్రులను ఇంట్లో నుండి గెంటేసిన లావణ్య.. ఎవరు చెప్పేది నిజం.?

Lavanya – Raj Tarun: రాజ్ తరుణ్ తల్లిదండ్రులను ఇంట్లో నుండి గెంటేసిన లావణ్య.. ఎవరు చెప్పేది నిజం.?

Lavanya – Raj Tarun: సినీ సెలబ్రిటీల ప్రొఫెషనల్ లైఫ్ కంటే వారి పర్సనల్ లైఫ్ గురించే ప్రేక్షకులు ఎక్కువగా డిస్కషన్ చేస్తుంటారు. కొన్నిరోజులుగా టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ పర్సనల్ లైఫ్ కూడా ఇలా చర్చల్లోనే ఉంది. లావణ్య అనే అమ్మాయి తనను రాజ్ తరుణ్ ప్రేమించి మోసం చేశాడు అని బయటికి వచ్చి చెప్పినప్పటి నుండి ఈ వివాదం ఎన్నో మలుపులు తిరిగింది. తాజాగా రాజ్ తరుణ్ తనకు ఇల్లు రాసిచ్చాడంటూ తన ఇంటికి వెళ్లి ఏకంగా హీరో తల్లిదండ్రులైన బసవరాజు, రాజ్యలక్ష్మిని ఇంట్లో నుండి గెంటేసింది. ఆపై మీడియాతో కూడా ఈ విషయంపై మాట్లాడింది.


ఇంటి కోసమే ఇదంతా

కోకాపేటలో రాజ్ తరుణ్‌ (Raj Tarun)కు ఉన్న ఇల్లు తన పేరు మీద ఉందని, అందుకే తన తల్లిదండ్రులను బయటికి గెంటేసిందని లావణ్య (Lavanya)పై ఆరోపణలు రావడంతో తను మీడియాతో మాట్లాడడానికి సిద్ధమయ్యింది. అసలైతే రాజ్ తరుణ్ తల్లిదండ్రులను తను గెంటేయలేదని, తను ఇంట్లో ఉండగానే 15 మంది దుండగులు తనపై దాడి చేసి ఇంట్లో నుండి బయటికి లాగారని చెప్పుకొచ్చింది. తన తల్లిదండ్రులు మాత్రమే ఇంటికి రాలేదని, వారితో పాటు 15 మందిని తీసుకొచ్చారని తెలిపింది. అంతే కాకుండా కోకాపేటలో ఉన్న ఇల్లును వారిద్దరూ కలిసే కొన్నామని, ఇద్దరి పేరుపై ఆ ఇల్లు ఉందని చెప్పింది. కానీ ప్రస్తుతం ఆ ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్స్ మాత్రం తన దగ్గర లేవంది లావణ్య.

జుట్టు పట్టుకొని లాక్కెళ్లారు

‘‘15 సంవత్సరాలుగా నేను ఇక్కడే ఉన్నాను. ఈరోజు రాజ్ తరుణ్ తల్లిదండ్రులు ఇద్దరు మాత్రమే రాలేదు. 15 మంది మనుషులను తీసుకొచ్చారు. అందులో 8 మంది ఆడవాళ్లు ఉన్నారు. వాళ్లు నాపై అటాక్ చేశారు. పైనుండి మెయిన్ గేట్ వరకు జుట్టు పట్టుకొని లాక్కెళ్లారు. అప్పుడే పోలీసులు వచ్చి అదంతా చూశారు. ఎదురింటి సీసీటీవీలో కూడా ఇదంతా రికార్డ్ అయ్యింది. నన్ను ఇంట్లో నుండి పంపించాలి అన్నది వాళ్ల ప్లాన్. రాజ్ తరుణ్‌పై కేసు పెట్టినప్పుడు అంకుల్, ఆంటీ దగ్గరకు వెళ్తే చంపడానికి వచ్చానని అన్నారు. ఇప్పుడు నాపై చేసిన దాడిని ఏమంటారు? రాజ్ తరుణ్ పనిచేసుకోవాలి, అంతా బాగుండాలనే మీడియా వేదికగా నేను సారీ చెప్పాను’’ అంటూ చెప్పుకొచ్చింది లావణ్య.

Also Read: మలయాళ నటికి చేదు అనుభవం.. డ్రగ్స్ మత్తులో నటి ప్రైవేట్ పార్ట్‌పై చెయ్యి వేసిన స్టార్ హీరో

కోర్టు మెట్లెక్కిస్తాను

‘‘కాళ్లు పట్టుకొని కూడా రాజ్ తరుణ్‌కు సారీ చెప్తాను అన్నాను. అలా ఏమైనా కాంప్రమైజ్ కోసం మాట్లాడి ఉండొచ్చు కదా.. దాడి ఏంటి? హీరో అయితే ఏం చేసినా నడుస్తుందా? 16 ఏళ్లు సహజీవనం, 2014లో పెళ్లి చేసుకోవడం.. అదంతా నిజమే. కోటిన్నర పెట్టి కొన్న ఇల్లు.. రూ.12 కోట్లు అయ్యిందనే కారణంతో ఇలా చేస్తున్నారు. ఈ ఇంటి డాక్యుమెంట్స్ వేరేవాళ్ల దగ్గర పెట్టి లోన్ తీసుకున్నాం. నా 11 ఏళ్ల జీవితం రాజ్ తరుణ్ నాకు తిరిగిచ్చేస్తే నేను కేసు వెనక్కి తీసుకుంటాను. ఇలా చేస్తే మాత్రం నేను కచ్చితంగా తనను కోర్టు మెట్లెక్కిస్తాను. నాపై దాడి చేసిన అందరి ఫోన్స్‌లో ఇది రికార్డ్ అయ్యింది. అది దయజేసి అందరూ చూసి నాకు న్యాయం చేయాలి’’ అని కోరింది లావణ్య.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×