Trivikram Movie : త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) – అల్లు అర్జున్ (Allu Arjun) కాంబినేషన్లో త్వరలోనే ఓ బడా ప్రాజెక్టు పట్టాలెక్కబోతున్న సంగతి తెలిసిందే. అయితే అల్లు అర్జున్ – త్రివిక్రమ్ తో కంటే ముందు అట్లీ మూవీకి కమిట్ అయ్యారు. కానీ మరోవైపు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఖాళీగా ఉన్నారు. మరి ఈ గ్యాప్ ను గురూజీ ఎలా ఉపయోగించుకుంటారు? అంతలోపు సినిమా చేస్తే ఏ హీరోతో చేస్తారు? అనే విషయంపై ప్రస్తుతం జోరుగా చర్చ నడుస్తోంది. అయితే నిన్న మొన్నటిదాకా త్రివిక్రమ్ – వెంకటేష్ (Venkatesh) కాంబినేషన్లో ఓ సినిమా రాబోతుందని ప్రచారం జరిగింది. కానీ తాజా సమాచారం ప్రకారం అవన్నీ గాసిప్స్ అని, త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ పరభాష నటుడితో సినిమాకు ప్లాన్ చేస్తున్నాడని అంటున్నారు. మరి ఆ హీరో ఎవరు? అనే వివరాల్లోకి వెళితే…
తమిళ మోస్ట్ వాంటెడ్ హీరోతో…
ఇటీవల కాలంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించబోయే హీరో ఇతనే అంటూ పలువురు స్టార్స్ పేర్లు తెరపైకి వచ్చాయి. అందులో ముందుగా రామ్ పోతినేని పేరు వినిపించింది. ఆ తర్వాత కాదు కాదు వెంకటేష్ తో త్రివిక్రమ్ ఓ సినిమాను పట్టాలెక్కించబోతున్నారు అని జోరుగా ప్రచారం జరిగింది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో ఫుల్ జోష్ లో ఉన్న వెంకటేష్ తో మరో అదిరిపోయే ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను త్రివిక్రమ్ ప్లాన్ చేశారని అన్నారు.
గతంలో మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రచయితగా వర్క్ చేసిన వెంకటేష్ సినిమాలు ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. కానీ త్రివిక్రమ్ డైరెక్టర్ గా టర్న్ అయ్యాక ఆయనతో ఒక్క సినిమా కూడా చేయలేదు. మధ్యలో ఒక ప్రాజెక్టును అనౌన్స్ చేసినప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు. ‘జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురంలో వంటి హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న త్రివిక్రమ్ – బన్నీ కాంబో మరో బిగ్ ప్రాజెక్ట్ కు సిద్ధమవుతున్నారు. ఇక ఈ గ్యాప్ లో వెంకటేష్ తో త్రివిక్రమ్ సినిమా చేయబోతున్నాడు అన్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని సమాచారం. ఆయన తమిళ హీరో శివ కార్తికేయన్ (Sivakarthikeyan) తో ఓ సినిమాకు ప్లాన్ చేస్తున్నారు అనేది కొత్త టాక్.
వెంకీ మామను పక్కన పెట్టడానికి కారణం ఇదేనా?
అల్లు అర్జున్ సినిమాతో త్రివిక్రమ్ పాన్ ఇండియా డైరెక్టర్ గా టర్న్ అవ్వబోతున్నారు. అయితే అంతలోపే ట్రెండింగ్ లో ఉన్న మరో మోస్ట్ వాంటెడ్ స్టార్ తో సినిమా చేసి పాన్ ఇండియా రేసులోకి అడుగు పెట్టాలని, దాంతో బన్నీ సినిమాపై అంచనాలు పెంచాలని త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నారనేది తాజాగా జరుగుతున్న ప్రచారం. అందుకే తెలుగుతో పాటు తమిళంలో కూడా మంచి పాపులారిటీ ఉన్న హీరోతో సినిమా చేస్తే ప్లస్ అవుతుందని త్రివిక్రమ్ భావిస్తున్నారు అంటూ టాక్ నడుస్తోంది. అయితే ఈ కాంబోలో అయినా సినిమా ఉంటుందా ? లేదంటే ఒట్టి రూమర్సేనా? అంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే.