SSMB 29 Leak Video: దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి (SS.Rajamouli) దర్శకత్వంలో టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు (Maheshbabu) హీరోగా.. గ్లోబల్ ఐకాన్ స్టార్ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) లీడ్ రోల్ పోషిస్తూ తెరకెక్కుతున్న చిత్రం ఎస్ ఎస్ ఎం బి 29(SSMB 29). భారీ అంచనాల మధ్య దాదాపు రూ. 1,000 కోట్ల బడ్జెట్తో కే.ఎల్.నారాయణ(K.L.Narayana) దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ మళయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ఈ సినిమాలో విలన్ పాత్ర పోషిస్తున్నట్లు ఇటీవల వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. అంతే కాదు ఇదే విషయంపై తన సోషల్ మీడియా ఖాతా ద్వారా నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా హింట్ ఇచ్చారు.
వృధా అవుతున్న రాజమౌళి కష్టం.. ఇకనైనా జాగ్రత్త పడతారా..
‘ఆర్ఆర్ఆర్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత రాబోతున్న చిత్రం.. పైగా మహేష్, రాజమౌళి కాంబోలో రాబోతున్న మొదటి సినిమా కూడా ఇదే కావడంతో అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇటీవలే హైదరాబాదులో ఇండోర్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు ఒడిశాలో భాగంగా అవుట్డోర్ షూటింగు జరుపుకుంటోంది. చాలా పగడ్బందీగా ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఎక్కడా కూడా ఏ చిన్న విషయం కూడా సినిమా నుండి బయటకు పొక్కకుండా చిత్ర బృందం చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. పైగా రాజమౌళి, మహేష్ బాబు తో పాటు సినిమా కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్కరి ఫోన్లను సినిమా సెట్లోకి తీసుకురాకుండా కండిషన్లు పెట్టిన విషయం తెలిసిందే. ఇలా ఇంత పగడ్బందీగా సినిమా తెరకెక్కిస్తున్నప్పటికీ కూడా తాజాగా ఈ సినిమా షూటింగ్ కి సంబంధించిన ఒక వీడియో ఆన్లైన్లో లీక్ అవ్వడంతో చిత్ర బృందంతో పాటు అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ALSO READ:Vishwambhara: ‘విశ్వంభర ‘ రిలీజ్ డేట్ లాక్.. ఎప్పుడంటే..?
మహేష్ బాబు లుక్ వీడియో లీక్..
ఇక ఆ వీడియోలో ఏముంది.. అనే విషయానికి వస్తే, మహేష్ బాబు నడుచుకుంటూ వచ్చి వీల్ చైర్ లో ఉన్న అతడి ముందు మోకాలి పై పడ్డ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపోతే ఈ వీడియో లీక్ అవ్వడంపై రాజమౌళి సీరియస్ అయినట్లు సమాచారం. ఇప్పటికే సినిమా నుండి ఎటువంటి లీకులు నటులు బయట పెట్టవద్దని అగ్రిమెంట్ తీసుకున్న రాజమౌళి.. ఇప్పుడు ఇలా అగ్రిమెంట్ మాట తప్పి లీక్ చేయడంపై ఫుల్ ఫైర్ అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇది ఎవరు లీక్ చేశారు అనే విషయం మాత్రం బయటకు రాలేదు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. ఇక భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా నుంచి లీకైన ఈ వీడియో ఇప్పుడు సినిమాపై మరింత ఎక్స్పెక్టేషన్స్ పెంచేసిందని చెప్పవచ్చు. మరి ఇంత పగడ్బందీగా భారీ బడ్జెట్ తో ఊహించని రీతిలో రాజమౌళి ఈ సినిమా కోసం పనిచేస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి. ఇకపోతే ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సినిమా రాబోతున్నట్లు రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ (Vijayendra Prasad) వెల్లడించిన విషయం తెలిసిందే.