Indian Railways: రైల్వే క్రాసింగ్ దగ్గర వెయిట్ చేయాలంటనే చాలా మందికి ఇష్టం ఉండదు. ప్రమాదం అని తెలిసినా చాలా మంది గేటు కింది నుంచి వంగి వెళ్తుంటారు. అలా వెళ్తూ రైలు ఢీకొని పలువురు చనిపోయిన ఘటనలను కూడా చూశాం. అయినప్పటికీ, చాలా మంది ఇప్పటికీ రైల్వే గేటు పడ్డా ఆగకుండా అలాగే వెళ్తుంటారు. తాజాగా ఓ వ్యక్తి రైలు గేటు పడినా ఆగకుండా, ఏకంగా తన బైకును భుజానికి ఎత్తుకుని వెళ్లడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
ఢిల్లీలో బైక్ ను భుజానికి ఎత్తుకుని వెళ్లిన వ్యక్తి
ఢిల్లీలోని ఓ రైల్వే క్రాసింగ్ దగ్గర ఆసక్తికర ఘటన జరిగింది. రైలు వస్తుండటంతో ముందు జాగ్రత్తగా గేట్ మ్యాన్ గేటును క్లోజ్ చేశారు. అయితే, ఓ వ్యక్తికి ముఖ్యమైన పని ఉందో? లేదంటే అక్కడ వెయిట్ చేయడం ఇష్టం లేదో? తెలియదు గానీ, వెంటనే అక్కడి నుంచి వెళ్లాలి అనుకున్నాడు. రైలు వెళ్లేంత వరకు వేచి ఉండలేకపోయాడు. వెంటనే, తన బైక్ ను భుజానికి ఎత్తుకున్నాడు. గేటు పక్క నుంచి నడుచుకుంటూ క్రాసింగ్ దాటాడు. ఆ వ్యక్తి బైకును మోసుకుంటూ వెళ్లడాన్ని చూసి అక్కడే ఉన్న వాహనదారులు షాక్ అయ్యారు. మరికొంత మంది అతడిని ఏకంగా బైక్ ఎత్తిన బాహుబలి అంటూ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ అభినవ బాహుబలి వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే, ఈ ఘటన ఢిల్లీలో ఏ రైల్వే క్రాసింగ్ దగ్గర జరిగింది అనే కచ్చితమైన వివరాలు తెలియలేదు.
రైల్వే క్రాసింగ్‌ను దాటేందుకు.. బైకర్ ఏం చేశాడో చూడండి!
న్యూఢిల్లీ: రైల్వే క్రాసింగ్ వద్ద వేచి ఉండటాన్ని ఒక బైకర్ సహించలేకపోయాడు. ఏకంగా బైక్‌ను భుజంపైకి ఎత్తుకున్నాడు. రైలు గేటు పక్క నుంచి వెళ్లి పట్టాలు దాటాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. pic.twitter.com/ry9sny3qPB
— Swathi Reddy (@Swathireddytdp) March 9, 2025
Read Also: రన్నింగ్ ట్రైన్ లో నుంచి కింద పడబోయిన మహిళ.. కాపాడిన రైల్వే పోలీస్!
అంత బరువు ఎలా మోశావ్ భయ్యా!
నిజానికి బైక్ బరువు సుమారు 150 నుంచి 200 కిలోల బరువు ఉంటుంది. ఒక్కోసారి బైక్ ను ఆపినప్పుడు కొంత మంది రెండు కాళ్లు కింద పెట్టినా బ్యాలెన్స్ చేయలేరు. ఏటో ఓ వైపు ఒరిగినట్లు అవుతుంది. అలాంటి అమాంతం బైకును భుజానికి ఎత్తుకోవడం అంటే ఆశామాషీ వ్యవహారం కాదు. అందుకే జనాలు ఈ వీడియోను చూసి ఆశ్చర్యపోతున్నారు. మరికొంత మంది నెటిజన్లు మాత్రం ఈ ఘటనను చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు. సదరు వ్యక్తి ప్రాణాలతో చెలగాటం ఆడాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైల్వే నిబంధనలు పాటించని సదరు వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రైల్వే క్రాసింగ్స్ దగ్గర ఇప్పటికే ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని.. ఇలాంటి వ్యక్తులను చూసి మరికొంత మంది అలాగే వెళ్లి చనిపోయే అవకాశం ఉంటుందని ఫైర్ అవుతున్నారు. ఈ ఘటనతోనైనా రైల్వే అధికారులు కఠినంగా వ్యవహరించాలని కోరుతున్నారు. రైల్వే గేట్ల దగ్గగ ఉండే సిబ్బంది కూడా గేట్ వేసిన తర్వాత ఎవరినీ వెళ్లకుండా చూడాలని కోరుతున్నారు.
Read Also: గుట్కా ఉమ్ములతో ఎర్రబడ్డ ఈ రైల్వే స్టేషన్ ఎక్కడ ఉందో చెప్పుకోండి.. బీహార్ కాదు!