MAD 2: యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ఘనవిజయం సాధించడంతో “MAD” సినిమా సీక్వెల్ “MAD 2” పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫస్ట్ పార్ట్ యూత్ ని విశేషంగా ఆకట్టుకోవడంతో, సీక్వెల్ కోసం సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా, ఈ సినిమా రన్ టైమ్ ఫిక్స్ అయ్యింది. చిత్రబృందం అధికారికంగా ప్రకటించిన సమాచారం ప్రకారం, “MAD 2” రన్ టైమ్ 2 గంటల 7 నిమిషాలుగా ఫిక్స్ అయింది.
ఈ వ్యవధి కామెడీ, ఎమోషన్, డ్రామా, ఫుల్-ఆన్ ఎంటర్‌టైన్‌మెంట్ అందించేందుకు పర్ఫెక్ట్ గా సరిపోతుంది. ఎక్కువ లాగ్ లేకుండా షార్ట్ అండ్ క్రిస్ప్ గా, టైట్ స్క్రీన్ ప్లేతో అప్పుడే అయిపోయిందా అనే ఫీలింగ్ తీసుకోని రావడానికి ఈ రన్ టైమ్ కరెక్ట్ గా ఉంటుంది. కథ లేకుండా సీన్ తర్వాత సీన్ నవ్వుకోవడమే కాబట్టి ఇదేంటి కథ లేదు అనుకునే లోపు సినిమా అయిపోతుంది. పైగా మొదటి భాగం చూసిన ప్రేక్షకులు ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఉన్నారో బాగా అర్థం చేసుకుని ఈ సినిమాను మరింత ఎంగేజింగ్ గా తీర్చిదిద్దామని దర్శకుడు కళ్యాణ్ శంకర్ ఇప్పటికే తెలిపాడు కాబట్టి మ్యాడ్ కుర్రాళ్ల నుంచి ఈసారి కూడా హిట్ ఎక్స్పెక్ట్ చేయ్యోచు.
“MAD” సినిమా కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో స్నేహం, కామెడీ, మజా మిక్స్ చేసి రూపొందించబడిన హిట్ మూవీ. 2023లో విడుదలైన ఈ సినిమా, చిన్న సినిమాగా వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. ఫన్ మూమెంట్స్, కామెడీ టైమింగ్, మ్యూజిక్, డైలాగ్స్ అన్నీ కలిసి సినిమాను పెద్ద విజయంగా మలిచాయి. యూత్‌కు కనెక్ట్ అయ్యే క్యారెక్టర్లు, ఫ్రెండ్షిప్, కామెడీ సీన్స్ అన్నీ సినిమాను హిట్ చేయించాయి.
ఈ సినిమాలో రామ్ నితిన్, నార్నే నితిన్, సంగీత్ శోభన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
ముందు భాగాన్ని తెరకెక్కించిన కళ్యాణ్ శంకర్ ఈసారి కూడా సాలిడ్ హిట్ కోడతామనే కాన్ఫిడెన్స్ తో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో చెప్పేసాడు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్స్‌కు ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా, యువత ఈ సినిమాపై బాగా ఆసక్తి కనబరుస్తున్నారు. కామెడీ, కాలేజ్ బ్యాక్‌డ్రాప్, మ్యూజిక్, ఫ్రెండ్‌షిప్ అనే ప్రధాన అంశాలతో “MAD 2” మరోసారి ప్రేక్షకులను థియేటర్లలో నవ్వులతో ఉర్రూతలూగించనుంది. ఇదే ట్రెండ్ కొనసాగిస్తూ “MAD 2” కూడా సూపర్ హిట్ కొడుతుందా? అన్నది తెలియాలంటే సినిమా విడుదలయ్యే వరకూ అంటే మార్చ్ 28 వరకూ వేచి చూడాలి.