Mad Square: యూత్ టార్గెట్‌గా కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌లపై వచ్చిన “మ్యాడ్” (Mad) సినిమా గతంలో బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రాల్లో నార్నే నితిన్(Narne Nithin), సంగీత్ శోభన్ (Sangeeth Shobhan), రామ్ నితిన్ (Ram Nithin) ప్రధాన పాత్రలు పోషించారు. 2023లో వచ్చిన ఈ సినిమా.. ఒక ఇంజనీరింగ్ కాలేజీలో చేరిన ముగ్గురు స్నేహితుల మధ్య చాలా ఫన్ రైడ్‌గా కొనసాగింది. కాలేజీ లైఫ్, సీనియర్స్‌తో గొడవలు, లవ్ స్టోరీస్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ నిలిచింది. 8 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా, దాదాపు 26 కోట్లు వసూలు చేసింది. ఇక యూత్‌లో మంచి ఆదరణ పొందడంతో ఈ సినిమాకు సీక్వెల్‌గా మ్యాడ్ స్క్వేర్ తెరకెక్కించారు. మార్చి 28న ఈ సినిమా థియేటర్లోకి రాగా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా సక్సెస్ మీట్‌లో నిర్మాత నాగవంశీ (Nagavamsi) ఊహించని కలెక్షన్స్ వస్తాయని చెప్పుకొచ్చారు. అందుకు తగ్గట్టే.. ట్రేడ్ వర్గాల అంచనాలున్నాయి.
ఊహించని ఫిగర్లు వస్తాయ్.. నాగవంశీ
“మ్యాడ్” వంటి విజయం తర్వాత, వచ్చిన “మ్యాడ్ స్క్వేర్”పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రమోషన్స్ కూడా భారీగానే చేశారు. ముఖ్యంగా నాగవంశీ ఈ సినిమా మరో జాతిరత్నాలు అవుతుందని.. లాజిక్స్‌ను పక్కకు పెట్టి చూడాలని ముందు నుంచి చెబుతు వచ్చారు. అందుకు తగ్గట్టే.. ఈ సినిమా ఉందనే టాక్ వచ్చింది. దాదాపు రూ. 21 కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్ జరిగిన ఈ సినిమాకు ఫస్ట్ భారీ కలెక్షన్స్ సొంతం చేసుకునేలా ఉంది. ఈ సినిమా సక్సెస్ మీట్‌లో నాగవంశీ మాట్లాడుతూ.. ఫస్ట్ డే అదిరిపోయే కలెక్షన్స్ వస్తాయని అన్నారు. ఊహించని ఫిగర్లు వస్తాయి అని అన్నారు. రెండో రోజు వసూళ్లు కాస్త తగ్గిన.. సండే మాత్రం ఎవ్వరు ఊహించని ఫిగర్స్ వస్తాయని చెప్పుకొచ్చాడు. మొదటి రెండు రోజుల కంటే మూడో రోజు కలెక్షన్స్ ఎక్కువగా ఉంటాయని అన్నారు. అలాగే.. ఈ సినిమా నాన్‌స్టాప్ ఎంటర్టైన్ చేస్తుందని.. సీట్లలో ఆడియెన్స్‌ను కూర్చోకుండా చేస్తుందని.. సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్పుకొచ్చారు. సినిమా చూసిన వారంతా మ్యాడ్ క్యూబ్ రెడీ చేసుకోమని చెబుతున్నారని చెప్పారు.
ఫస్ట్ డే ప్రిడిక్షన్
ఇక మ్యాడ్ స్క్వేర్ సినిమాకు సాలిడ్ బుకింగ్స్ కనిపిస్తున్నాయి. బుకింగ్స్‌తోనే ఈ సినిమాకు ఐదారు కోట్లు కలెక్షన్స్ వచ్చినట్టుగా ట్రేడ్ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. మొత్తంగా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా పది పదిహేను కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసేలా ఉందని అంటున్నారు. చిన్న సినిమాగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ లాభాలను తెచ్చిపెట్టేలా ఉంది. ఇక “మ్యాడ్” సినిమా కాలేజీ జీవితంపై దృష్టి పెట్టగా, “మ్యాడ్ స్క్వేర్” కాలేజీ తర్వాత జీవితంలోని సరదా సంఘటనలపై ఆధారపడింది.మూడేళ్ల తర్వాత లడ్డు పెళ్లిలో కలిసిన ముగ్గురు స్నేహితులు.. ఆ పెళ్లి క్యాన్సిల్ కావడంతో అతన్ని గోవాకు తీసుకెళ్లడం, అక్కడ జరిగే గందరగోళ సంఘటనలు కథను నడిపిస్తాయి. మరి మ్యాడ్ స్క్వేర్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.