Sankranthiki Vasthunam : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ హీరోలలో విక్టరీ వెంకటేష్ ఒకరు. వెంకటేష్కి ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా వెంకటేష్ సినిమాలు ఉంటే ఫ్యామిలీ ఆడియన్స్ పడి చస్తారు అని చెప్పొచ్చు. అలాంటిది సంక్రాంతికి వెంకటేష్ నటించిన సినిమా రిలీజ్ అవుతుంది అని అంటే అంచనాలు కూడా మామూలుగా ఉండవు. ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ పండగ థియేటర్స్ లోనే మొదలవుద్ది. సంక్రాంతి సీజన్ లో రిలీజ్ అయిన వెంకటేష్ సినిమాలు ఎన్నో బ్లాక్బస్టర్ హిట్స్ అయ్యాయి. ఇప్పుడు అదే సీజన్ ని దృష్టిలో పెట్టుకొని సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్ తో సంక్రాంతికి వస్తున్నాడు విక్టరీ వెంకటేష్. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ నటిస్తున్న సినిమా సంక్రాంతి వస్తున్నాం. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పైన దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. జనవరి 14న ఈ సినిమా రిలీజ్ కానుంది.
ఈ సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి. మొదటి ఈ సినిమా నుంచి గోదారి గట్టుపైన రామచిలకవే అనే ఒక పాటను రిలీజ్ చేశారు. దాదాపు 16 ఏళ్ల తర్వాత టాప్ మ్యూజిక్ డైరెక్టర్ రమణ గోగుల ఈ పాటను ఆలపించారు. రమణ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అప్పట్లో పవన్ కళ్యాణ్ సినిమాకి సంబంధించిన ఆల్బమ్స్ అన్ని కూడా రమణ గోగుల కంపోజ్ చేసేవాళ్ళు. ఆ పాటలు కూడా అదే స్థాయిలో హిట్ అయ్యాయి. ఇప్పుడు విన్నా కూడా ఆ పాటలన్నీ ఒక మంచి ఫీల్ ని క్రియేట్ చేస్తాయి. రమణ గోగుల పాడిన పాట దాదాపు 50 మిలియన్స్ పైగా వ్యూస్ సాధించింది. అలానే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన సెకండ్ సింగిల్ కూడా మంచి రెస్పాన్స్ సాధించింది. తాజాగా ఈ సినిమా నుంచి 3వ సింగిల్ ను రిలీజ్ చేయడానికి సిద్ధమైంది చిత్ర యూనిట్. అయితే ఈ పాటకి సంబంధించిన అనౌన్స్మెంట్ వీడియోని చాలా ఫన్నీగా చేశారు.
Also Read: Sankranthiki Vasthunnam: రమణ గోగుల రీ ఎంట్రీ బ్లాక్ బస్టర్
మూడవ పాటను ఎవరితో పాడించాలి అని ఆలోచనలో ఉన్న అనిల్ రావిపూడి ను వెంకటేష్ నేను పాడుతాను అనే రిక్వెస్ట్ చేయడం. చివరికి వెంకటేష్ టార్చర్ తట్టుకోలేక మ్యూజిక్ డైరెక్టర్ కి ఫోన్ చేసి వెంకటేష్ తో పాడిన చేయమని చెప్పడం వంటి కాన్సెప్ట్ తో ఈ ప్రోమోను ఫన్నీగా డిజైన్ చేశారు. ఇప్పుడు వెంకటేష్ పాడిన ప్రోమో సాంగ్ విడుదలైంది. ఈ ప్రోమో సాంగ్లో వెంకీ మామ ఎనర్జీ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. యాటిట్యూడ్ పొంగల్ బ్లాక్ బస్టర్ పొంగల్ అనే వర్డ్స్ తో వెంకీ మామ కంప్లీట్ ఎనర్జీ ను ఈ పాటకు పెట్టారు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనికి సంబంధించిన పూర్తి సాంగ్ డిసెంబర్ 30న విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది చిత్ర యూనిట్.
SPEAKERS ready chesukondi amma 🔊🔥🥁#BlockbusterPongal Song Promo out now❤️🔥
— https://t.co/8lIM6cqbcg #SankranthikiVasthunam 3rd single out on December 30th 💥
Music by #BheemsCeciroleo
Lyrics by Saraswathi Puthra @ramjowrites
Vocals by Victory @Venkymama, Bheems,… pic.twitter.com/VGcYWktntM— Sri Venkateswara Creations (@SVC_official) December 28, 2024