Mahavatar Narsimha: హోంబాలే ఫిల్మ్స్.. ఒకప్పుడు ఈ బ్యానర్ గురించి ఎవరికి తెలిసింది లేదు. ఎప్పుడైతే కెజిఎఫ్ సినిమా రిలీజ్ అయ్యిందో.. ఓవర్ నైట్ లో టాప్ ప్రొడక్షన్ హౌస్ లిస్ట్ లోకి చేరిపోయింది. కెజిఎఫ్ తరువాత కెజిఎఫ్ 2, కాంతార, సలార్ లాంటి సినిమాలతో మరింత గుర్తింపు తెచ్చుకుంది.
ఇక ఈ సినిమాలు మాత్రమే కాదు.. తమ బ్యానర్ నుంచి వచ్చే ప్రతి సినిమా ప్రేక్షకులను మెప్పించేలానే ఉంటుందని హోంబాలే ఫిల్మ్స్ అధినేత విజయ్ కిరంగదూర్ మొదట్లోనే చెప్పుకొచ్చాడు. ఇక ఇప్పుడు దానికి తగ్గట్టుగానే నిలబడినట్లు.. ఈ బ్యానర్ నుంచి రిలీజ్ కానున్న సినిమాలే చెప్తున్నాయి. ప్రస్తుతం ఈ బ్యానర్ లిస్ట్ లో స్టార్ హీరోల సినిమాలు మాత్రమే ఉన్నాయి.
Maharaja: చైనాలో రిలీజ్ కానున్న మహారాజా..
సలార్ 2, కాంతార 1.. ఇవి కాకుండా ప్రభాస్ తో రెండు సినిమాలు ఉన్నాయి. అఖిల్ అక్కినేని సినిమా కూడా ఈ బ్యానర్ లో ఉందని టాక్. ఇక ఇవి మాత్రమే కాకుండా తాజాగా మరో సినిమాను హోంబాలే ఫిల్మ్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ మధ్య దేవుడితో ముడిపడి ఉన్న సినిమాలు బాగా హిట్ అవుతున్న విషయం తెల్సిందే. ఇప్పటికే హోంబాలే ఫిల్మ్స్ లో కాంతార.. అలా వచ్చిందే.
ఇప్పుడు మేకర్స్.. మహావతార్ సిరీస్ ను మొదలుపెట్టినట్లు ప్రకటించారు. అందులో మొదటి భాగంగా మహావతార్ నరసింహా అనే సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుపుతూ పోస్టర్ ను రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన మిగతా విషయాలేమి ప్రకటించలేదు. నరసింహా అవతారం పోస్టర్ చాలా అద్భుతంగా డిజైన్ చేశారు.
Matka Movie Collections : కోట్లు ఎక్స్‌పెక్ట్ చేశారు… కానీ లక్షల్లోనే ఆగిపోయింది..
విశ్వాసం సవాలుగా ఉన్నప్పుడు అతను కనిపిస్తాడు అని రాసుకొచ్చారు. పోస్టర్ తోనే ఒక్కసారిగా హైప్ క్రియేట్ చేశారు. ఇక ఈ పోస్టర్ ను చూసిన ఫ్యాన్స్.. నరసింహా స్వామి అవతారంలో ప్రభాస్ ఉంటే.. ఉంటుందిరా చారి.. పూనకాలే అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
ఇంకొంతమంది ఎలాగూ హోంబాలే ఫిల్మ్స్ లో ప్రభాస్ రెండు సినిమాలు ఒప్పుకున్నాడు కాబట్టి.. అందులో ఒకటి ఈ సినిమాను ఓకే చేయించండి అని కోరుతున్నారు. మరి నరసింహా అవతారంలో ఎవరు కనిపిస్తారో తెలియాలంటే ఇంకొన్నీ రోజులు ఎదురుచుడాల్సిందే.