Mahesh Babu: హీరోలు, హీరోయిన్లపై అభిమానంతో ఒక్కొక్కసారి ఫ్యాన్స్ చేసే పనులు చాలా వింతగా ఉంటాయి. మామూలుగా మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ కొట్టుకుంటూ ఉంటారు ఫ్యాన్స్. ఇదంతా కామన్‌గా జరిగేదే. కానీ కొన్నిసార్లు వారి పిచ్చి పరాకాష్టకు చేరుతుంది. అభిమానులు అంటే ఇలా ఉంటారా, ఇలా చేస్తేనే హీరోలపై అభిమానం చూపించినట్టా అని అనుమానం కలిగేలా చేస్తుంది. తాజాగా ఒక మహేశ్ బాబు చేసిన పని అలాగే ఉంది. అది చూసిన వారంతా షాక్ అవ్వక తప్పడం లేదు. ఏకంగా పెళ్లి కార్డుపైనే మహేశ్ బాబు ఫోటో పెట్టి ఊరంతా పంచడం మొదలుపెట్టాడు ఒక అభిమాని.
డిఫరెంట్‌గా పెళ్లి కార్డు
మామూలుగా పెళ్లి కార్డు అనేది అందరికీ ప్రత్యేకంగా గుర్తుండిపోతుంది. అలాంటి పెళ్లి కార్డ్‌పై దేవుళ్ల ఫోటోలతో పాటు ఏకంగా మహేశ్ బాబు ఫోటో కూడా ప్రింట్ చేయించాడు ఓ అభిమాని. వినడానికే వింతగా ఉంది కదా.. అలాంటిది ఆ పెళ్లి కార్డ్ అందుకున్న వారికి ఇంకెంత ఆశ్చర్యం కలిగిందో మరి.. ఇలాంటి ఒక డిఫరెంట్ పెళ్లి కార్డును డిజైన్ చేయించడంతో పాటు దానిని తానే స్వయంగా సోషల్ మీడియాలో కూడా షేర్ చేశాడు మహేశ్ బాబు డై హార్డ్ ఫ్యాన్. దీంతో ఒక్కసారిగా మహేశ్ ఫ్యాన్స్ అంతా ఈ పెళ్లి కార్డును వైరల్ చేస్తున్నారు. తమ అభిమానం ఈ రేంజ్‌లో ఉంటుందని గర్వంగా చెప్పుకుంటున్నారు. కానీ నెటిజన్లు మాత్రం దీనిని పిచ్చి పరాకాష్టకు చేరుకోవడం లాగా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
యాక్టివ్ ఫ్యాన్
కర్నూలు జిల్లాకు చెందిన సాయి చరణ్ అనే వ్యక్తి మహేశ్ బాబు (Mahesh Babu)కు వీరాభిమాని. మహేశ్ బాబు ఫ్యాన్ క్లబ్‌లో యాక్టివ్ మెంబర్. ఆ స్టార్ హీరో ఏ పనిచేసినా, తన సినిమా విడుదలయినా, ఆఫ్ స్క్రీన్ ఎక్కడైనా కనిపించినా కచ్చితంగా దానిని తన సోషల్ మీడియాలో షేర్ చేయడం చరణ్‌కు అలవాటు. అందుకే మరోసారి మహేశ్‌పై తన అభిమానాన్ని చూపించడం కోసం ఏకంగా తన పెళ్లి కార్డుపైనే ఈ స్టార్ హీరో ఫోటో ప్రింట్ చేయించాడు చరణ్. దేవుళ్ల ఫోటోలతో పాటు మహేశ్ బాబు ఫోటోను కూడా పెళ్లి కార్డుపై చూసిన నెటిజన్లు తెగ ఆశ్చర్యపోతున్నారు. అభిమానం ఉంటే ఇలా చూపించాల్సిన అవసరం లేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: వాట్సాప్ గ్రూప్‌లో రామ్ చరణ్, బన్నీ, రానా.. కానీ, ఇప్పుడు అది ఎందుకు పనికి రాదు
మంచితనానికి ఫిదా
ఆన్ స్క్రీన్ మాత్రమే కాదు.. ఆఫ్ స్క్రీన్ కూడా మహేశ్ బాబు మంచితనానికి చాలామంది అభిమానులు ఉన్నారు. స్క్రీన్‌పై మంచి పాత్రలతో, గుర్తుండిపోయే సినిమాలతో అలరిస్తూ ఉండే మహేశ్ బాబు.. ఆఫ్ స్క్రీన్ చారిటీ కార్యక్రమాల్లో ఎక్కువగా యాక్టివ్‌గా ఉంటాడు. అందుకే ఆయన చేసే మంచి పనులు చూసి చాలామంది ఆయనకు అభిమానులుగా మారారు. అంతే కాకుండా తన ఫ్యాన్స్ సైతం తనలాగే కష్టాల్లో ఉన్నవారికి తమ వంతు సాయం చేయాలని చూస్తుంటారు. ఎక్కువగా ఇతర హీరోల ఫ్యాన్స్‌తో వార్స్ జరగకుండా ఎప్పటికప్పుడు తన అభిమానులను కంట్రోల్‌లో ఉంచే హీరోల్లో మహేశ్ బాబు ఒకడు.
My wedding card 😍 @urstrulyMahesh jai babu 💥#SSMB #DHFM #SSMB29 pic.twitter.com/eujUSdhGrf
— Charan MB (@charanchax1) April 24, 2025