Mahesh Babu: అభిమానం చూపించడంలో తెలుగు ప్రేక్షకుల తరువాతే ఎవరైనా సరే. ఇది ఎవరు మార్చలేరు. ఒక సినిమాను పండగలా సెలబ్రేట్ చేసే సంప్రదాయం కేవలం తెలుగులో మాత్రమే ఉంటుంది. ఆ సినిమా మన భాష, పరభాష అనేది చూడని ప్రేక్షకులు ఎవరైనా ఉన్నారు అంటే అది తెలుగువారే. ఇక ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే .. నేడు రిలీజ్ అయిన సినిమాలు మూడు మంచి పాజిటివ్ టాక్ ను తెచ్చుకున్నాయి.
అల్లరి సినిమాతో తనకంటూ ఒక కామెడీ హీరోగా పేరుతెచ్చుకున్న నరేష్.. తన ఫంథా మార్చి సీరియస్ రోల్స్ చేసుకుంటూ వస్తున్నాడు. అందులో భాగంగానే బచ్చలమల్లి అనే సినిమాతో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
Pawan Kalyan: హీరోల మోజులో పడకండి… ఫ్యాన్స్‌కు మరోసారి క్లాస్ పీకిన పవన్
ఇక దీంతో పాటు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి, కమెడియన్ సూరి నటించిన చిత్రం విడుదల 2. స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా పార్ట్ 1 తెలుగులో కూడా భారీ విజయాన్ని అందుకుంది. ఈరోజు పార్ట్ 2 రిలీజ్ అయ్యి అది కూడా మంచి పాజిటివ్ టాక్ తో ముందుకెళ్తుంది. కొద్దిగా స్లోగా ఉన్నా కూడా కథ పరంగా ప్రేక్షకులను అలరిస్తుందని చెప్పుకొస్తున్నారు.
ఇక ఈ రెండు సినిమాలతో పాటు ఇంకో హాలీవుడ్ సినిమా రిలీజ్ అయ్యింది. అదే ముఫాసా. హాలీవుడ్ నిర్మాణ సంస్థ డిస్నీ నుంచి యానిమేషన్ వస్తుంది అంటే అందరిలో ఒక ఉత్కంఠ మొదలవుతుంది. దానికి కారణం.. ఈ సినిమాలకు స్టార్ హీరోస్ డబ్బింగ్ చెప్పడం. ఇప్పటివరకు ఎంతోమంది స్టార్ హీరోలు డిస్నీ సినిమాలకు వాయిస్ ను అందించారు. 2019 లో ది లయన్ కింగ్ అనే సినిమా రిలీజ్ అయ్యింది. సింబా పాత్రకు న్యాచురల్ స్టార్ నాని వాయిస్ ను అందించాడు. ఇక ఇప్పుడు ఆ సినిమాకు ఫ్రీక్వెల్ గా ది లయన్ కింగ్ ముఫాసా వచ్చింది.
Allu Arjun: బన్నీకి మరో షాక్.. ఢిల్లీలో కేసు నమోదు
ఇందులో ముఫాసా పాత్రకు సూపర్ స్టార్ మహేష్ బాబు గాత్రం అందించాడు. అసలు ఇలాంటి ఒక పాత్రకు మహేష్ వాయిస్ ఇస్తున్నాడు అని తెలిసినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా.. ? అని ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురుచూసారు. ఎట్టకేలకు ఆ క్షణం రానే వచ్చింది. ఇక మహేష్ వాయిస్ కు కూడా ఫ్యాన్స్ రచ్చ చేశారు. థియేటర్ లో మహేష్ వాయిస్ వినిపించిన ప్రతిసారి పేపర్లు చల్లుతూ పండగ చేశారు.
ఇప్పుడప్పుడే మహేష్ సినిమా రాదు కాబట్టి ఆయన ప్రజెన్స్ ఎక్కడ కనిపించినా .. చివరికి వాయిస్ వినిపించినా కూడా ఫ్యాన్స్ ఇదుగో ఇలా పండగ చేస్తున్నారు. ఇక ముఫాసా పాత్రకు మహేష్ వాయిస్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది. ఆయన మాటలోనే వెటకారం, ఎమోషన్.. ఫ్యాన్స్ స్క్రీన్ మీద మహేష్ ఫేస్ నే చూస్తున్నట్లు కనిపించారు. మొదటి షో నుంచి ఈ సినిమా పాజిటివ్ టాక్ ను అందుకొని భారీ విజయం దిశగా పయనిస్తుంది. మరి మహేష్ వలన ఈ చిత్రం ఎలాంటి కలక్షన్స్ రాబట్టిందో తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.