BigTV English

U19 Women’s Asia Cup: ఫైనల్‌కు చేరిన టీమిండియా

U19 Women’s Asia Cup: ఫైనల్‌కు చేరిన టీమిండియా

U19 Women’s Asia Cup: ఆసియా కప్ అండర్ – 19 మహిళల టోర్నీలో భారత మహిళల జట్టు అదరగొడుతుంది. వరుస విజయాలతో దూసుకెళ్తూ ఫైనల్స్ కి చేరుకుంది. శుక్రవారం ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన సూపర్ 4 చివరి మ్యాచ్ లో భారత జట్టు నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కౌలాలంపూర్ వేదికగా జరుగుతున్న ఈ {U19 Women’s Asia Cup} టోర్నీలో శుక్రవారం భారత్ – శ్రీలంక మధ్య బేయ్ మాస్ క్రికెట్ ఓవాల్ మైదానంలో ఇరుజట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన భారత జట్టు మొదట బౌలింగ్ ఎంచుకుంది.


Also Read: Mohammed Rizwan Haris Rauf: SRH ప్లేయర్ ను కెలికిన పాక్ క్రికెటర్లు.. మ్యాచ్ మధ్యలో గొడవ

దీంతో బ్యాటింగ్ కి దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 98 పరుగులు మాత్రమే చేసింది. శ్రీలంక బ్యాటర్లు మనుడి నానాయక్కర (33), సుముడు నిసంసాల (21) కేవలం ఇద్దరూ ప్లేయర్స్ మాత్రమే రెండంకేల స్కోర్ చేశారు. {U19 Women’s Asia Cup} ఇక సజనా 9, రష్మిక 8, హీరుని హన్సిక 2, దహమి 5, లిమాన్స 1, సింగిల్ డిజిట్ లకే పెవిలియన్ చేరారు. లంక బ్యాటర్లకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఆయుషి శుక్ల కేవలం పది పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టింది.


ఇక పరునిక 2, షబ్నం షకీల్, ద్రితి కేసరి చేరో వికెట్ దక్కించుకున్నారు. శ్రీలంక నిర్దేశించిన 99 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు కేవలం 14.5 ఓవర్లలోనే చేదించింది. ఆరంభంలో భారత జట్టు కాస్త తడబడినా గొంగడి త్రిష, కమలిని రాణించడంతో {U19 Women’s Asia Cup} భారత విజయం తద్యమైంది. త్రిష (32), కమలిని (28), మిథిలా (17*), భవిక (7*) పరుగులతో భారత జట్టును విజయతీరాలకు చేర్చారు. ఈశ్వరి డకౌట్ కాగా.. చాల్కే నాలుగు పరుగులతో విఫలమైంది.

Also Read: Imran Khan – Jasprit Bumrah: బుమ్రా బౌలింగ్‌ లో ఇప్పటి వరకు..ఏ ప్లేయర్‌ కూడా సిక్సు కొట్టలేదు ?

ఈ మ్యాచ్ లో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆయుష్ కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది. లంక బౌలర్లలో మనంసింఘీ 3, శశిని 2 వికెట్లు తీశారు. ఈ మ్యాచ్ {U19 Women’s Asia Cup} లో విజయం సాధించడంతో ఆసియా కప్ టోర్నీలో భారత్ ఫైనల్ కీ చేరుకుంది. ఈ మ్యాచ్ లో గెలుపొందడంతో భారత జట్టు మూడు విజయాలు, ఒక డ్రా తో సూపర్ 4 పాయింట్స్ టేబుల్ లో అగ్రస్థానంలో నిలిచింది. 3 విజయాలు ఒక ఓటమితో 2 స్థానంలో నిలిచిన బంగ్లాదేశ్ తో.. భారత్ ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. ఆదివారం రోజు కౌలాలంపూర్ వేదికగా ఈ ఫైనల్ మ్యాచ్ జరగబోతోంది.

 

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×