Maheshbabu:సూపర్ స్టార్ మహేష్ బాబు – నమ్రత(Mahesh Babu-Namrata) లవ్ స్టోరీ ఎన్నిసార్లు విన్నా కూడా మళ్లీమళ్లీ వినాలనిపిస్తుంది. ఎందుకంటే వీరి లవ్ స్టోరీకి ఉన్న ప్రాముఖ్యత అలాంటిది. అయితే తాజాగా వీరిద్దరూ పెళ్ళి చేసుకొని 20 సంవత్సరాలు అయింది. 2005 ఫిబ్రవరి 10న పెళ్లి బంధంతో ఒక్కటైన నమ్రత – మహేష్ బాబులు ఈ ఏడాది ఫిబ్రవరితో 20 ఏళ్లు సక్సెస్ఫుల్ గా తమ బంధాన్ని కంటిన్యూ చేస్తున్నారు.అలా పెళ్ళై 20 సంవత్సరాలైనా కూడా వీరి మధ్య ఇప్పటికీ ఎలాంటి గొడవలు లేకుండా ఎంతో అన్యోన్యంగా తమ సంసారాన్ని సాగిస్తున్నారు. అయితే అలాంటి మహేష్ బాబు నమ్రత(Mahesh Babu- Namrata)లకు సంబంధించిన క్యూట్ లవ్ స్టోరీ వెనుక ఉన్న అసలు విషయాన్ని ఇప్పుడు చదివి తెలుసుకుందాం.
మొదటి చూపులోనే ప్రేమలో పడ్డ నమ్రత – మహేష్..
ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ నమ్రత, టాలీవుడ్ హ్యాండ్సమ్ మహేష్ బాబు ఇద్దరూ తొలిసారి కలుసుకుంది వంశీ మూవీ(Vamshi Movie) షూటింగ్ సెట్లో.. ఇక పూజ కార్యక్రమాల రోజే మహేష్ బాబు, నమ్రత ఒకరిని ఒకరు చూసుకున్నారట. అలా తొలిచూపులోనే వీరి మధ్య ఒక రకమైన అట్రాక్షన్ కలిగింది. కానీ అది కేవలం టీనేజ్ లో కలిగే అట్రాక్షన్ అని సైలెంట్ అయిపోయారట. ఆ తర్వాత షూటింగ్లో భాగంగా విదేశాలకు వెళ్లిన సమయంలో ఇద్దరి మధ్య మరింత బాండింగ్ ఏర్పడి, ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంత సాన్నిహిత్యంతో మెదిలారట. షూటింగ్ సెట్లో వీరిద్దరి మధ్య ఉన్న క్లోజ్ నెస్ చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకున్న సమయంలో ఇద్దరు తమలో ఉన్న ప్రేమ విషయాన్ని బయట పెట్టుకున్నారు.అలా ఒకరికి ఒకరు ప్రపోజ్ చేసుకుని పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. కానీ పెళ్లికి ఒక చిక్కొచ్చి పడింది.
నమ్రతతో పెళ్లి.. ఒప్పుకోరని భయపడ్డ మహేష్..
అదేంటంటే.. మహేష్ బాబు కంటే నమ్రత వయసులో దాదాపు 4 ఏళ్ళు పెద్ద. తనకంటే వయసులో 4 ఏళ్ళు పెద్దదైన నమ్రతను పెళ్లి చేసుకోవడానికి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరని మహేష్ లో ఒక భయం మొదలైంది. ఇక ఈ విషయాన్ని తన సోదరికి చెప్పడంతో ఎలాగైనా నాన్నని కన్విన్స్ చేసి నీ పెళ్లి చేస్తానని మంజుల మాటిచ్చిందట. కానీ కృష్ణ మాత్రం నమ్రతని పెళ్లి చేసుకోవడానికి అస్సలు ఒప్పుకోలేదు. కానీ ఆ తర్వాత మహేష్ బాబు – నమ్రతల లవ్ స్టోరీకి కృష్ణ (Krishna) తలొగ్గక తప్పలేదు.అలా మహేష్ బాబు సోదరి మంజుల(Manjula ) మహేష్ బాబు – నమ్రతల ప్రేమ గురించి కృష్ణకు చెప్పి చివరికి తండ్రిని.. తమ్ముడు పెళ్లికి ఒప్పించింది. అలా వీరి పెళ్లి ముంబైలో 2005 ఫిబ్రవరి 10న చాలా సింపుల్ గా జరిగింది. వీరి పెళ్లికి కేవలం మహేష్ బాబు, నమ్రతల కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. అయితే అంత పెద్ద హీరో వారసులు ఎందుకు ఇంత సింపుల్గా పెళ్లి చేసుకున్నారని మహేష్ బాబు పెళ్లి గురించి చాలామంది పలు రకాలుగా మాట్లాడుకున్నారు కూడా. పెళ్లికి ఇంట్లో ఒప్పుకోరని మహేష్ బాబు చాలా భయపడ్డారట కానీ ఎట్టకేలకు వివాహం జరిగింది.
నమ్రత వల్లే మహేష్ సక్సెస్ రెట్టింపు..
కట్ చేస్తే.. ఇక పెళ్లికి ముందే నమ్రత (Namrata) మహేష్ పెట్టిన కండిషన్స్ కి ఓకే చెప్పింది.అలా పెళ్లయ్యాక సినిమాల్లో నటించకూడదని చెప్పడంతో సినిమాలకు దూరమై అప్పటినుండి ఇప్పటివరకు మహేష్ బాబు(Mahesh Babu)కి అండదండగా ఉంటుంది. అంతేకాదు మహేష్ బాబుకు సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా ఆమె దగ్గరుండి చూసుకుంటుంది ఆయన ధరించే దుస్తులను మొదలుకొని ఆయన చేసే బిజినెస్ లు, చేసే సినిమాలు అన్నీ కూడా నమ్రత హ్యాండ్ ఓవర్ లోనే ఉంటాయని సమాచారం . దీన్ని బట్టి చూస్తే భర్తకు నమ్రత ఏ రేంజ్ లో సహాయం చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఏదేమైనా నమ్రతాతో పెళ్లికి నాడు భయపడ్డా నేడు సక్సెస్ఫుల్గా పేరు సొంతం చేసుకున్నారంటే దానికి కారణం నమ్రత అంటూ మహేష్ అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు.. ఇకపోతే ఇక ఈ క్యూట్ కపుల్ కి ఇద్దరు పిల్లలు వున్న విషయం తెలిసిందే.