BigTV English

Mahesh Babu: రాజమౌళిని ఫాలో అవ్వడం మొదలుపెట్టిన మహేశ్.. బాబుకు ఇక తప్పదేమో.!

Mahesh Babu: రాజమౌళిని ఫాలో అవ్వడం మొదలుపెట్టిన మహేశ్.. బాబుకు ఇక తప్పదేమో.!

Mahesh Babu: పాన్ ఇండియా దర్శకులు అంటే ఒక సినిమాను తెరకెక్కించడానికి కనీసం రెండు లేదా మూడు సంవత్సరాలు టైమ్ తీసుకుంటారు. అయినా కూడా వారికి ఆ రేంజ్‌లో డిమాండ్ ఉంటుంది కాబట్టి ఆ సినిమాల కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తారు. అలా పేరు సాధించుకున్న పాన్ ఇండియా డైరెక్టర్లలో రాజమౌళి ఒకరు. అందుకే ఈ డైరెక్టర్ ఒక సినిమాను తెరకెక్కించడానికి ఎన్నేళ్లు సమయం తీసుకున్నా కూడా ప్రేక్షకులు వెయిట్ చేస్తూనే ఉంటారు. ప్రేక్షకులు మాత్రమే కాదు.. ఈ డైరెక్టర్‌తో మూవీ చేయాలనుకున్నా హీరోలు కూడా రెండు, మూళ్ల వరకు బుక్ అవ్వక తప్పదు. అలా ఇప్పుడు మహేశ్ బాబు.. రాజమౌళి జైలులో బుక్ అయిపోయాడు.


సోషల్ మీడియాలో అలా

రాజమౌళి, మహేశ్ బాబు కాంబినేషన్‌లో ‘ఎస్ఎస్ఎమ్‌బీ 29’ వర్కింగ్ టైటిల్‌తో మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. గత ఒకటిన్నర సంవత్సరం నుండి ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతూనే ఉన్నాయి. అలా తాజాగా ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభమయ్యింది. రెగ్యులర్ షూటింగ్ మొదలవుతున్న విషయాన్ని రాజమౌళి.. చాలా క్రియేటివ్‌గా వీడియో విడుదల చేస్తూ ప్రకటించారు. మహేశ్ బాబు పాస్‌పోర్ట్‌ను తీసుకొని తనను జైలులో వేస్తున్నట్టుగా చూపించాడు జక్కన్న. దీంతో రాజమౌళిని బ్లైండ్‌గా ఫాలో అవ్వడం తప్పా మహేశ్‌కు వేరే దారి లేదని అర్థమవుతోంది. అందుకే సోషల్ మీడియాలో కూడా అదే పనిచేస్తున్నాడు మహేశ్.


మహేశ్ లేడు

తాజాగా రాజమౌళిని తన ట్విటర్‌లో ఫాలో అవ్వడం మొదలుపెట్టాడు మహేశ్ బాబు. ప్రస్తుతం వీరిద్దరి మూవీ షూటింగ్ ఎంతవరకు వచ్చింది అనే విషయాన్ని అస్సలు బయటికి రానివ్వడం లేదు. షూటింగ్‌కు సంబంధించిన దాదాపు ప్రతీ విషయాన్ని చాలా సీక్రెట్‌గా మెయింటేయిన్ చేస్తున్నారు. మహేశ్ బాబు, రాజమౌళి (Rajamouli) మూవీకి పూజా కార్యక్రమం జరిగిందని, ఈ మూవీలో హీరోయిన్‌గా నటిస్తున్న ప్రియాంక చోప్రా ఒకసారి హైదరాబాద్‌కు వచ్చి అందరినీ కలిసిందని తప్పా ఇప్పటివరకు ఇంకా ఎలాంటి అప్డేట్ బయటికి రాలేదు. కానీ తాజాగా దుబాయ్‌లో జరిగిన ఒక ఈవెంట్‌లో మహేశ్ బాబు పాల్గొనకపోవడం చూస్తుంటే షూటింగ్ జరుగుతుందనే అనుకుంటున్నారు ఫ్యాన్స్.

Also Read: ఎవరు బెస్ట్ యాక్ట్రెస్.? సోషల్ మీడియాలో కొత్త చర్చ..

ఫన్నీ మీమ్స్

మామూలుగా తను లేకుండా తన ఫ్యామిలీనీ ఏ ఈవెంట్‌కు పంపించడు మహేశ్ బాబు (Mahesh Babu). ఫ్యామిలీ అంతా కలిసే వెకేషన్స్‌కు, ఇతర దేశాల్లో జరిగే ఈవెంట్స్‌కు వెళ్తుంటారు. అలాంటిది తాజాగా మహేశ్ బాబు భార్య నమ్రత ఒకరే ఒక ఈవెంట్‌లో కనిపించింది. దీంతో రాజమౌళి జైలులో మహేశ్ బాబు ఇరుక్కుపోయాడంటూ ఈ విషయంపై ఫన్నీ మీమ్స్, రీల్స్ అన్నీ వచ్చేస్తున్నాయి. మహేశ్ బాబు స్వేచ్ఛగా తరచుగా హాలీడేస్‌కు వెళ్లేవాడని, కానీ ఎస్ఎస్ఎమ్‌బీ 29తో బిజీ అయిపోవడం వల్ల దాదాపు రెండేళ్ల వరకు ఎక్కడికి వెళ్లే పరిస్థితి లేదని తెలుస్తోంది. ఇక ఇండస్ట్రీలో వినిపిస్తున్న కథనాల ప్రకారం ఈ మూవీ 2027 విడుదల కానుందని తెలుస్తోంది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×