CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయల్దేరారు. రేపు ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న పనులకు పూర్తిగా సహకరించాలని ప్రధానికి విజ్ఞప్తి చేయనున్నారు. రెండో విడత మెట్రో రైళ్లు, రీజినల్ రింగ్ రోడ్డు, బీసీ రిజర్వేషన్ అంశాలపై చర్చించబోతున్నారు.
ALSO READ: UPSC Recruitment: గోల్డెన్ ఛాన్స్.. యూపీఎస్సీలో 752 ఉన్నత ఉద్యోగాలు.. అవకాశం మళ్లీ రాదు భయ్యా..
తొమ్మిదో షెడ్యూల్ లో ఉన్న 42 శాతం బీసీ రిజర్వేషన్లపై రాష్ర్టంలో అమలు అయ్యే విధంగా సహకరించాలని, హైదరాబాద్ లో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేయాలని ప్రధాని మోదీని కోరనున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి ప్రాజెక్టులపై కూడా సీఎం రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. బీసీ లకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంపై శాసనసభలో చట్టం చేయాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది.
ALSO READ: SA vs Aus: భారీ వర్షం.. ఆస్ట్రేలియా వర్సెస్ దక్షిణాఫ్రికా మ్యాచ్ రద్దు..టీమిండియాకు పెను ప్రమాదం !!
అసెంబ్లీలో బీసీల రిజర్వేషన్లపై చట్టం చేసి కేంద్రం ఆమోదించేలా ఒత్తిడి తీసుకురావాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. అయితే అసెంబ్లీలో చట్టం చేయడానికి ముందే సీఎం ఈ అంశాన్ని ప్రధానమంత్రి మోదీకి వివరించాలనే ఆలోచనలో ఉన్నారు. దీనికి సంబంధించిన అంశాన్నే రేపు జరగబోయే భేటీలో సీఎం రేవంత్ రెడ్డి, ప్రధాని మోదీకి వివరించనున్నారు. శాసనసభలో బీసీ రిజర్వేషన్లపై చట్టం చేసి పంపిస్తామని, బీసీ రిజర్వేషన్ల అమలుకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని ప్రధానిని సీఎం కోరనున్నారు. రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో పెట్టి ఈ రిజర్వేషన్లను అమలు చేయాలని ప్రధానిని అభ్యర్థించనున్నారు.
ALSO READ: SBI Recruitment: శుభవార్త.. SBIలో 1194 ఉద్యోగాలు.. ఈ అర్హతలు ఉంటే చాలు..!
ఢిల్లీ పర్యటనలో రేపు ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కూడా సీఎం కలవనున్నట్టు తెలుస్తోంది. అలాగే కాంగ్రెస్ అగ్రనేతలను కూడా సీఎం కలిసే ఛాన్స్ ఉంది. కాంగ్రెస్ హైకమాండ్ తో మంత్రివర్గ విస్తరణ, రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి చర్చించనున్నట్లు తెలుస్తోంది.