Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు(Maheshbabu) ఒక్క అమ్మాయిలకు మాత్రమే కాదు హీరోయిన్ లకి కూడా ఫేవరెట్ హీరో అని చెప్పవచ్చు. తన అందం, అభినయంతో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న మహేష్ బాబు నటించిన చిత్రాలలో యువరాజు (Yuvaraju)కూడా ఒకటి. ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి, అందరి హృదయాలు దోచుకుంది శ్రీదివ్య (Sri Divya). ప్రస్తుతం ఈమె ఇప్పుడు ఎలా ఉందో తెలిస్తే మాత్రం నిజంగా ఆశ్చర్యపోకమానదు తమిళ్ సినీ ఇండస్ట్రీలో భారీ పాపులారిటీ అందుకున్న హీరోయిన్గా పేరు కూడా సొంతం చేసుకుంది.
Malaika Arora: మరో కొత్త బాయ్ ఫ్రెండ్ తో మలైకా రొమాన్స్.. అసలు కథేంటి.?
అన్నయ్యా అంటూ మహేష్ బాబు చుట్టూ తిరిగిన స్టార్ హీరోయిన్..
ఇటీవల కోలీవుడ్ లో జరిగిన ఒక అవార్డ్స్ ఈవెంట్ లో పాల్గొన్న శ్రీదివ్య.. మహేష్ బాబు తనను చిన్నప్పుడు ఎత్తుకున్న ఫోటోని డిస్ప్లే చేయించి మరీ అక్కడ తానే అని.. యువరాజు సినిమా షూటింగ్ సెట్లో ఉన్నప్పుడు చాక్లెట్ల కోసం మహేష్ బాబు వెంట అన్నయ్య అన్నయ్య అంటూ తిరిగేదాన్ని అంటూ చెప్పుకొచ్చింది శ్రీ దివ్య. సాధారణంగా మహేష్ బాబును అన్నయ్య అని పిలవడానికి ఏ ఒక్కరు కూడా ఇష్టపడరు. అయితే తెలియని వయసులో తాను అన్నయ్య అని పిలిచానని చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇక ప్రస్తుతం శ్రీ దివ్య చేసిన ఈ కామెంట్ లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
శ్రీ దివ్య కెరియర్..
ఇక ఈమె కెరియర్ విషయానికి వస్తే.. బాలనటిగా కెరియర్ ఆరంభించి తెలుగు, తమిళ సినిమాలలో నటించి భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. 2006లో వచ్చిన ‘భారతి’ అనే తెలుగు సినిమాలో నటించిన ఈమె ..అందులో ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్ గా నంది అవార్డు అందుకుంది. 1993 ఏప్రిల్ ఒకటిన హైదరాబాదులో జన్మించింది. ఈమె అక్క శ్రీ రమ్య. తెలుగు, తమిళ్ సినిమాలలో కూడా నటించింది. ఇకపోతే మూడేళ్ల వయసు నుంచే సినిమాలలో నటించడం మొదలుపెట్టింది. మొదట్లో తెలుగు టీవీ సీరియల్స్ లో నటించిన ఈమె.. అలా శ్రావణ మేఘాలు , తూర్పు వెళ్ళే రైలు సీరియల్స్ లో నటించింది. ఆ తరువాత హనుమాన్ జంక్షన్, యువరాజు, వీడే లాంటి చిత్రాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసింది. ఆ తర్వాత హీరోయిన్గా 2010లో రవిబాబు దర్శకత్వంలో వచ్చిన ‘మనసారా’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. తర్వాత 2012లో మారుతి దర్శకత్వంలో వచ్చిన బస్ స్టాప్ సినిమాలో నటించిన ఈమె అది విజయం సాధించడంతో ‘మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు’ సినిమాలో కూడా నటించింది.. ఇక అంతే కాదు ‘కేరింత’ సినిమాలో కూడా నటించిన ఈమె.. ఎక్కువగా తమిళ్, మలయాళం చిత్రాలలో నటిస్తూ అలరించింది. గత ఏడాది కూడా ఒక తమిళ చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇకపోతే బాలనటిగా ఇప్పుడు హీరోయిన్ గా కూడా నటిస్తూ భారీ క్రేజ్ అందుకుంది. ఇక ప్రస్తుతం నాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తూ నేటి తరానికి కూడా తాను ఎవరితో నటించాను అనే విషయాన్ని కూడా తెలియజేస్తోంది ఈ ముద్దుగుమ్మ.