Train Ticket Booking Rules 2024: భారతీయ రైల్వే సంస్థ ప్రయాణీకులకు మెరుగైన రైల్వే ప్రయాణ అనుభవాన్ని అందించేందుకు ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నది. అందులో భాగంగానే గతంలో 120 రోజులు ఉన్న అడ్వాన్స్ డ్ టికెట్ బుకింగ్ వ్యవధిని 60 రోజులకు తగ్గించింది. నిజమైన ప్రయాణీకులకు టికెట్లు లభించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిబంధన అమల్లోకి వచ్చిన తర్వాత రైల్వే టికెట్లు త్వరగా అయిపోతున్నాయి. భారీగా వెయిటింగ్ లిస్టు పెరుగుతోంది. ఇంతకీ ఎందుకు ఇలా జరుగుతుంది? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
టికెట్లు త్వరగా ఎందుకు అయిపోతున్నాయి?
ఇండియన్ రైల్వే ముందస్తు రిజర్వేషన్ వ్యవధిని 60 రోజులకు తగ్గించింది. ప్రయాణీకులకు మెరుగైన సౌకర్యాన్ని అందించడం, వెయిటింగ్ లిస్ట్ సమస్యను తగ్గించడం కోసం ఈ నిర్ణయం తీసుకుంది. అయినప్పటికీ వెయిటింగ్ లిస్టు పెద్దదిగానే కనిపిస్తోంది. పండుగ సీజన్ లో టికెట్లు త్వరగా బుక్ అవుతున్నాయి. ప్రయాణీకుల సంఖ్య పెరగడంతో సీట్ల లభ్యత తగ్గుతుంది. సీట్ల సంఖ్య పరిమితంగా ఉండి, రద్దీ పెరగడంతో సీట్లు త్వరగా నిండిపోతున్నాయి. కొంతమంది ఏజెంట్లు ఒకేసారి పెద్ద సంఖ్యలో టికెట్లను బుక్ చేసుకుంటారు. ఈ కారణంగా సాధారణ ప్రయాణీకులకు సీట్లు అందుబాటులో ఉండవు. చాలా మంది ప్రయాణీకులు టికెట్లు బుక్ చేసుకున్న తర్వాత ప్రయాణించరు. దీనివల్ల అవసరం ఉన్నవారికి సీట్లు లభించవు. ఈ కారణాలతో వెయిటింగ్ లిస్టు పెరుగుతోంది.
60 రోజుల ముందస్తు బుకింగ్ రూల్స్
రైల్వే తీసుకొచ్చిన తాజా నిబంధనల ప్రకారం ముందస్తు రిజర్వేషన్ వ్యవధి 120 రోజుల నుంచి 60 రోజులకు తగ్గించారు. వెయిటింగ్ టికెట్ జనరల్ కోచ్ లలో మాత్రమే చెల్లుతుంది. తత్కాల్ బుకింగ్ సమయం ACకి ఉదయం 10 నుంచి, నాన్ ACకి ఉదయం11 నుంచి ప్రారంభం అవుతుంది. రైలు రద్దు లేదంటే 3 గంటలకు మించి ఆలస్యం అయితే రీఫండ్ అందిస్తారు. విదేశీ పర్యాటకులకు 365 రోజుల ముందస్తు బుకింగ్ సౌకర్యం కొనసాగుతుంది.
Read Also: ఆ టికెట్లను ఆన్‌లైన్‌లోనూ క్యాన్సిల్ చేసుకోవచ్చు: రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్
వెయిటింగ్ లిస్టు ఎందుకు పెరుగుతోంది?
గతంతో పోల్చితే తక్కువ బుకింగ్ టైమ్ ఉంటుంది. 60 రోజుల ముందుగానే టిక్కెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉండటంతో ప్రయాణీకులు ఫాస్ట్ గా రిజర్వేషన్ చేసుకుంటున్నారు. ఫలితంగా సీట్లు త్వరగా నిండిపోయి, వెయిటింగ్ లిస్టు పెరుగుతోంది. సీట్లు పరిమితంగా ఉండి, ప్రయాణీకుల సంఖ్య ఎక్కుగా ఉన్న నేపథ్యంలో వెయిటింగ్ లిస్టు ఎక్కువ అవుతుంది. ఈ ఇబ్బంది లేకుండా ఉండాలంటే ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవడం ఉత్తమం. రైల్వే సంస్థ తీసుకొచ్చిన ఈ కొత్త రూల్స్ ప్రకారం లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అదే సమయంలో కచ్చితంగా ప్రయాణం చేయాలనుకునే వాళ్లు ముందుగానే సరైన ప్లాన్ చేసుకోని, టికెట్లు బుక్ చేసుకోవాలంటున్నారు.
Read Also: ట్రైన్ టాయిలెట్స్‌లో నీళ్లు రాకపోతే రైల్వే మనకు డబ్బులు చెల్లిస్తుందా? రూల్స్ ఏం చెబుతున్నాయి?
Read Also: హైదరాబాద్ నుంచి మనాలి టూర్ ప్లాన్ చేస్తున్నారా? జస్ట్ రూ. 12 వేలలో వెళ్లి రావచ్చు తెలుసా?