Big Stories

Pawan kalyan – Mahesh Babu : పవన్ కళ్యాణ్‌తో మహేష్ పోరు.. బాక్సాఫీస్ ఫైట్‌లో వెనుకడుగు వేసేదెవరో!

Share this post with your friends

Pawan kalyan – Mahesh Babu : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. సూపర్ స్టార్ మహేష్ మరోసారి బాక్సాఫీస్ దగ్గర పోటీ పడబోతున్నారా? అంటే అవుననే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. అంటే ఇద్దరు బడా స్టార్స్ సినిమాలు ఒకే రోజున రిలీజ్ కాబోతున్నాయన్నమాట. అంటే అసలు వీరిద్దరూ చేస్తోన్న సినిమాల్లో ఏ మూవీస్ ఒకే రోజున విడుదలవుతాయనే వివరాల్లోకి వెళితే.. పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో రూపొందుతోన్న పీరియాడిక్ మూవీ ‘హరి హర వీర మల్లు’. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 28న విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారట. ప్రస్తుతం సినిమా ఫైనల్ లెగ్ చిత్రీకరణ జరుగుతుంది.

మరో వైపు సూపర్ స్టార్ మహేష్ హీరోగా స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా తరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ఆరంభం అనే సినిమా టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఈ సినిమాను కూడా ఏప్రిల్ 28న విడులద చేయబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. అంటే ఓ వైపు పవన్ కళ్యాణ్, మరో వైపు మహేష్ బాబు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడబోతున్నారన్నమాట. ఇలా ఒకే రోజున ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు విడుదలైతే మాత్రం డిస్ట్రిబ్యూటర్స్‌కి కాస్త ఇబ్బందికరమే. మరి ఇద్దరు అగ్ర హీరోల సినిమాలను ఒకే రోజున రిలీజ్ చేయిస్తారా? లేక ఎవరిదైనా వాయిదా వేయిస్తారా? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.


Share this post with your friends

ఇవి కూడా చదవండి

Latest News