Big Stories

RajaSingh : ఇక జైల్లోనే రాజాసింగ్!.. పీడీ యాక్ట్ పై కీలక నిర్ణయం

RajaSingh : జైల్లో ఉన్న బీజేపీ ఎమ్మెల్యే మరింత కాలం కారాగారంలోనే ఉండాల్సిన పరిస్థితి. ఆయనపై నమోదైన పీడీ యాక్ట్ ను అడ్వైజరీ బోర్డ్ సమర్థించింది. పీడీ యాక్టును తొలగించాలంటూ రాజాసింగ్ ఇటీవల అడ్వైజరీ బోర్డును ఆశ్రయించారు. అయితే, పోలీసులు పలు వీడియో క్లిపింగ్స్ తో పీడీ యాక్ట్ పెట్టేందుకు దారి తీసిన కారణాలపై పకడ్బందీ నివేదిక ఇచ్చారు. ఆ రిపోర్ట్ పరిశీలించిన బోర్డ్.. పీడీ యాక్టు అక్రమంగా ప్రయోగించారనేందుకు సరైన ఆధారాలు లేవని తెలిపింది. దీంతో.. గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు నిరాశే మిగిలింది.

- Advertisement -

మరోవైపు రాజాసింగ్ ను బీజేపీ నుంచి సస్పెండ్ చేసి అధిష్టానం షోకాజ్ నోటీసులు ఇవ్వగా.. తన వ్యాఖ్యలపై పార్టీకి వివరణ ఇచ్చారు. తాను ఎలాంటి విధ్వేష పూరిత వ్యాఖ్యలు చేయలేదని.. తనను టార్గెట్ చేసేందుకు అధికార టీఆర్ఎస్ కుట్ర చేసిందంటూ చెప్పుకొచ్చారు. అయితే, రాజాసింగ్ వివరణ ఇచ్చి వారాలు గడుస్తున్నా.. బీజేపీ మాత్రం ఇంకా ఆయన సస్పెన్షన్ ను ఎత్తివేయలేదు. ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా స్టేటస్ కో పాటిస్తోంది. అయితే, పార్టీ వేటు వేసినా.. శ్రేణులు మాత్రం రాజాసింగ్ కు మద్దతుగా నిలుస్తున్నారు. బీజేపీ ఈవెంట్స్ లో రాజాసింగ్ ఫ్లెక్సీలు, నినాదాలు ప్రముఖంగా కనిపిస్తున్నాయి.. వినిపిస్తున్నాయి. ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 టోర్నీలోనూ స్టేడియంలో రాజాసింగ్ ఫోటోను ప్రదర్శించాడు ఓ అభిమాని. ఇలా జైలుకు వెళ్లినప్పటి నుంచీ రాజాసింగ్ ఫాలోయింగ్ మరింత పెరిగిపోతోంది.

- Advertisement -

ఇలాంటి కీలక సమయంలో.. పీడీ యాక్టు తీసేస్తే.. జైలు నుంచి విడుదలైతే.. కాస్త ఊరట లభిస్తుందని భావించిన రాజాసింగ్ కు అడ్వైజరీ బోర్డు నిర్ణయం ఊహించని షాక్. మరికొన్ని రోజులు జైల్లోనే ఉండాల్సి రావడం రాజకీయంగా ఇబ్బందికరం.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News