Folk Singer Shruthi: ఈ జనరేషన్ కు ఏమవుతుందో అస్సలు అర్ధం కావడం లేదు. చిన్న చిన్న విషయాలకు ఆత్మహత్యలు చేసుకొని ప్రాణాలు విడిచి కన్న తల్లిదండ్రులకు కడుపుకోతను మిగులుస్తున్నారు. పరీక్షల్లో తప్పితే ఆత్మహత్య.. తల్లిదండ్రులు తిడితే ఆత్మహత్య.. ప్రేమించినవాడు వదిలేస్తే ఆత్మహత్య.. ఇలా చిన్న చిన్న విషయాలను కూడా తట్టుకోలేక ప్రాణాకు తీసుకుంటున్నారు. తాజాగా ఒక ఫోక్ సింగర్ ఆత్మహత్య చేసుకోవడం ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తోంది.
ఆమె గొంతు వింటే ఎవరికైనా ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది. ముఖ్యంగా జానపదాలు పాడుతుంటే.. మైమర్చిపోయేవారు ప్రేక్షకులు. పెద్ద సింగర్ కావాలని కలలు కన్నది. సింగింగ్ షోస్ లో కూడా పాల్గొని తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. ఇక అంతేనా ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని మొదలుపెట్టింది. పెళ్లి చేసుకొని 20 రోజులు కూడా కాలేదు. ఆత్మహత్య చేసుకొని శవమై కనిపించింది. ఆమె పేరు శృతి. ఫోక్ సింగర్ గా తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న శృతి.. ఆత్మహత్య చేసుకుంది. దానికి కారణం ప్రేమించినవాడే అని తెలుస్తోంది.
Game Changer: ధోప్.. ధోప్ ప్రోమో.. శంకర్ మార్క్ కనిపిస్తుందిగా
వివరాల్లోకి వెళితే .. నిజామాబాద్ జిల్లాకు చెందిన శృతికి చిన్నతనం నుంచి సింగర్ అవ్వాలని కోరిక. ఆ కోరికతోనే కష్టపడి ఫోక్ సింగర్ గా మారి మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఇక ఆ సమయంలోనే ఆమెకు.. సిద్ధిపేట జిల్లా పీర్లపల్లి గ్రామానికి చెందిన దయాకర్ అనే యువకుడు సోషల్ మీడియా ద్వారా పరిచయమయ్యాడు. ఇద్దరి పరిచయం ప్రేమగా మారి.. పెళ్ళికి దారితీసింది. 20 రోజుల క్రితమే ఈ జంట రహస్యంగా పెళ్లి చేసుకున్నారు.
పెళ్లి తరువాత శృతిని దయాకర్ ఇంటికి వెళ్లి అమ్మానాన్నలకు పరిచయం చేశాడు. ఇక అప్పటి నుంచి ఆమెకు అత్తింట్లో వేధింపులు మొదలయ్యాయి. కట్నం తీసుకురావాలని అత్తమామల పోరు ఎక్కువైంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న వాడు కూడా కాలయముడుగా వేధించడం మొదలుపెట్టాడు.
Prabhas: వారికి క్షమాపణలు చెప్పిన ప్రభాస్.. వీడియో వైరల్
ఇక ఆ వేధింపులు తట్టుకోలేని శృతి.. ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొని మృతి చెందింది. కన్నకూతురు మరణ వార్త విన్న తల్లిదండ్రులు గుండెలు అవిసేలా ఏడుస్తున్నారు. తన కూతురును భర్త, అత్తమామలే చంపారని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎంతో ఉన్నతమైన భవిష్యత్ ఉన్న శృతి.. ఇలా ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇది హత్యనా ..? ఆత్మహత్యనా.. ? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.